EPAPER

YS Sharmila | ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి.. అండగా కేవీపీ రామచంద్రరావు,రఘువీరారెడ్డి!

YS Sharmila | వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తన తండ్రి వైఎస్‌ని ముఖ్యమంత్రిని చేసిన పార్టీలో ఆమె ముందు చాలా సవాళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్న జగన్‌తో పొలిటికల్ యుద్దం మొదలుపెట్టాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్‌ను గాడిలో పెట్టాలి. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలి. చెల్లాచెదురైన కాంగ్రెస్ కేడర్‌కి నమ్మకం కలిగించి .. తిరిగి కాంగ్రెస్‌ వెంట నడిపించాలి.. ఇవన్నీ ఆషామాషీ టాస్క్‌లేమీ కాదు

YS Sharmila | ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి.. అండగా కేవీపీ రామచంద్రరావు,రఘువీరారెడ్డి!

YS Sharmila | వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తన తండ్రి వైఎస్‌ని ముఖ్యమంత్రిని చేసిన పార్టీలో ఆమె ముందు చాలా సవాళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్న జగన్‌తో పొలిటికల్ యుద్దం మొదలుపెట్టాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్‌ను గాడిలో పెట్టాలి. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలి. చెల్లాచెదురైన కాంగ్రెస్ కేడర్‌కి నమ్మకం కలిగించి .. తిరిగి కాంగ్రెస్‌ వెంట నడిపించాలి.. ఇవన్నీ ఆషామాషీ టాస్క్‌లేమీ కాదు. అందుకే ఇద్దరు గాడ్‌ఫాదర్స్ డైరెక్షన్‌లో ఆమె పనిచేయడానికి ఫిక్స్ అయ్యారు. ఎవరా గాడ్ ఫాదర్స్ అంటారా?


ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా దివంతగ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ పాలిటిక్స్‌ని వదిలేసి వచ్చిన ఆమె.. ఇక ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్ రోల్ పోషించడానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనవసరం లేదు. రాజధాని లేకుండా రాష్ట్రాని విభజించిన కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో గత రెండు ఎన్నికల్లో నిరూపితమైంది. దాంతో పార్టీలో లీడర్లంతా పక్కపార్టీల్లో చేరిపోయారు. కాంగ్రెస్ కేడర్ కూడా చెల్లాచెదురైంది. ఆ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులే కరువైన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్‌ షర్మిలను తురుపుముక్కగా భావిస్తూ ఏపీ పార్టీ బాధ్యతలు అప్పజెప్పింది. ఆమె పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టీ చేపట్టగానే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేశారు. పార్టీ ప్రెసిడెంట్‌గా తన తొలి ప్రసంగంలోనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.


దాంతో షర్మిల రాజకీయంగా తన అన్న జగన్‌తో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. రాజకీయాలలో సెంటిమెంట్లు వర్కవుట్ కావని నిరూపించారు. అయితే ఒక్క ప్రసంగాలతోనే ఏపీలో కాంగ్రెస్‌ను గాడిలో పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ను తిరిగి బలోపేతం చేయాలంటే ఎన్నెన్నో సవాళ్లు అధిగమించాలి. దాని వెనుక తెర వెనుక మంత్రాంగం ఎంతో జరగాలి. అందుకు అపారమైన రాజకీయ అనుభవం ఉండాలి.

అయితే షర్మిలకు అంత రాజకీయ అనుభవం లేదనే చెప్పాలి. తన తండ్రి వైఎస్ హయాంలో ఆమె ఎప్పుడూ పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు. 2014 ఎన్నికల ముందుఅన్న జగన్ అరెస్ట్‌ అయినప్పుడు జనంలోకి వచ్చి.. సుదీర్ఘపాద యాత్ర చేసి ఫోకస్ అయ్యారు. జగనన్న వదిలిన బాణాన్నంటూ జనంలో తిరిగి.. వైసీపీ మైలేజీ పెంచినప్పటికీ.. ఆ జగనన్న ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమె తెలంగాణ వెళ్లిపోయి పార్టీ పెట్టుకుని హడావుడి చేసినప్పటికీ .. అక్కడ కూడా ఎలక్షన్స్‌లో నిలబడలేదు. ఇక ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కలని .. దాన్ని నిజం చేయడానికి కృషి చేస్తానంటున్నారు.

