EPAPER
Kirrak Couples Episode 1

Rajahmundry Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజమండ్రి రాజ్యం ఎవరి కైవసం అవుతుంది..?

Rajahmundry Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజమండ్రి రాజ్యం ఎవరి కైవసం అవుతుంది..?
ap politics

Rajahmundry Assembly Constituency(AP Politics):

రాజమండ్రి.. తెలుగు భాషాభివృద్ధికి .. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. గోదారమ్మ పరుగులు.. పాపికొండల అందాలకు కేరాఫ్‌ రాజమండ్రి. ఏపీ సాంస్కృతిక రాజధానిగా పేరు సాధించిన ఈ ప్రాంతలో రాజకీయ చైతన్యమూ ఎక్కుే. ఓటర్ తీర్పు.. ఎప్పుడూ కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి భవాని.. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి మళ్లీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. దీనికి తోడు జనసేనతో పొత్తు కుదరడం.. రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఆ పార్టీల కేడర్ జోష్ లో ఉన్నాయి. రాజమహేంద్రరం సిటీలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అయితే గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్‌ ఈసారి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే బరిలోకి దిగుతున్నారు. అయితే వీరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ సర్వే నిర్వహించింది. ఆ విషయాలు తెలుసుకునే ముందు 2019 ఎన్నికల ఫలితాలను ఓ సారి పరిశీలిద్దాం.


2019 RESULTS

2019లో ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వార్ వన్‌ సైడే అన్నట్టుగా సాగింది. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానికి దాదాపుగా 50 శాతం ఓట్లు పోలయ్యాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించారు ఆమె. అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రౌతు సూర్యప్రకాశ్‌ను మట్టికరిపించారు ఆమె. ఆయనకు కేవలం 32 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఆదిరెడ్డి భవానికి రాజకీయ కుటుంబ నేపథ్యం బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. మాములుగానే ఈ నియోజకవర్గంలో టీడీపీకి క్యాడర్‌ బలంగా ఉండటమే గాక ఆమె దివంగత నేత యర్రం నాయుడు కూమార్తె కావడం.. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కావడం కలిసి వచ్చింది. ఇక జనసేన నుంచి పోటీ చేసిన సత్యనారాయణకు కూడా 14 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీకి గెలుపు అవకాశాలు మరింత పెరిగాయనే చెప్పాలి. అయితే వైసీపీ వ్యూహం మార్చి మార్గాని భరత్‌ను బరిలోకి దింపుతోంది. మరి ఈ మార్పు ఎంత వరకు ప్రభావం చూపబోతుంది? రాజమండ్రిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? అనే దానిపై బిగ్‌ టీవీ చేసిన సర్వే వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.


ఆదిరెడ్డి భవాని (TDP) ప్లస్ పాయింట్స్‌

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి
ప్రజల్లో ఉన్న సానుకూలత
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత
టీడీపీ, జనసేన పొత్తు
కాపు సామాజిక వర్గ ఓటర్ల బలమైన మద్ధతు
కలిసిరానున్న రాజకీయ కుటుంబ నేపథ్యం

మార్గాని భరత్‌ (YCP) ప్లస్ పాయింట్స్‌

రాజమండ్రి ఎంపీగా పనిచేయడం
గుడ్‌ మార్నింగ్ రాజమండ్రి పేరుతో నిర్వహించిన కార్యక్రమం

మార్గాని భరత్‌ మైనస్‌ పాయింట్స్‌

జక్కంపూడి రాజా వర్గంతో పొసగకపోవడం
నియోజకవర్గ నేతల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు
టీడీపీ క్యాడర్ బలంగా ఉండటం

రాజమండ్రి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో అంటే 18 శాతం ఉన్నవారు శెట్టిబలిజ ఓటర్లు. ఇందులో మెజారిటీ అంటే 60 శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుత ఇంచార్జ్‌ అయిన మార్గాని భరత్‌ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశం. అయితే టీడీపీకి కూడా 40 శాతం మంది మద్ధతు పలుకుతున్నారు. టీడీపీకి ఈ సామాజిక వర్గంలో సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. కోనసీమ అల్లర్ల సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం వారికి కాస్త కోపాన్ని తెప్పించినట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఇక 14 శాతం ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లలో 55 శాతం మంది టీడీపీ కూటమికే మద్ధతు పలుకుతున్నారు. ముఖ్యంగా జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ సామాజికవర్గ ఓటర్లు గంప గుత్తగా టీడీపీకే జైకొట్టే అవకాశం ఉంది. వైసీపీకి కూడా 35 శాతం మద్ధతు పలికే అవకాశం ఉంది.

ఇక 14 శాతం ఉన్న కొప్పుల వెలమ ఓటర్లలో 70 శాతం వైసీపీకి, టీడీపీ కూటమికి 30 శాతం మద్ధతు పలుకుతున్నారు. 12 శాతం ఉన్న ఎస్సీల్లో కూడా 60 శాతం వైసీపీకి, టీడీపీ కూటమికి 35 శాతం ఇతరులకు 5 శాతం మద్ధతు పలుకుతున్నారు. ఈ జిల్లాలో జక్కంపూడి ఫ్యామిలీకి ఈ సామాజికవర్గంలో గట్టి పట్టు ఉంది. జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఎస్సీలతో మంచి సత్సంబంధాలు ఉండేవి. అయితే మార్గాని భరత్‌ వర్గంలో జక్కంపూడి వర్గానికి పోసగకపోవడం ఇప్పుడు టీడీపీ కూటమికి కలిసి వచ్చే అంశంగా మారిందనే చెప్పాలి. ఇక 8 శాతంగా ఉన్న పద్మశాలిల్లో వైసీపీకి 45 శాతం, టీడీపీ కూటమికి 50 శాతం, ఇతరులకు 5 శాతం మద్ధతు పలికారు. 6 శాతం ఉన్న బ్రహ్మణ సామాజిక వర్గంలో వైసీపీకి 45 శాతం, టీడీపీ కూటమికి 50 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు పలుకుతున్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

మార్గాని భరత్ vs ఆదిరెడ్డి భవాని

ఇప్పటికిప్పుడు రాజమండ్రి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే 49 శాతం ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని గెలిచే అవకాశం ఉందని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఎంపీ అభ్యర్థిత్వాన్ని వదులుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసే మార్గాని భరత్‌కు 41 శాతం ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతరులకు 10 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైసీపీ అధిష్టానం నిర్వహించిన ఇంచార్జి మార్పు ఓటు షేర్‌ను పెంచుతుంది కానీ గెలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంక్‌.. కింజరపు, ఆదిరెడ్డి ఫ్యామిలీల రాజకీయ నేపథ్యంతో పాటు జనసేన బలమైన మద్ధతుతో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Big Stories

×