EPAPER

Ram charan: తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్.. నార్త్‌లో ఇంత క్రేజ్ ఉందా?

Ram charan: తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్.. నార్త్‌లో ఇంత క్రేజ్ ఉందా?

Ram charan: మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న చిరంజీవికి నార్త్‌లో మాత్రం పెద్దగా ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. కానీ రామ్ చరణ్‌ మాత్రం సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.


ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి అయోధ్య రామ మందిరంలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఈ తండ్రీ కొడుకులను అనిల్ అంబానీ పలకరించారు. అయితే అక్కడ ఎంతో మంది సెలబ్రెటీలు ఉండగా.. చిరు, చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో ఓ హిందీ న్యూస్ ఛానల్ వీరిని స్పెషల్‌గా కవర్ చేస్తూ చూపించింది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి.. ఎందుకు ఎక్కువ సేపు వాళ్లనే చూపిస్తున్నావు.. అక్కడ ఎవరు ఉన్నారంటూ అడగగా.. అక్కడ రామ్ చరణ్ ఉన్నారు. ఆయనతో పాటు రామ్ చరణ్ తండ్రి కూడా కనిపిస్తున్నారు.

అందుకే కవర్ చూస్తున్నా అని అంటాడు. దీనిబట్టి నార్త్‌లో రామ్ చరణ్‌ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. సాధారణంగా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అని గుర్తుపట్టాలి.. కానీ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని నార్త్ వాళ్లు అంటుంటే అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×