EPAPER

Sex : సెక్స్ తర్వాత గర్భం వద్దనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

Sex : సెక్స్ తర్వాత గర్భం వద్దనుకుంటున్నారా..? ఇలా చేయండి..!
Health news today

Sex Tips(Health news today):

ఈ మధ్య కాలంలో చాలా మంది జంటలు శృంగారం మాత్రం నిత్యం కావాలని కోరుకుంటున్నారు. కానీ సంతానం విషయానికి వచ్చే సరికి వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే శృంగారం వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా ఉంచుతుంది. కొత్తగా పెళ్లైన జంటలు శృంగారంలో విరామం ఇవ్వకపోవడం వారి జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది.


శృంగారం తర్వాత అనుకోకుండా గర్భం దాల్చితే ప్రతికూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. కొంతమంది భాగస్వామితో కలవాలని భావించినా.. గర్భం వస్తుందన్న భయంతో శృంగారానికి దూరంగా ఉంటారు. ప్రణాళిక లేకుండా పొందే గర్భం ఆర్థిక అస్థిరతకు కూడా దారి తీస్తుంది. కానీ ఈ భయాల నుంచి బయటపడి శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు నిపుణులు.

పురుషులు శృంగార సమయంలో కండోమ్ వాడితే గర్భం రాకుండా నిరోధించవచ్చు. శృంగారం తర్వాత మహిళలకు గర్భం రాకుండా మాత్రలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి వేసుకుంటే కండోమ్ వేసుకోకుండా శృంగారంలో పాల్గొనొచ్చని నిపుణుల అభిప్రాయం. కానీ ఇవి అంత సురక్షితమైనవి కావని ఇంకా నిరూపించబడలేదు. మెడిసిన్స్ వాడే ముందు వైద్యుల సూచనలు తప్పనిసరి.


health news

మహిళలు శృంగార సమయంలో గర్భాశ్రయంలోకి వీర్యం ప్రవేశించకుండా యోని లోపల పెట్టుకునే కండోమ్‌లను కూడా వాడొచ్చు. వీటి వల్ల శరీర అవయవాలకు ఎటువంటి హాని కలగదు. మహిళలు ధరించే కండోమ్ 95 శాతం ప్రభావంతంగా కూడా ఉంటాయి. ఈ కండోమ్‌ వీర్యం చుక్క కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. కానీ వాటిని పెట్టుకునే ముందు ఎక్స్‌పైరీ డేట్, ఏవైనా లోపాలు ఉన్నాయేమో క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. అంతేకాకుండా దాని మీద FDA, CE, ISO or Kite mark ఇలా ఏదో ఒక గుర్తు ఉండేలా చూసుకోవాలి.

Sex Tips

కండోమ్ ధరించడం ఇష్టం లేని మహిళలు శృంగారం తర్వాత గర్భం రాకుండా ఉండేందుకు 48 గంటలలలోపు ఓ పిల్‌ను తీసుకోవాలి. ఈ పిల్ ఫలదీకరణ గుడ్డు అమరికను అడ్డుకుంటుంది. అయితే పిల్ తీసుకునే ముందు వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. ఇంట్రాటూరైన్ లేదా IUD అనే పరికరం గర్భనిరోధక పద్ధతులలో సురక్షితమైనది. దీనివల్ల భాగస్వామి వీర్యకణాలు గర్భాశయాన్ని చేరుకోలేవు.

మహిళల్లో అండం విడుదల సమయానికి ముందు 5 రోజుల్లో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలలో అన్నిటికన్నా సమర్థవంతమైనది కాపర్ టీ. రక్షణ లేకుండా జరిపిన కలయిక జరిగిన 5 రోజుల లోపు గర్భాశయంలో కాపర్ టీ అమర్చగలిగితే గర్భం రాకుండా అడ్డుకోవచ్చు. పురుషులు కండోమ్‌ను కేవలం శృంగారం చేసినంత సేపు మాత్రమే ధరిస్తారు. మహిళలు మాత్రం ఈ కండోమ్స్‌ని దాదాపు 8గంటల పాటు ఉంచుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిని సహజ రబ్బర్, సింథటిక్ రబ్బర్‌తో తయారు చేస్తారు.

health tips in telugu

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×