EPAPER

Nawaz Sharif | ‘పాకిస్తాన్ ప్రపంచంలో చాలా వెనుకబడిపోయింది.. పుంజుకోవడం కష్టమే!’

Nawaz Sharif | పాకిస్తాన్ ప్రపంచ దేశాలకంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయిందని.. దానిని మళ్లీ గాడిలో పెట్టడం అంత సులభం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టాయి.

Nawaz Sharif | ‘పాకిస్తాన్ ప్రపంచంలో చాలా వెనుకబడిపోయింది.. పుంజుకోవడం కష్టమే!’

Nawaz Sharif | పాకిస్తాన్ ప్రపంచ దేశాలకంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయిందని.. దానిని మళ్లీ గాడిలో పెట్టడం అంత సులభం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టాయి. 24 కోట్ల జనాభా గల పాకిస్తాన్‌లో రాజకీయ పార్టీలన్నీ ప్రజల ఓట్లు దక్కించకోవడానికి ఏ అవకాశాన్ని వదలడంలేదు.


ఈ క్రమంలో ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ సోమవారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం మన్‌సెహ్రా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అక్కడ ఓ సభల ప్రసంగిస్తూ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దీనస్థితి గురించి మాట్లాడారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని.. దాన్ని మళ్లీ పునర్మించాలని ఆయన చెప్పారు.

గత పదేళ్లలో పాకిస్తాన్‌ని పూర్తిగా నాశనం చేశారని.. పాకిస్తాన్ తెహ్రీకె ఇన్సాఫ్(ఇమ్రాన్ ఖాన్ పార్టీ) దీనికి కారణమని మండిపడ్డారు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసిగించిదన్నారు. ఇంతకుముందు తాను మూడు సార్లు దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేశానని.. అప్పుడు పాక్ ఆర్థిక వ్యవస్థను ఎంతో బలోపేతం చేశానని గుర్తుకు చేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ రూపాయి కరెన్సీ మారక విలువ అమెరికా డాలర్‌తో పోల్చితే 104 రూపాయలకు ఎప్పుడూ దాటలేదని చెప్పారు. పాకిస్తాన్‌లో కరెంటు కోతలు లేకుండా చేశానని అన్నారు.


మన్‌సెహ్రా నుంచి తాను పోటీచేస్తున్నట్లు.. తనకు ఓట్లు గెలిపిస్తే.. మన్‌సెహ్రా నగరంలో ఒక ఎయిర్ పోర్టు, ఒక యూనివర్సిటీ, అలాగే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నవాజ్ షరీష్ భరోసా ఇచ్చారు.

Nawaz Sharif, admit, rebuild, Pakistan Economy, easy task, Pakistan Muslim League, Mannsehra, Pakistan elections,

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×