EPAPER

Mary Millben : భారత్‌కు మోదీ అత్యుత్తమ నాయకుడు.. మరోసారి ప్రధానిగా ఎన్నికవ్వాలి..

Mary Millben : ప్రధాని మోదీ భారత్‌కు అత్యుత్తమ నాయకుడని ప్రముఖ అమెరికన్‌ సింగర్ మేరీ మిల్బెన్‌ తెలిపారు. భారత్, అమెరికా దేశాలు మధ్య సంబంధాలు బలపడటానికి నరేంద్ర మోదీ కారణమని పేర్కొంది. భారత్ కు ప్రధానిగా మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని చాలా మంది అమెరికన్లు కోరుకుంటున్నారని తెలిపింది. మరోకసారి ఆయన ఎన్నిక అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఆమె అభిప్రాయన్ని వ్యక్తం చేసింది.

Mary Millben : భారత్‌కు మోదీ అత్యుత్తమ నాయకుడు.. మరోసారి ప్రధానిగా ఎన్నికవ్వాలి..

Mary Millben : ప్రధాని మోదీ భారత్‌కు అత్యుత్తమ నాయకుడని ప్రముఖ అమెరికన్‌ సింగర్ మేరీ మిల్బెన్‌ అభిప్రాయపడింది. భారత్, అమెరికా దేశాలు మధ్య సంబంధాలు బలపడటానికి నరేంద్ర మోదీ కారణమని పేర్కొంది. భారత్‌కు ప్రధానిగా మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని చాలా మంది అమెరికన్లు కోరుకుంటున్నారని వెల్లడించింది. మరోసారి ఆయన ఎన్నిక అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆమె తన అభిప్రాయన్ని చెప్పింది.


ప్రధానిగా మోదీని అమెరికా ప్రజలు ఎక్కువ శాతం మద్దతు తెలుపుతున్నారని మేరీ మిల్బెన్‌ పేర్కొంది . పాలన పరంగా భారత్‌కు మోదీ‌యే సరైనా నాయకుడు అని తెలిపింది. 2024 జరగబోయే ఎన్నికలు ఇరు దేశాలకు కీలకం అని పేర్కొంది . ఎన్నికలు ఫలితాలు ప్రభావం భారత్‌-అమెరికా సంబంధాలపై సృష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. దేశానికి సరైనా నాయకుడ్ని ఎన్నుకునే బాధ్యత ప్రజలదేనని తెలిపింది.

ప్రపంచంలో ఉత్తమ ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ను నిలిపేందుకు మోదీ కృషి చేశారని మేరీ మిల్బెన్ తెలిపింది. భారత్ వివిధ రంగాలలో అభివృద్ధి చెందిందని ఆధునిక టెక్నాలజీ వినియోగించటంలో మోదీ ప్రభుత్వం సఫలం అయిందని ఆమె పేర్కొంది. కేబినేట్ మంత్రులలో మహిళలకు సముచిత స్థానం కల్పించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. ముందు ముందు అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మోదీ నాయకత్వంలో బలపడతాయని మేరీ మిల్బెన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.


ప్రధాని మోదీ గతేడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా మిల్బెన్‌ భారత్ జాతీయ గీతం జనగణమన పాడింది. ప్రదర్శన అనంతరం మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. మరొకసారి మణిపూర్‌ అంశంపై ప్రధానికి మద్దతునిచ్చింది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే ఎన్నికలలో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి మేరీ మిల్బెన్‌ మద్దతు ప్రకటించింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×