EPAPER

Rahul Gandhi : ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’.. రాహుల్‌ గాంధీపై మరోకేసు నమోదు..

Rahul Gandhi : ప్రస్తుతం ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’లో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ తలపెట్టిన ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ నుంచి రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది.

Rahul Gandhi : ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’.. రాహుల్‌ గాంధీపై మరోకేసు నమోదు..

Rahul Gandhi : ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’లో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ తలపెట్టిన ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ శాన్య రాష్ట్రం మణిపుర్‌ నుంచి రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది.


అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్‌ పట్టణం పోలీసులు కేటాయించిన మార్గం నుండి కాకుండా మరో మార్గం గుండా వెళ్లారని అస్సాం పోలీసులు వెల్లడించారు. ఈ మార్పు పట్టణంలో అంతరాయాలకు దారితీసిందని తెలిపారు. ట్రాఫిక్‌ బారికేడ్లను తొలగించేలా నేతలు ప్రజలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులపై దాడి చేసేలా భయబ్రాంతులకు గురి చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీతో పాటు యాత్ర నిర్వాహకులపై కేసు నమోదు అయ్యింది. అయితే కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇదంతా యాత్రకు అడ్డంకులు సృష్టించే యత్నమని విమర్శించారు. తమకు కేటాయించినది ఇరుకైన మార్గమన్నారు. మరోవైపు రద్దీ ఎక్కువగా ఉండడంతో కొద్దిదూరం పక్కమార్గంలో ప్రయాణించామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మొదటి రోజు అస్సాంలో యాత్ర విజయంతంగా సాగడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓర్వలేకనే యాత్రను దారి మళ్లించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ 67 రోజులు పాటు 15 రాష్ట్రాలు 100లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో కొనసాగనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్‌ పట్టణంలో మొదలైంది. దాదాపుగా 6713 కి.మీ మేర జరగనుంది. శుక్రవారంతో ఆరో రోజుకు చేరుకుంది. రాహుల్, ఇతర నేతలు నేటి యాత్రను అతిపెద్ద నదీదీవి అయిన మజులీలో పడవ ప్రయాణంతో మొదలుపెట్టారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×