EPAPER

YCP Fake Votes : వైసీపీకి ఫేక్ ఓట్ల షాక్.. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు ఆగ్రహం..

YCP Fake Votes : అధినేతను ఒప్పించి వారసులను ఎన్నికల బరిలో దింపడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు.. వారి విజయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ.. ఇక ఎన్నికల నోటిపికేషన్ వస్తుందనుకున్న సమయంలో నకిలీ ఓట్ల వివాదం రచ్చ మొదలైందక్కడ.. దాంతో అది ఎక్కడ వారసులకు బ్యాడ్ ఇమేజ్ తెస్తుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట సదరు ఎమ్మెల్యేలు.. సదరు వారసులు రంగ ప్రవేశం చేసిన ఆ రెండు సెగ్మెంట్లలో జరుగుతున్న దొంగ ఓట్ల రచ్చ.. ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వడంతో సదరు నేతలు తెగ ఇదై పోతున్నారంట.

YCP Fake Votes : వైసీపీకి ఫేక్ ఓట్ల షాక్.. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు ఆగ్రహం..

YCP Fake Votes : అధినేతను ఒప్పించి వారసులను ఎన్నికల బరిలో దింపడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు.. వారి విజయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ.. ఇక ఎన్నికల నోటిపికేషన్ వస్తుందనుకున్న సమయంలో నకిలీ ఓట్ల వివాదం రచ్చ మొదలైందక్కడ.. దాంతో అది ఎక్కడ వారసులకు బ్యాడ్ ఇమేజ్ తెస్తుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట సదరు ఎమ్మెల్యేలు.. సదరు వారసులు రంగ ప్రవేశం చేసిన ఆ రెండు సెగ్మెంట్లలో జరుగుతున్న దొంగ ఓట్ల రచ్చ.. ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వడంతో సదరు నేతలు తెగ ఇదై పోతున్నారంట.


తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి .. ఒకటి పవిత్ర వెంకటేశ్వరుని పాదాల చెంత ఉన్న నియోజకవర్గం కాగా, మరొకటి విజయనగర రాజుల సామాజ్రానికి చిట్టచివరి రాజధాని. అంతటి ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్లలో ఫేక్ ఓట్ల నమోదు వ్యవహారం కలకలం రేపుతోందిప్పుడు.. ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా తయారైందంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు వారసులు శాసనసభలోకి అడుగు పెట్టడానికి సిద్దమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డ దొంగ ఓట్ల నమోదు ఉదంతం వివాదాస్పదంగా తయారైంది.

రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్, లోకల్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూమారుడు తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. చంద్రగిరి నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, తిరుపతి రూరల్ ఎంపీపీ, తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డిలను కేండెట్లుగా జగన్ ఓకే చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు, తనకు అత్యంత సన్నిహితులైన భూమన, చెవిరెడ్డిల కోరిక మేరకు వారి పుత్రరత్నాలకు ఏడాదిన్నర క్రితమే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు వైసీపీ అధినేత.. దాంతో వారు అప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.


ఆ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బయట ప్రాంతాల వారిని తీసుకొచ్చి చంద్రగిరి సెగ్మెంట్ ఓటర్లుగా నమోదు చేయించారని.. చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని ఏడాదిన్నర క్రితం నుంచే ఆందోళనపధం పట్టారు.. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కొడుకు మోహిత్‌రెడ్డి నేతృత్వంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదులు కూడా చేశారు.

అయితే ఫాం 7 ద్వారా టీడీపీ కూడా తమ ఓట్లను తొలగిస్తుందని మోహిత్ రెడ్డి అరోపించారు. ఆ ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడింది. దాంటో 35 వేల ఓట్లను నూతనంగా చేర్చారని.. అవన్ని సమీప నియోజకవర్గాల వారివని టీడీపీ నేత పులవర్తి నాని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. ఈ నెల 7న దీక్షలో ఉన్న నానిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. అది స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రగిరిలో ఏకంగా లక్ష నకీలి ఓట్లు నమోదు చేయించారని జాతీయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చుట్టు పక్కల నియోజకవర్గాల వారిని చంద్రగిరి ఓటర్లుగా నమోదు చేయించారని ఆధారాలు కూడా సమర్పించారు. అలాగే పోలింగ్ బూత్‌లు ఏక పక్షంగా పెంచడాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

అదే సమయంలో 2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా.. తిరుపతి నగరంలో జరిగిన పోలింగ్ అవకతవకలు, ఓటర్ల కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంపై ఈసీకి గతంలో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు అయ్యాయి. కలెక్టర్లు, ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన మీటింగ్లో దానిపై చర్చ జరిగింది .. ఆ ఎన్నికల సమయంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన.. ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరిషాను ఆయన లాగిన్ నుంచి 35 ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ అవ్వడంపై ఈసీ నిలదీసింది. దాంతో పాటు తిరుపతి కలెక్టర్‌ను చంద్రగిరి ఓట్లర జాబితా వివరాలు అడిగింది. మరో వైపు పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై పోలీసు ఉన్నతాధికారులను మందలించింది.

మందలింపులతోనే ఆ తతంగం ముగిసిందనుకుంటున్న సమయంలో.. ఈసీ చర్యలకు దిగింది.. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గీరిషాను సస్పెండ్ చేసింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో గిరీషాపై ఈసీ వేటు వేసింది. ఉపఎన్నిక సమయంలో తిరుపతి ఆర్వోగా గిరీషా పనిచేశారు. నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీ కోసం అప్పటి ఆర్వో.. అధికారిక లాగిన్‌ను వినియోగించుకోవడంపై ఈసీ సీరియస్ అయింది. ఓ ఐఏఎస్ అధికారిపై ఎన్నికల యంత్రాగం చర్య తీసుకోవడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా స‌ృష్టించింది.

అలాగే మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడగా.. మరో ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. అయితే ప్రతిపక్షాలు పాత్రదారులు కాదు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో.. వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు అందోళనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మరో 13మంది పోలీసు అధికారులపై వేటు పడనుందనే ప్రచారం మొదలవ్వడంతో.. ఆ డిపార్ట్‌మెంట్ వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో నకిలీఎపిక్ కార్డులపై ఇటీవల మరో కేసు నమోదు అయ్యింది. దాంతో జాతీయ ఎన్నికల కమిషన్ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలపై సీరియస్‌గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శుభమా అని కూమారులును శాసన సభకు పంపడానికి ప్రయత్నిస్తుంటే.. ఈ ఫేక్ ఓట్లర గొడవ ఏంటా అని తలలు పట్టుకుంటున్నారంట భూమన, చెవిరెడ్డిలు.. ఈ వ్యవహారం ఇంత ముదరడం వెనుక తమ పార్టీ నేతలు కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయంట.. మొత్తమ్మీద తమ కొడుకులకు ఇది నెగిటివ్‌గా మారుతుందేమోనని టెన్షన్ పడిపోతున్నారంట. దానికి తోడు టీడీపీ, జనసేనలు తిరుపతి ఇష్యూని రాష్ట వ్యాప్తంగా ప్రచారం చేస్తూ.. గెలుపుకోసం అధికార పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ప్రచారం చేస్తుండటం వారికి తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేలేండి పవర్‌లో ఉంది వైసీపీనే.. తమ ప్రభుత్వంలోని అధికారులపైనే వేటు పడుతుంటే ఆ మాత్రం టెన్షన్ సహజమేగా..

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×