EPAPER

TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!

TSPSC : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై.. రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీమ్​ను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా.. కమిషన్ ఛైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్​లతో పాటు.. ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్​పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!

TSPSC chairman notification(Today news in telangana) :


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై.. రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీమ్​ను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా.. కమిషన్ ఛైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్​లతో పాటు.. ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్​పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

కాగా గత ప్రభుత్వ హాయాంలో నియమితులైన టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు.. మరో నలుగురు సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించగా.. నిన్నటితో గడువు ముగిసింది. టీఎస్​పీఎస్సీ లో ఛైర్మన్ తో పాటు.. 9 మెంబర్ల పోస్టుల కోసం దాదాపు 200 పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఈ-మెయిల్ ద్వారా కూడా కొన్ని మరికొన్ని అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం.. ప్రొఫెసర్లు, గ్రూప్ 1 ఉద్యోగులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్లు, వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు సైతం పోటీపడుతున్నారు. నియామకాల్లో పారదర్శకంగా ఉండేందుకు రేవంత్ సర్కార్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు పూనుకుంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్​పీఎస్సీని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగుల భర్తీ కోసం రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తుంది.

కొత్త ఛైర్మన్ గా.. గతేడాది రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్​ ఆఫీసర్ పేరుతో పాటు ప్రస్తుతం సర్వీస్​లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేరును సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన ఐపీఎస్ సర్వీస్​ను ఏడాది పాటు పొడిగించి వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరోపక్క ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న హెచ్​సీయూ ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తోంది. జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్, ఓయూ సీనియర్ ప్రొఫెసర్ పేర్లూ కూడా పరిశీలనలో ఉన్నాయి.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×