EPAPER
Kirrak Couples Episode 1

Palestinian Tent : పాలస్తీనియన్లకు టెంట్లూ కరువే!

Palestinian Tent : పాలస్తీనియన్లకు టెంట్లూ కరువే!
Gaza Tent

Palestinian Tent : గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మూడొంతుల భాగం ఇప్పటికే నేలమట్టమైంది. ప్రతి నలుగురు గాజన్లలో ఒకరికి శాశ్వతంగా ఇల్లు లేకుండాపోయినట్టు తెలుస్తోంది. గాజా జనాభాలో నాలుగోవంతు.. అంటే దాదాపు 5 లక్షల మంది తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందనేది ఐక్యరాజ్యసమితి అంచనా. ప్రధాన నగరమైన ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ బలగాలు తాజాగా బాంబులు కురిపించాయి. ఈ నగరంలో అతి పెద్ద ఆస్పత్రి నాజర్‌కు అతి సమీపంలోనే ఇవి పడినట్టు తెలుస్తోంది.


ఇప్పటికే గాజాలోని ప్రధాన ఆస్పత్రుల్లో మూడొంతులకు పైగా మూతపడ్డాయి. ఇజ్రాయెల్-హమాస్ పోరు ఉత్తరాది నుంచి క్రమేపీ దక్షిణాది ప్రాంతానికి చేరుతోంది. దీంతో నాజర్ ఆస్పత్రితో పాటు అల్-అక్సా, గాజా యూరోపియన్ హాస్పిటల్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వెల్లడించారు. ఖాన్ యూనిస్‌పై దాడుల నేపథ్యంలో క్షతగాత్రులు గాజా దక్షిణ కొసన ఉన్న చిట్టచివరి నగరం రఫాకు చేరుకుంటున్నారు.

22 లక్షల జనాభాలో ఇప్పటికే 17 లక్షల మంది బితుకుబితుకుమంటూ దక్షిణాదికి చేరారు. వీరిలో అత్యధికులు తగిన షెల్టర్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. గగతనతల దాడులతో ఇజ్రాయెల్ ఎప్పుడు, ఎలా విరుచుకుపడుతుందోనన్న భయంతో అపార్ట్‌మెంట్లు, భవనాలను వీడుతున్నారు. టెంట్లు, నైలాన్ షీట్లు, చెక్కలతో తయారైన తాత్కాలిక షెల్టర్లలోనే తలదాచుకుంటున్నారు. ఇదే అదనుగా అవకాశవాదులు పెట్రేగిపోతున్నారు.


తాత్కాలిక వసతికి అవసరమైన మెటీరియల్‌ను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఆఖరికి టెంట్లు కూడా కరువయ్యాయి. ఈజిప్టు సరిహద్దుల్లోని మైదాన ప్రాంతాల్లో గత నెల నుంచి తాత్కాలిక నివాసాల సంఖ్య పెరిగినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. దీంతో టెంట్లకు ఎక్కడ లేని గిరాకీ నెలకొంది. గాజాలో ఒకప్పుడు వీటిని వినోద కార్యక్రమాల కోసం వినియోగించే వారు.

యుద్ధం ఆరంభానికి ముందు ఒక్కో టెంట్ 50 డాలర్లకు లభ్యమయ్యేది. ప్రస్తుతం ఈ ధర మూడున్నర రెట్లకు పైగా పెరిగింది. చిన్న‌పాటి టెంట్ కావాలంటే 185 డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. టెంట్ల కొరతతో కొందరు పాలస్తీనియన్లు రగ్గులు, దుప్పట్లనే టెంట్ వాల్స్‌గా వినియోగిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల నుంచి టెంట్లను అందుకోవడానికి రోజుల తరబడి ఎదురుచూడంలోనే వారికి సమయం సరిపోతోంది.

ఐక్యరాజ్యసమితి అందిస్తున్న సాయం కూడా చాలడం లేదు. ఫ్యామిలీ సైజు ఉన్న టెంట్ల కొరత 50 వేల వరకు ఉందని ఐరాస ప్రతినిధులు తెలిపారు. పదిలక్షల వరకు రగ్గులు, దుప్పట్ల అవసరం కూడా ఉందని చెప్పారు.

Related News

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Big Stories

×