EPAPER

Cigarette Smoking : ఓమైగాడ్.. సిగిరెట్ ఒక్కసారిగా మానేస్తే ఇలా జరుగుతుందా..!

Cigarette Smoking : మద్యపానం,ధుమపాన ఆరోగ్యానికి హానికరమని మన అందరికీ తెలుసు. సినిమా చూసే మొదట్లో ముఖేష్ కూడా చెప్తాడు ఇదే మాట. సిగిరెట్ పెట్టెపై కూడా ఇదే రాసి ఉంటుంది. కానీ స్మోకింగ్ మాత్రం మానలేరు. ఒక్కసాకి సిగిరెట్ అలవాటైందా.. ఒత్తిడి తగ్గడానికి, టైమ్ పాస్‌కి, ఫ్యాషన్ కోసం కూడా తాగేస్తాం సిగిరెట్. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు.. అయినా మానలేం. ఈ రోజుల్లో మనవారే కాదు.. మహిళలు కూడా సిగిరెట్ స్మోకింగ్‌కు బానిసలయ్యారు. పొగ కాల్చే వారికే కాదు..పీల్చే వారికి కూడా ఆనారోగ్య సమస్యలు వస్తాయి.

Cigarette Smoking : ఓమైగాడ్.. సిగిరెట్ ఒక్కసారిగా మానేస్తే ఇలా జరుగుతుందా..!

Cigarette Smoking : మద్యపానం, ధుమపాన ఆరోగ్యానికి హానికరమని మన అందరికీ తెలుసు. సినిమా థియేటర్లలో షోకు ముందు ముఖేష్ కూడా చెప్తాడు ఇదే మాట. సిగిరెట్ పెట్టెపై కూడా ఇదే రాసి ఉంటుంది. కానీ స్మోకింగ్ మాత్రం మానలేరు. ఒక్కసాకి సిగిరెట్ అలవాటైందా.. ఒత్తిడి తగ్గడానికి, టైమ్ పాస్‌కి, ఫ్యాషన్ కోసం కూడా తాగేస్తాం సిగిరెట్. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు.. అయినా మానలేం. ఈ రోజుల్లో మగవారే కాదు.. మహిళలు కూడా సిగిరెట్ స్మోకింగ్‌కు బానిసలయ్యారు. పొగ కాల్చే వారికే కాదు.. పీల్చే వారికి కూడా ఆనారోగ్య సమస్యలు వస్తాయి.


స్మోకింగ్‌‌కు బానిసలయ్యే వారిలో ఉపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఆస్తమా.. ఇలా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సిగిరెట్, చుట్ట, బీడీలలో ఉండే నికోటిన్ వ్యసనపరులుగా మారుస్తుంది. అందుకే ఎంత కంట్రోల్ చేసుకున్న మనసు మళ్లీ మళ్లీ తాగాలని లాగేస్తుంది. ఒక వేళ మీరు ఉన్నట్టుండి సిగిరెట్ మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..!

సిగిరెట్ స్మోకింగ్ మానేయడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఈ అలవాటు ఉన్న వారు ఒక్కరోజు సిగిరెట్ మానేస్తే.. ముఖ్యంగా తలనొప్పి వస్తుంది. దీనితోపాటు ఆకలి, అలసట, నిద్రలేమి, మలబద్ధకం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి.


సిగిరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వారి శరీరం నికోటిన్‌కు అలవాటు పడుతుంది. దీని వల్ల ఒక్కసారిగా నికోటిన్ తీసుకోవడం మానేస్తే.. తలనొప్పి బాధిస్తుంది. కాబట్టి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీని ఫాలో అవ్వండి.

మీ సన్నిహితులకు, కుటుంబసభ్యులకు సిగిరెట్ స్మోకింగ్ మానేస్తున్నట్లు చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు మిమ్మల్ని స్మోకింగ్ చేయమని ప్రేరేపించరు. అవసరమైతే ఈ విషయంలో మీకు సపోర్ట్‌గా ఉంటారు. వారితో ఎక్కువ సమయం మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదంటే డీ అడిక్షన్ థెరపీ సెంటర్లో చేరండి.

సిగిరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వారు ప్రతి భోజనం తర్వాత స్మోక్ చేస్తారు. ఇలాంటి వారు సిగిరెట్‌కు బదులుగా చేయింగ్ గమ్‌లో నమలడం అలవాటు చేసుకోండి. చూయింగ్ గమ్‌లు పొగాకు కోరికలను అణచి వేయడంలో సహాయపడతాయి. లేదా పచ్చి క్యారెట్లు తినడం వల్ల పొగాకు కోరికను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎక్సర్‌సైజ్ చేయడం మీ దిన చర్యలో చేర్చుకోండి. దీని వల్ల స్మోకింగ్ చేయాలనే కోరికలు తగ్గే అవకాశం ఉంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ధూమపానం నుంచి మీ ధ్యాసను మరల్చడానికి ఎక్సర్‌సైజ్ ఉత్తమంగా నిలుస్తుంది. వాకింగ్, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేసిన చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు.

సిగిరెట్ మానేసిన ఎంత సమయానికి ఏయే మార్పులు వస్తాయో చూద్దాం..

  • 20 నిమిషాల పాటు సిగిరెట్ స్మోకింగ్ మానేస్తే.. హార్ట్ బీట్ బాగుంటుంది
  • 8 గంటలు సిగిరెట్ మానేస్తే.. రక్తంలోని నికోటిన్ స్థాయిలు సగానికి తగ్గుతాయి
  • 12 గంటలు సిగిరెట్ మానేస్తే.. రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు సగానికి తగ్గిపోతాయి
  • 24 గంటలు సిగిరెట్ మానేస్తే.. కార్బన్ మోనాక్సైడ్ దగ్గు రూపంలో గొంతు నుంచి వెళ్లిపోతుంది
  • 72 గంటలు సిగిరెట్ మానేస్తే.. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి
  • 1-2 వారాలపాటు సిగిరెట్ మానేస్తే.. ఊపిరితిత్తులు శరీరానికి మరింత గాలిని పంపిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది
  • 1 నెల సిగిరెట్ మానేస్తే.. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చర్మం మీద ముడతలు కూడా తగ్గుతాయి
  • 15 సంవత్సరాలు సిగిరెట్‌కు దూరంగా ఉంటే.. గుండెపోటు వచ్చే ప్రమాదాల నుంచి బయటపడతారు

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×