EPAPER

Types of US Visa : అమెరికా వీసాలు.. విశేషాలు!

Types of US Visa : అమెరికా వీసాలు.. విశేషాలు!
Types of US Visa

Types of US Visa : ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలని, వీలైతే అక్కడే స్థిరపడాలనేది చాలా మంది కల. ఇక కొందరు సరదాగా చూసొద్దమని, కొందరు మెరుగైన వైద్య చికిత్స కోసం.. ఇంకొందరు ఉద్యోగం, బిజినెస్, చదువు ఇలా అమెరికా వెళ్తుంటారు. అయితే, అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలంటే.. ఆయా పనిని బట్టి వేర్వేరు వీసాలు తీసుకోవాలి. దేనికి ఏ వీసా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.


అమెరికా చూద్దామని వచ్చే విదేశీ సందర్శకులకు ‘బీ-2’వీసా ఇస్తారు. విదేశీయులు అమెరికాలో ఉన్న తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిసేందుకు వెళ్లాలంటే ఈ వీసా తీసుకోవాలి. అక్కడ ఉన్న తమ ఫ్యామిలీ శుభకార్యాలు, ఇతర పార్టీలలో పాల్గొనాలన్నా ‘బీ-2’వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అలాగే.. అమెరికాలో వైద్య చికిత్స కోసం వెళ్లాలంటే… బీ-2 వీసా దరఖాస్తు చేసుకోవాలి. ఈ వీసా పొందాలంటే రోగికి అమెరికాలో చికిత్స తప్పనిసరనీ, ఆ చికిత్స తమ దేశంలో అందుబాటులో లేదని నిరూపించాల్సి ఉంటుంది. అలాగే ఆ చికిత్స ఖర్చును భరించగలమనే ఆధారాలూ ఇవ్వాలి. మీరు ఇంతకుముందు చికిత్స తీసుకున్న వైద్యుడు, యూఎస్ హెల్త్‌కేర్ అధికారుల నుంచి లేఖ తీసుకోవడం తప్పనిసరి.

‘హెచ్-1బీ’ వీసా ద్వారా అమెరికా కంపెనీలు …ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీ నిపుణులను తమ సంస్థలలో ఉద్యోగులుగా నియమించుకుంటాయి. ‘హెచ్-2ఏ’, ‘హెచ్-2బీ’ వీసాల ద్వారా అమెరికన్ సంస్థలు విదేశీయులను తాత్కాలికంగా వ్యవసాయ, వ్యవసాయేతర జాబ్స్‌లో నియమించుకోవచ్చు. అలాగే ‘హెచ్-3’ వీసాను ట్రైనీస్‌కు జారీ చేస్తారు.


అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు ఇచ్చేదే ‘ఎఫ్-1’ వీసా. గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం, సెమినరీ లేదా కన్జర్వేటరీ, అకాడెమిక్ హైస్కూల్ లేదా ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్ధులుగా చేరేందుకు ఈ వీసాను జారీ చేస్తారు.

సాధారణంగా ఇంటర్నెషనల్ మెడికల్ విద్యార్థులు యూఎస్ జీఎంఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే జె-1 వీసా తప్పనిసరి. ఈ వీసాను విదేశీ మెడికల్ రెసిడెంట్స్ ఒకసారి ఒక ఏడాదికే పొడిగించుకునే వీలు ఉంది. అయితే, మొత్తంగా ఏడేళ్ల వరకు ఈ వీసాను ఎక్స్‌టెండ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే వైద్య నిపుణులు పరిశోధనలు, క్లినికల్ ప్రాక్టీస్‌ల కోసం హెచ్-1బీ వీసాపై కూడా వెళ్లొచ్చు.

అమెరికాలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇచ్చేది ‘ఈ’ వీసా. ఆ సంస్థలలో విదేశీ పెట్టుబడిదారుడు 50 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి ఉంటే ‘ఈ-2’ వీసాకు అర్హులవుతారు.
ఎల్-1వీసా: విదేశీ వ్యాపారవేత్తలు అమెరికాలో వ్యాపారాన్ని నెలకొల్పడానికి పనికొస్తుంది.

తమ రంగంలో సాధించిన విజయాలకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విదేశీ నిపుణులు ఓ వీసాకు అర్హులు. శాస్త్రాలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్‌లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారికి ఓ-1ఏ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అందుబాటులో ఉంటుంది. నటులు, ఇతర మీడియా నిపుణులకు ఓ-1బీ వీసా కావాలి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×