EPAPER
Kirrak Couples Episode 1

Palamaner Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పలమనేరులో అమర్‌నాథ్ రెడ్డి విజయం ఖాయమేనా..?

Palamaner Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పలమనేరులో అమర్‌నాథ్ రెడ్డి విజయం ఖాయమేనా..?
Palamaner Assembly Constituency

Palamaner Assembly Constituency : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇదో భిన్న రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉంది ఈ సెగ్మెంట్. ఇదో జనరల్ స్థానం. సో ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ఒకేలా లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో భిన్న వర్గాలు సంస్కృతుల జనం ఉంటారు. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీ, ప్రస్తుతం వైసీపీ డామినెంట్ గా కనిపిస్తున్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో పలమనేరు ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఆ ఎక్స్ క్లూజివ్ డిటైల్స్ చూసే ముందు 2019 పలమనేరు రిజల్ట్ చూద్దాం.


2019 RESULTS : వెంకటేగౌడ ( గెలుపు ) VS అమర్ నాథ్ రెడ్డి

YCP 54%
TDP 40%
JANASENA 2%
OTHERS 4%


గత ఎన్నికల్లో పలమనేరు సెగ్మెంట్ లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన వెంకటే గౌడ 54 శాతం ఓట్లతో గెలుపొందారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్. అమర్నాథ్ రెడ్డి 40 శాతం ఓట్లు సాధించారు. జనసేన కేవలం 2 శాతం ఓట్లకే పరిమితమైంది. ఇతరులు 4 శాతం ఓట్లు రాబట్టారు. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం పలమనేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

వెంకటేగౌడ (YCP)

వెంకటేగౌడ ప్లస్ పాయింట్స్

  • ఏడాది నుంచి గ్రౌండ్ వర్క్ మొదలు
  • ప్రజల్లో, క్యాడర్ లో మంచి ఇమేజ్ మెయింటేన్ చేయడం
  • హంద్రినీవా ప్రాజెక్ట్ ఫలితాలు
  • అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం

వెంకటేగౌడ మైనస్ పాయింట్స్

  • ప్రజల్లో యాక్సెస్ పెంచుకోకపోవడం
  • జగన్, పెద్దిరెడ్డి వేవ్ పైనే ఎక్కువ భారం
  • వ్యాపార కార్యకలాపాలతో బిజీ బిజీ

అమర్ నాథ్ రెడ్డి (TDP)

అమర్ నాథ్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • పలమనేరు జనానికి అందుబాటులో ఉండడం
  • తన హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడం
  • గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ గా కార్యక్రమాలు, ప్రచారాలు
  • టీడీపీలో పెద్ద నేతగా జనంలో గుర్తింపు

అమర్ నాథ్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • వైసీపీ హవాను ఎంత వరకు నిలువరిస్తారన్న డౌట్లు

కులాల వారీగా
ఎస్సీ 20%
ముస్లిం 16%
రెడ్డి 12%
బోయ వాల్మీకి 10%
గౌడ 7%
బలిజ 5%
కమ్మ 4%

పలమనేరు నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం జనాభా అధికంగా ఉంది. ఇందులో వైసీపీకి 50 శాతం, టీడీపీకి 45 శాతం, జనసేనకు 5 శాతం మద్దతు ఇస్తామంటున్నారు. అలాగే ముస్లింలలో 50 శాతం మంది వైసీపీకి, 45 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు సపోర్ట్ గా ఉంటామని తమ అభిప్రాయంగా చెప్పారు. రెడ్డి కమ్యూనిటీలో 55 శాతం వైసీపీ, 40 శాతం టీడీపీ, 5 శాతం జనసేనకు మద్దతు పలుకుతున్నారు. బోయ వాల్మీకీల్లో 45 శాతం జగన్ పార్టీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక గౌడ సామాజికవర్గంలో 40 శాతం జగన్ పార్టీకి, 55 శాతం సైకిల్ కు, 5 శాతం జనసేనకు మద్దతు పలుకుతున్నారు. బలిజ వర్గంలో వైసీపీకి 40 శాతం, టీడీపీకి 55 శాతం, జనసేనకు 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో పలమనేరులో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

వెంకటేగౌడ VS అమర్ నాథ్ రెడ్డి

YCP 44%
TDP 49%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలమనేరు నియోజకవర్గంలో ఈసారి టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ అభ్యర్థికి 44 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉండగా… టీడీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డి 49 శాతం ఓట్లు రాబడుతారని సర్వేలో తేలింది. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా టీడీపీకి పలమనేరులో గెలుపు అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related News

Tirupati Laddu: ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Big Stories

×