EPAPER

Jaggampeta : జగ్గంపేటలో పగ్గాలు.. తోటకా..? జ్యోతులకా..?

Jaggampeta : జగ్గంపేటలో పగ్గాలు.. తోటకా..? జ్యోతులకా..?

Jaggampeta : తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌. కాపు సామాజిక వ‌ర్గానికి పెట్టని కోటగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రాజ‌కీయం రసవత్తరంగా మారింది. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో జ్యోతుల, తోట ఫ్యామిలీలు చక్రం తిప్పుతున్నాయి. గడచిన ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు గెలిచారు. అయితే జగ్గంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థి మార్పు తథ్యమని తేలడంతో వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటలు జరుగుతుండగా.. మరోవైపు జనసేనతో కలిసి టీడీపీ అడుగులు వేస్తుండటంతో ఈక్వేషన్స్‌ అన్ని మారిపోతున్నాయి. అయితే జనసేన నేత పాటంశెట్టి సూర్య చంద్ర ఈ నియోజకవర్గంలో కీరోల్‌ ప్లే చేయడం పక్కా అని తెలుస్తోంది. మరి ఈసారి ఎవరు బరిలో నిలిస్తే ఫలితాలు ఉండబోతున్నాయన్నది తెలుసుకునే ముందు 2019లో ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు

జ్యోతుల చంటిబాబు ( గెలుపు) vs జ్యోతుల నెహ్రూ


YCP 52%
TDP 39%
JANASENA 6%
OTHERS 3%

2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ భారీ ఓట్‌ షేర్‌తో విజయం సాధించింది. వైసీపీ నుంచి బరిలోకి దిగిన జ్యోతుల చంటిబాబుకు ఏకంగా 52 శాతం ఓట్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన వైసీపీ వేవ్‌.. ఈ నియోజకవర్గంలో కూడా కనిపించింది. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన జ్యోతుల నెహ్రూకు 39 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన నుంచి పోటీ చేసిన పాటంశెట్టి సూర్య చంద్రకు 6 శాతం ఓట్లు పడ్డాయి. ఇవి గత ఎన్నికల లెక్కలు కాగా.. ఈ సారి పరిస్థితులు మారాయి.. రాజకీయ పరిణామాలైతే ఊహించనంతగా మారాయి. జ్యోతుల చంటిబాబు మళ్లీ పోటీ చేయడం లేదని తెలుస్తోంది. తోట నర్సింహాన్ని వైసీపీ బరిలోకి దింపుతుందని సమాచారం. మరోవైపు టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళుతుండటంతో ఈ ఎన్నికల్లో జనసేనకు చాలా విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మాత్రం టీడీపీ ఓట్లను చీల్చే అవకాశం ఉందని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. మరి ఈసారి ఎన్నికల్లో జగ్గంపేట జంగ్‌లో గెలిచేదేవరు? నిలిచేదేవరు? అన్నది బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

తోట నర్సింహం ( YCP )

తోట నర్సింహం ప్లస్ పాయింట్స్

సుదీర్ఘ రాజకీయ అనుభవం
పార్టీ క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉండటం

తోట నర్సింహం మైనస్ పాయింట్స్

జ్యోతుల చంటిబాబు సహకరించకపోవడం
అధిష్టానంపై క్యాడర్‌లో ఉన్న వ్యతిరేకత
నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం
వైసీపీ పాలనలో రోడ్లు వేయకపోవడం, ITI కాలేజ్ నిర్మించకపోవడం
రైతులకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు

జ్యోతుల నెహ్రూ ( TDP )

జ్యోతుల నెహ్రూ ప్లస్ పాయింట్స్

ప్రజలతో నిత్యం టచ్‌లో ఉండటం
ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం
జగ్గంపేటలో చేసిన పాదయాత్ర
గుంతల ఏపీకి దారేది పేరుతో పోరాటం
గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి
ఇటీవల కాలంలో టీడీపీలోకి పెరిగిన వలసలు
జనసేనతో ఉన్న పొత్తు

