EPAPER

Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : ఏపీలో పొలిటికల్ హీటెక్కిస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి. బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు. కానీ ఇక్కడి రాజకీయాలు అంత తీపి కాదు. ఎప్పుడూ ఘాటుగానే సాగుతుంటాయి. 1985 నుంచి 2004 వరకు నాలుగు సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనకాపల్లిలో కాపు, గవర సామాజికవర్గం జనాభా 85 శాతం ఉంది. ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ డామినెంట్‌గా ఉన్నాయి. ఒక్క 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగితా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పని చేశారు. ఆయన ఇటీవలే మళ్లీ టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనకాపల్లిలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేషిద్దాం.

2019 ఎన్నికల ఫలితాలు

గుడివాడ అమర్నాథ్ (గెలుపు) VS పీలా గోవింద సత్యనారాయణ

YCP 46%
TDP 41%
OTHERS 13%

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో ఘన విజయం సాధించారు. 46 శాతం ఓట్లు సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పీలా గోవింద సత్యనారాయణ 41 శాతం ఓట్లు రాబట్టారు. అయితే అమర్నాథ్ విజయానికి జగన్ వేవ్ తో పాటే చాలా ఫ్యాక్టర్స్ పని చేశాయి. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొణతాల రఘునాథ్ టిక్కెట్ రాకపోయినా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పని చేశారు. అదే సమయంలో 2014లో టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు సపోర్ట్ కూడా చాలా కలిసి వచ్చింది. దీంతో కాపు సామాజికవర్గంతో పాటే గవర కమ్యూనిటీ ఓట్లు కూడా వైసీపీకే పడ్డాయి. దీంతో గెలుపు ఈజీ అయింది. కానీ ఈసారి వైసీపీ అభ్యర్థి మారిపోయారు. గత ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చిన దాడి వీరభద్రరావు మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు. దీంతో అనకాపల్లి రాజకీయం అంతా ఒక్కసారిగా మారిపోయింది. మరి ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

మలసాల భరత్ కుమార్ ( YCP )

మలసాల భరత్ కుమార్ ప్లస్ పాయింట్స్

  • ప్రజల్లో యువనేతగా గుర్తింపు
  • తల్లి ధనమ్మ రాజకీయ వారసత్వం

మలసాల భరత్ కుమార్ మైనస్ పాయింట్స్

  • అనకాపల్లికి కొత్తగా ఇంఛార్జ్ బాధ్యతలు
  • క్యాడర్ కలిసి వస్తుందా అన్న డౌట్లు
  • తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ కాకపోవడం
  • అనకాపల్లిలో ఏర్పాటవ్వాల్సిన మెడికల్ కాలేజ్ నర్సీపట్నం తరలివెళ్లడంతో జనంలో అసంతృప్తి

పీలా గోవింద సత్యనారాయణ ( TDP )

పీలా గోవింద సత్యనారాయణ ప్లస్ పాయింట్స్

  • అనకాపల్లిలో అందరు గుర్తు పట్టే నాయకుడు
  • టీడీపీ తరపున గ్రౌండ్‌లో యాక్టివ్ రోల్
  • ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడం
  • దాడి వీరభద్రరావు తిరిగి టీడీపీలోకి రావడం

పీలా గోవింద సత్యనారాయణ మైనస్ పాయింట్స్

  • గవర, కాపు వర్గాలను ఎంత వరకు ఆకట్టుకుంటారన్న ప్రశ్నలు

కుల లెక్కలు
కాపు 50%
గవర 35%

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు, గవర సామాజికవర్గాలకు చెందిన వారే మెజార్టీగా ఉన్నారు. వీరి సపోర్ట్, కిందిస్థాయి లీడర్ల మద్దతు ఎవరికి ఉంటే వారే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కాపుల జనాభా 50శాతం ఉంటే… గవర కమ్యూనిటీ జనాభా 35 శాతంగా ఉంది. కాపుల్లో 40 శాతం మంది వైఎస్ఆర్ సీపీకి, 55 శాతం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అదే సమయంలో గవర సామాజికవర్గంలో 30 శాతం వైసీపీకి, 65 శాతం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. కొణతాల రఘునాథ్, బీరిశెట్టి వెంకట సత్యవతి వంటి వైసీపీ నేతలు గవర వర్గానికే చెందిన వారు కావడంతో ఓటు బ్యాంకును ఎంత వరకు రిఫ్లెక్ట్ చేస్తారన్నది కీలకంగా మారింది. అదే సమయంలో గవర కమ్యూనిటీ ఓటర్లు సంప్రదాయంగా టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాడి వీరభద్రరావు కూడా టీడీపీలో చేరడంతో మరింతగా ఓట్లు రాబట్టుకునే అవకాశాలున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. ఇక వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

మలసాల భరత్ VS పీలా గోవింద సత్యనారాయణ

YCP 41%
TDP 54%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనకాపల్లిలో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ 54 శాతం ఓట్ షేర్ రాబట్టే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అటు వైసీపీ అభ్యర్థి భరత్ 41 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో జనం తమ అభిప్రాయంగా చెప్పారు.

.

.

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×