EPAPER

Ayodhya : జోరందుకున్న టూరిజం.. అయోధ్యలో ఒక్క హూటల్‌ రూం ధర లక్ష..!

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు పూర్తి ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఆలయాన్ని సర్వంగాసుందరంగా తీర్చి దిద్దారు. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌ ముఖ్యఅతిధితులుగా పాల్లొననున్నారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

గతంలో రామ మందిర నిర్మాణాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మందిర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అయోధ్య లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టూరిజం రంగం అనూహ్యంగా వృద్ది సాధించినట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. ఇక బాలరాముడు విగ్రహ ప్రతిష్ట కోసం అయోధ్య భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.దీంతో అయోధ్యలోని హోటల్ ధరలు రాత్రికి రూ. లక్షకు పెరిగాయంటూ పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ మందిరం నిర్మాణం ప్రారంభం కాగానే అద్దెలు సగటు కంటే ఐదు రెట్లు పెరిగాయి. స్థానికంగా ఉన్న పార్క్‌ ఇన్‌ రాడిసన్‌ హోటల్‌ టాప్‌ రూమ్‌ ధర రూ.లక్ష మార్క్‌ దాటినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. స్థానికంగా ఉన్న రామాయణ ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి 20, 25 తేదిలలో పూర్తిగా గదులు బుక్ అయ్యాయని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నెలలోనే బుకింగ్ లు ప్రారంభం అయ్యాయని తెలిపారు.

హోమ్‌ స్టేలు అందుబాటులోకి వచ్చాయి. రామమందిరం ప్రారంభమైన తర్వాత హోటల్‌ గదుల ధరలు రాత్రికి రూ. 7,000 నుండి రూ. 25,000 వరకు పెరిగాయని సిగ్నెట్ కలెక్షన్ హోటల్స్‌ ప్రతినిధులు ప్రకటించారు. డిమాండ్‌కు అనుగుణంగా అయోధ్యలో అనేక హోమ్‌స్టేలు అందుబాటులోకి వచ్చాయి.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×