EPAPER

Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్.. మరమ్మతులు చేసినా పనికి రాదా..?

Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్.. మరమ్మతులు చేసినా పనికి రాదా..?

Medigadda Barrage : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో విధ్వంసం ఏ రేంజ్‌లో ఉందో కెమెరాకు చిక్కింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం ప్రమాదంలో పడిపోయింది. 6, 7, 8 బ్లాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిల్లర్లు పగుళ్లు వచ్చాయి. గేటు బిగించిన పిల్లర్లు సైతం డ్యామేజ్ అయ్యాయి. మరమ్మతులు చేసినా బ్యారేజ్‌ నిలవడం కష్టమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజ్‌పై కాంక్రీట్‌ బ్లాకులు సైతం ఎక్కడికక్కడ పగుళ్లు తీశాయి. మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ భాగంలో కాంక్రీట్ బ్లాక్, ఫ్లోర్‌ దెబ్బతిన్నాయి. వరదలో డౌన్‌స్ట్రీమ్‌లో కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయి.


Medigadda barrage

మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం ఎంత నాణ్యత లేకుండా నిర్మించారో అర్థమవుతుంది. నాలుగు కాలాల పాటు ఉండాల్సిన మొత్తం ప్రాజెక్టును ప్రమాదంలో పడేశాయి. దీనికి కారకులు ఎవరు..? విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్పటికే దీనిపై ఫోకస్ చేశారు. ఫైళ్లను సైతం చెక్ చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేయనున్నారు. బ్యారేజ్‌కు రిపేర్లు చేసినా వేస్ట్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×