EPAPER

Srikakulam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. 2024 ఎన్నికల్లో సిక్కోలులో సీన్ మారుతుందా ?

Srikakulam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. 2024 ఎన్నికల్లో సిక్కోలులో సీన్ మారుతుందా ?

Srikakulam Assembly Constituency : ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన సిక్కోలు.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. తమ బతుకులు మారడం లేదన్నది అక్కడి లోకల్ టాక్. రాజకీయ ఉద్ధండులను చట్టసభలకు పంపిన ప్రాంతం శ్రీకాకుళం. ఈ నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్‌ నేతగా, రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ధర్మాన ప్రసాదరావు దిట్ట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే పోటీ చేయడం ఖాయం. తన మార్క్ పాలిటిక్స్ చూపించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మరో వైపు గుండ ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. మరి ఈసారి ఎవరెవరు బరిలోకి దిగితే రాజకీయాలు ఎలా ఉండనున్నాయని తెలుసుకునే ముందు.. ఒక్కసారి 2019 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.


2019 RESULTS

ధర్మాన ప్రసాదరావు VS గుండ లక్ష్మీదేవి


2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాద రావు ఏకంగా 47 శాతం ఓటు షేర్‌ సాధించి సిక్కోలులో విజయం సాధించారు. ఆయన పర్సనల్ ఇమేజ్‌తో పాటు.. వైసీపీ వేవ్‌ ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన గుండ లక్ష్మీ దేవి కూడా గట్టిపోటీనే ఇచ్చారు. అంతటి వైసీపీ వేవ్‌లో కూడా ఆమె 44 శాతం ఓట్లు సాధించారు. అయితే జనసేన నుంచి బరిలోకి దిగిన సర్వేశ్వర రావు 4 శాతం ఓట్లు సాధించారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ చరిష్మాతో ఆ ఓట్లు పోలయ్యాయని చెప్పాలి. ఇతరులకు 5 శాతం ఓట్లు పోలయ్యాయి. మరి ఈ సారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి.. టీడీపీ మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతుందా.. ఫ్యాన్‌ పార్టీ టాప్ స్పీడ్‌లో తిరుగుతుందా? రాబోయే ఎన్నికల్లో పరుగుకు సిద్ధం అవుతున్న రేసుగుర్రాలు ఎవరు అనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌లో సర్వే నిర్వహించింది. ఇప్పుడా వివరాలను చూద్దాం.

ధర్మాన ప్రసాదరావు(YCP) ప్లస్ పాయింట్స్

సమర్థవంతంగా సంక్షేమ పథకాల అమలు

ధర్మాన ప్రసాదరావు మైనస్‌ పాయింట్స్

ఎన్నికల హామీలు అమలుకాకపోవడం
ఎన్నికల తర్వాత ఎక్కువగా కనిపించకపోవడం
మంత్రి పదవి దక్కే వరకు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం
పదవికాలం ముగిసే సమయంలో శంకుస్థాపనలు చేయడం
సంక్షేమ పథకాల అమలు తప్ప ఇంకేం అభివృద్ధి జరగకపోవడం
రోడ్ల అభివృద్ధి జరగకపోవడం
నెరవేరని కలక్టరేట్‌ భవన నిర్మాణ హామీ
నెరవేరని శ్రీకాకుళం నగర అభివృద్ధి హామీ

గుండ లక్ష్మీదేవి (TDP) ప్లస్ పాయింట్స్

కలిసి రానున్న భర్త సూర్యనారాయణ రాజకీయ చరిష్మా
నియోజకవర్గంలో చాలా యాక్టివ్‌గా ఉండటం
అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం
అంగన్వాడీ, మున్సిపల్‌ సిబ్బంది బలమైన మద్ధతు
అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం
కలిసి రానున్న ప్రస్తుత ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత
నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్
జనసేనతో ఉన్న పొత్తు

గుండ లక్ష్మీదేవి మైనస్‌ పాయింట్స్‌

గత ఎన్నికల్లో ఓడిపోవడం
నియోకవర్గంలో ఉన్న గ్రూప్‌ తగాదాలు

Caste Politics

శ్రీకాకుళం నియోజకవర్గంలో పొలినాటి వెలమ సామాజిక వర్గ ప్రజలు 40 శాతం ఉన్నారు. ఇందులో వైసీపీ, టీడీపీకి సమానంగా 45 శాతం మద్దతు ఇస్తున్నారు. ఇక మిగిలిన 10 శాతం మంది ప్రజలు ఇతరులకు మద్దతిస్తామని బిగ్‌ టీవీ సర్వేలో తెలిపారు. ధర్మాన ప్రసాదరావు ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు.. మంత్రివర్గంలో ఉండటంతో ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవి కూడా ఇదే సామాజిక వర్గ నేత కావడంతో టీడీపీకి కూడా అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. అయితే టీడీపీ పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇదే సామాజిక వర్గ నేత కావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అవకాశం. అయితే చాలా మంది వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉన్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఇక మత్స్యకార సామాజిక వర్గ ఓటర్లు 12 శాతం ఉండగా.. ఇందులో వైసీపీకి 40 శాతం మద్దతిస్తుండగా.. టీడీపీ, జనసేన కూటమికి 55 శాతం మంది, ఇతరులకు 5 శాతం మద్ధతు పలుకుతున్నారు. వైసీపీ మద్ధతిచ్చే వారిలో మెజారిటీ ప్రజలు మత్స్యకార నేస్తం లబ్ధిదారులనే చెప్పాలి. అయితే ఇదే సామాజికవర్గంలో టీడీపీ, జనసేనకు సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద అనేక మంది సబ్సిడీ రేట్లకు బోట్లు కొనుగోలు చేసుకున్నారు.

ఇక కళింగ సామాజిక వర్గంలో ఉన్న 10 శాతం ఓటర్లలో మెజారిటీ వర్గం అంటే 50 శాతం మంది వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా కళింగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. ఇక 45 శాతం మంది ప్రజలు టీడీపీ కూటమికి జై కొడుతున్నారు. టీడీపీ హయాంలో బీసీ లోన్‌ పథకం కింద ఉన్న లబ్ధి పొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను నిలిపివేసింది. దీంతో వారంతా కూడా టీడీపీకి మద్ధతు పలుకుతున్నారు. ఇక 9 శాతం ఉన్న కళింగ వైశ్యుల్లో వైసీపీకి 45 శాతం మద్ధతు పలుకుతుండగా.. 55 శాతం మంది టీడీపీ కూటమికి, 5 శాతం మంది ఇతరులకు మద్ధతు పలుకుతున్నారు. నియోజకవర్గంలో 8 శాతం ఉన్న ఎస్సీ ఓటర్లలో 55 శాతం వైసీపీకి మద్దతు పలుకుతుండగా.. 40 శాతం టీడీపీకి, ఇతరులకు 5 శాతం మద్దతు పలుకుతున్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

ధర్మాన ప్రసాదరావు VS గుండ లక్ష్మీదేవి

ఇక వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాకుళంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా టీడీపీకే ఉన్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవికి 49 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. గతంలో జనసేన కారణంగా చీలిన 5 శాతం ఓట్లు కూడా ఈసారి టీడీపీకి పడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు 43 శాతం మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు తేలింది. ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

.

.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×