అంటే పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపాలి. అదంత సులభం కాదని ఆమెకూ తెలుసు. అందుకు తన రాజకీయ అనుభవం సరిపోదని గ్రహించే ఇద్దరు గాడ్‌ఫాదర్స్‌ గైడ్‌లైన్స్‌లో నడవటానికి రెడీ అయ్యారు. షర్మిల తెలంగాణ రాజకీయాలను వదలి ఏపీలో ఎంట్రీ ఇవ్వడం .. పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడం .. మున్ముందు షర్మిల వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయాలు.. అన్నీ కాంగ్రెస్ దిగ్గజ నేతలు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయంట.

కేవీపీ, రఘువీరాలిద్దరూ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంత ఆప్తులో వేరే చెప్పనవసరం లేదు. వైఎస్ ఆత్మగా కేవీపీకి పేరుంది .. వైఎస్ రెండు సార్లు సీఎం అవ్వడం వెనుక కేవీపీ సలహాలు కూడా పనిచేశాయన్నది బహిరంగ రహస్యమే .. ఇక రఘువీరా వైఎస్‌కి నమ్మినబంటు .. వైఎస్ చివరి వరకు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానానికి వీరవిధేయుడిగా కొనసాగారు. ఆయన బాటలోనే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైనా కేవీపీ, రఘువీరాలు ఆ పార్టీతోనే ఉండిపోయారు.

సీనియర్ లీడర్లైన ఆ ఇద్దరు గత పది సంవత్సరాల కాలంగా అటు వైసీపీకి టీడీపీకి సమాన దూరం పాటిస్తూ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో విభేదించి వైసీపీ పెట్టుకున్న వైఎస్ జగన్‌‌ను దూరం పెడుతూనే ఉన్నారు. కేవీపీకి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కాంగ్రెస్‌పై మంచి పట్టుఉంది. రఘువీరాకు రాయలసీమ రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పునర్నిర్మాణానికి వారిద్దరే పిల్లర్స్ అవుతారని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తోందంట .. అలాంటి దిగ్గజాలు ఇప్పుడు షర్మిలకు గాడ్‌ఫాదర్స్‌గా మారారు.

షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్‌లో వారిద్దరిని తప్ప ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు .. ఆమె ఏపీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిననాటి నుంచే .. కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతాయన్న ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్లే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెనుకే నడుస్తానంటున్నారు. వైసీపీలో జరుగుతున్న మార్పులుచేర్పుల తతంగంతో .. ఇంకా ఆర్కేలాంటి పలువురు నేతలు కాంగ్రెస్‌‌తో టచ్‌లోకి వెళ్తున్నారంటున్నారు.

అలా వివిధ పార్టీల నుంచి వచ్చే వారు .. కోవర్టులా?… నిజంగా కాంగ్రెస్‌ను నమ్ముకుని వస్తున్నారా? అన్నది స్క్రూటినీ చేయడం షర్మిలకు పెద్ద సవాలే .. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఎంపిక చేయడం కూడా అతిపెద్ద టాస్కే …ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన రఘువీరాకి రాష్ర్ట రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది..

చేరికల సమయంలో కోవర్టులకు చెక్ పెట్టే విషయంలో, అభ్యర్ధుల ఎంపికలో రఘువీరా సమర్ధత షర్మిలకు ప్లస్ అవ్వనుంది .. అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా .. వెఎస్ వెన్నంటే ఉంటూ సలహాదారుగా కీలక పాత్ర పోషించిన కేవీపీకి … తెర వెనుక పాలిటిక్స్ ఎలా ఉంటాయో తెలుసు .. అలాంటి ఇద్దరు హార్డ్‌కోర్ కాంగ్రెస్ వాదులు ఇప్పుడు షర్మిల వెనకుండి.. ఏపీ కాంగ్రెస్‌లో కీరోల్ పోషించనున్నారు .. చూడాలి వారి వ్యూహాలు, షర్మిల దూకుడు కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్లస్ అవుతుందో?

YS Sharmila, reins, AP Congress, mentor, KVP Ramachandra Rao, Raghuveera Reddy, YS Jagan, CM Jagan,

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×