జ్యోతుల నెహ్రూ మైనస్‌ పాయింట్స్

జనసేన నుంచి ఆశించిన మద్ధతు లభించకపోవడం

కుల సమీకరణలు

కాపు 38 %
ఎస్సీ 19 %
తూర్పు కాపు 14 %
యాదవ్‌ 10 %
శెట్టి బలిజ 5 %

జగ్గంపేట కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట. ఈ నియోజకవర్గంలో మెజారిటీ జనాభా ఆ సామాజిక వర్గానిదే. 38 శాతం ఉన్న ఓటు బ్యాంక్‌లో వైసీపీకి 45 శాతం మద్దతు తెలుపుతుండగా.. టీడీపీకి 50 శాతం మంది తమ మద్దతు తెలిపారు. ఇతరులకు 5 శాతం తమ మద్దతు పలుకుతున్నారు. మాములుగానే తమ సామాజిక వర్గ నేత అయిన జ్యోతుల నెహ్రూకు మద్దతు పలుకుతుండగా… జనసేన కూడా కలిసి రావడంతో ఓట్ షేర్‌ మరింత పెరిగింది. అయితే కాపు నేస్తం లబ్ధిదారులు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ఇక 19 శాతం ఉన్న ఎస్సీ జనాభాలో వైసీపీకి 55 శాతం మద్దతు పలుకుతున్నారు. టీడీపీ కూటమికి 40 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు పలుకుతున్నారు. 14 శాతం ఉన్న తూర్పు కాపుల్లో మెజారిటీ అంటే 50 శాతం మంది ప్రజలు టీడీపీ, జనసేన కూటమికి జై కోడుతుండగా.. అధికార వైసీపీకి 45 శాతం మంది మద్దతు పలికారు. ఇతరులకు 5 శాతం మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ వైసీపీకి మద్దతు పలికేవారంతా సంక్షేమ పథకాల లబ్ధిదారులే అని తెలుస్తోంది. అయితే చాలా మంది టీడీపీ మద్ధతుదారులు మాత్రం అసలు పథకాలను ప్రారంభించిందే టీడీపీ అన్న భావనలో ఉన్నారు. ఇక 10 శాతం యాదవ సామాజికవర్గ ప్రజల్లో వైసీపీకి 35 శాతం, టీడీపీ కూటమికి 60 శాతం, ఇతరులకు 5 శాతం తమ మద్దతు పలుకుతున్నారు. ఇక అత్యల్పంగా అంటే 5 శాతం మాత్రమే ఉన్న శెట్టి బలిజల్లో అత్యధికంగా టీడీపీ కూటమికి 55 శాతం… వైసీపీకి 40 శాతం, ఇతరులకు 5 శాతం మద్ధతు పలుకుతున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

తోట నర్సింహం vs జ్యోతుల నెహ్రూ

YCP 43 %
TDP 49 %
OTHERS 8 %

బిగ్‌ టీవీ సర్వే ప్రకారం జనసేన మద్ధతుతో టీడీపీ బరిలోకి దిగితే జ్యోతుల నెహ్రూ గెలిచే అవకాశం 43 శాతం ఉందని తేలింది. తోట నర్సింహానికి 43 శాతం ఓట్లు, ఇతరులకు 8 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. అయితే ఇది జరగాలంటే జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర మద్ధతు తప్పనిసరి. ఆయన సపోర్ట్ చేస్తే జ్యోతుల నెహ్రూ ఈజీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే జనసేన నేతలు సహకరించకపోతే.. పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై కూడా బిగ్‌ టీవీ సర్వే చేసింది. అందులో ఏం తేలిందో చూద్దాం.

YCP 49 %
TDP 46 %
OTHERS 5 %

బిగ్‌ టీవీ సర్వే ప్రకారం జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉన్నా.. స్థానికంగా సూర్యచంద్ర.. జ్యోతుల నెహ్రూకు మద్దతివ్వకపోతే మాత్రం ఈ ఈక్వేషన్స్‌ అన్ని మారిపోతాయని తేలింది. జ్యోతుల నెహ్రూకు 46 శాతం ఓట్లే పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సూర్యచంద్ర మద్దతివ్వకపోతే 3 శాతం ఓట్లకు గండిపడపోతుంది. ఇది వైసీపీకి పాజిటివ్ గా మారి తోట నర్సింహానికి ఏకంగా 49 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. జగ్గంపేట జంగ్‌లో గెలుపోటములను డిసైడ్ చేసేది కేవలం జనసేన సపోర్ట్‌ మాత్రమే అన్నట్టుగా కనిపిస్తోంది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×