EPAPER

Palakollu Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పాలకొల్లులో నిమ్మలకు ఎదురులేదా..?

Palakollu Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పాలకొల్లులో నిమ్మలకు ఎదురులేదా..?
Palakollu Assembly Constituency

Palakollu Assembly Constituency : ఏపీలో వీఐపీ నియోజకవర్గం పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక్కడి వారే.. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులకు పాలకొల్లు కేరాఫ్ అడ్రస్.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు గట్టి పట్టున్న ప్రాంతంగా చెప్పే పాలకొల్లు నియోజకవర్గంలో గడచిన రెండు ఎన్నికల్లో గెలుపు టీడీపీదే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన పాలకొల్లులో ఇంతవరకు వైసీపీ బోణీకొట్టలేకపోయింది. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం. మరి ఇలాంటి నియోజకవర్గంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు.. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌ను తట్టుకొని బంపర్‌ విక్టరీ సాధించారు. వ్యక్తిగతంగా కష్టించి పనిచేయడంతోనే రెండోసారి విజయాన్ని సాధించారని చెబుతుంటారు. మరి ఇలాంటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉంది? వారి అభిప్రాయమేంటి? అనేది తెలుసుకునే ముందు 2019 ఎన్నికల ఫలితాలను చూద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..

సత్యనారాయణమూర్తి vs నిమ్మల రామానాయుడు ( గెలుపు )
YCP 32%
TDP 43%
JANASENA 21%
OTHERS 4%


2014 ఎన్నికల తర్వాత మళ్లీ పాలకొల్లు నుంచే టీడీపీ తరపున బరిలోకి దిగారు నిమ్మల రామానాయుడు. ఓ వైపు రాష్ట్రంలో వైసీపీ హవా కొనసాగుతున్న 2014 ఎన్నికల కంటే 6.9 శాతం ఎక్కువ ఓట్‌ షేర్‌ సాధించారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన సత్యనారాయణ మూర్తి కేవలం 32 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. జనసేన తరపున పోటీ చేసిన గున్నం నరసింహ నాగేందర్ రావు 21 శాతం ఓట్లు సాధించారు. ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు సాధించారు. మరి ఈసారి ఎన్నికల్లో గెలిచేదేవరు? నిలిచేదేవరు? అన్నది బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

నిమ్మల రామానాయుడు (TDP) ప్లస్‌ పాయింట్స్‌
ప్రజల్లో మంచిపేరు ఉండటం
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడటం
ప్రజలతో నిత్యం టచ్‌లో ఉండటం
విపక్షంలో ఉన్నా నిధులు సాధించడంలో విజయం
పార్టీ క్యాడర్‌లో ఎలాంటి అసంతృప్తులు లేకపోవడం
జనసేనతో కలిసి వచ్చే పొత్తు

గుడాల హరి గోపాల్ (YCP) ప్లస్ పాయింట్స్‌
క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉండటం
ఇంటింటి ప్రచారం చేయడం

గుడాల హరి గోపాల్ మైనస్‌ పాయింట్స్‌
ఇటీవలే రాజకీయాల్లో ఎంట్రీ
సరైన రాజకీయ అనుభవం లేకపోవడం
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు
నిమ్మల రామానాయుడుకు సరైన పోటీ ఇచ్చే సత్తా లేకపోవడం

కులాల లెక్కలు..
ఎస్సీ 26 శాతం
కాపు 17 శాతం
శెట్టి బలిజ 15 శాతం
తూర్పు కాపు 7 శాతం
ముస్లిం 7 శాతం
క్షత్రియ 6 శాతం

పాలకొల్లు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఎస్సీ సామాజిక వర్గానిది.మొత్తం ఓటర్లు 26 శాతం ఉండగా.. ఇందులో మెజారిటీ అంటే 55 శాతం ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం నిమ్మల రామానాయుడుగా తెలుస్తోంది. ఇక అధికార వైసీపీకి 40 శాతం మద్దతిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు అధికార పార్టీకి మద్ధతిస్తున్నారు. ఇక ఇతరులకు 5 శాతం మద్ధతిస్తున్నారు. ఇక 17 శాతమున్న కాపుల్లో 60 శాతం మంది టీడీపీ కూటమికి మద్ధతిస్తామని బిగ్‌ టీవీ సర్వేలో తెలిపారు. వైసీపీకి 35 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వేస్తామన్నారు. ఇక 15 శాతమున్న శెట్టి బలిజల్లో టీడీపీకి 50 శాతం, వైసీపీకి 45 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతిస్తున్నారు. 7 శాతం ఉన్న తూర్పు కాపుల్లో టీడీపీకి 55 శాతం, వైసీపీకి 40 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఏడు శాతమున్న ముస్లింలలో మెజారిటీ ఓట్లు అంటే 55 శాతం ఓట్లు వైసీపీకి పడనున్నాయి. టీడీపీకి 40 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఆరు శాతమున్న క్షత్రియ సామాజిక వర్గ ఓట్లలో కూడా 50 శాతం వైసీపీకి, 45 శాతం టీడీపీకి, ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాముందని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఇక వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

గుడాల హరిగోపాల్ రావు vs నిమ్మల రామానాయుడు
YCP 39 శాతం
TDP 54 శాతం
OTHERS 7 శాతం

బిగ్‌ టీవీ సర్వే ప్రకారం పాలకొల్లులో నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా అని తెలుస్తోంది. ఆయనకు ఏకంగా 54 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. జనసేన మద్ధతివ్వడంతో గతంలో కంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక వైసీపీ నుంచి గుడాల హరిగోపాల్ రావు బరిలోకి దిగితే ఆయనకు 39 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 7 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×