EPAPER

Narsannapeta | బిగ్ టీవీ సర్వే.. ధర్మాన కృష్ణదాస్ మళ్లీ గెలుస్తారా? టీడీపీ పరిస్థితేంటి?

Narsannapeta | శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు గత రెండున్నర దశాబ్దాలుగా కింజరాపు, ధర్మాన కుటుంబాల కేంద్రంగానే జరుగుతున్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 1985 నుంచి ఈ నియోజకవర్గం మీద ధర్మాన కుటుంబం పట్టు సాధిస్తూ వస్తోంది. గడచిన ఎన్నికల్లో నరసన్నపేట నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు.

Narsannapeta | బిగ్ టీవీ సర్వే.. ధర్మాన కృష్ణదాస్ మళ్లీ గెలుస్తారా? టీడీపీ పరిస్థితేంటి?

Narsannapeta | శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు గత రెండున్నర దశాబ్దాలుగా కింజరాపు, ధర్మాన కుటుంబాల కేంద్రంగానే జరుగుతున్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 1985 నుంచి ఈ నియోజకవర్గం మీద ధర్మాన కుటుంబం పట్టు సాధిస్తూ వస్తోంది. గడచిన ఎన్నికల్లో నరసన్నపేట నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. పోలినాటి వెలమ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఈ సామాజికవర్గానికి చెందిన నేతలకే టిక్కెట్లు ఇస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలసి ఎన్నికలకు వెళ్తుడండంతో ఈ నియోజకవర్గంలోనూ ఆసక్తి పెరిగింది. పొత్తుతో నరసన్నపేట సెగ్మెంట్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే ఛాన్స్ ఉందా..? వైసీపీ అభ్యర్థి గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి? బిగ్‌ టీవీ డీటెయిల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలిందో చూద్దాం.. అంతకు ముందు 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
ధర్మాన కృష్ణదాస్ VS బగ్గు రమణమూర్తి

YCP 52%
TDP 40%
INC 3%
OTHERS 5%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట సెగ్మెంట్ లో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేశారు. 52 శాతం ఓట్ షేర్ దక్కించుకుని మంచి మెజార్టీతో గెలిచారు. వైఎస్ జగన్ వేవ్, అలాగే పర్సనల్ ఇమేజ్ తో ఓట్ల శాతాన్ని గతం కంటే గణనీయంగా పెంచుకున్నారు. అలాగే టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి అదే కమ్యూనిటీ నేతే అయినా అనుకున్నన్ని ఓట్లు సాధించలేకపోయారు. కేవలం 40 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర విభజనకు ముందు హస్తం పార్టీదే ఇక్కడ హవా ఉండేది. ఇప్పుడు షర్మిల రాకతో ఈ సెగ్మెంట్లో పరిస్థితి మారుతోందా? నరసన్నపేట నియోజకవర్గంలో ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పరిశీలిద్దాం..


ధర్మాన కృష్ణదాస్( YCP ) ప్లస్ పాయింట్స్

  • ఉత్తరాంధ్ర బెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు
  • ప్రజలకు అందుబాటులో ఉండడం
  • గడప గడప ప్రోగ్రామ్స్ యాక్టివ్ పార్టిసిపేషన్
  • నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్

ధర్మాన కృష్ణదాస్ మైనస్ పాయింట్స్

  • విద్యుత్ బిల్లుల భారంపై జనంలో అసంతృప్తి
  • నిత్యవసరాల ధరాభారం పెరగడం
  • ఇంటింటికి నల్లా పథకం ఆలస్యమవడం
  • సరవకోటలో ప్రభుత్వాసుపత్రి నిర్మాణం కాకపోవడం

బగ్గు రమణమూర్తి (TDP) ప్లస్ పాయింట్స్

  • టీడీపీ, జనసేన వేవ్ కలిసి వచ్చే అవకాశం
  • ఉత్తరాంధ్రపై టీడీపీ ఫోకస్ పెంచడం
  • క్యాంపెయిన్ పై ఫోకస్ పెంచడం

బగ్గు రమణమూర్తి మైనస్ పాయింట్స్

  • గ్రౌండ్ లెవెల్ లో దూకుడు పెంచకపోవడం
  • సొంత సామాజికవర్గంలో ఎక్కువ మందిని ఆకట్టుకోకపోవడం

బగ్గు శ్రీనివాసరావు (TDP) ప్లస్ పాయింట్స్

  • కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడం
  • నరసన్నపేటలో న్యూరాలజిస్ట్ గా పేరు ప్రఖ్యాతులు

బగ్గు శ్రీనివాసరావు మైనస్ పాయింట్స్

  • రాజకీయ అనుభవం అంతగా లేకపోవడం
  • టీడీపీ టిక్కెట్ పై క్లారిటీ రాకపోవడం
  • గ్రౌండ్ లో దూకుడుగా లేకపోవడం

కులాల లెక్కలు..
పొలినాటి వెలమ 34
కళింగ 15%
కాపు 13%
ఎస్సీ 9%
ఎస్టీ 5%

నరసన్నపేటలో అభ్యర్థులు, పార్టీల వారీగా వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్‌ టీవీ సర్వేలో వాళ్లు చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇక్కడ పొలినాటి వెలమ కమ్యూనిటీ బలంగా ఉంది. ఈ సామాజికవర్గం నేతలకే టీడీపీ, వైసీపీ టిక్కెట్లు ఇస్తూ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పొలినాటి వెలమ వర్గానికి చెందిన వారిలో 50 శాతం మంది వైసీపీకి సపోర్ట్ ఇస్తామన్నారు. టీడీపీకి 40 శాతం, జనసేనకు 10 శాతం మంది మద్దతు ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వైసీపీ నుంచి టిక్కెట్ కన్ఫామ్ చేసుకున్న ధర్మాన కృష్ణదాస్ ది ఇదే పొలినాటి వెలమ సామాజికవర్గం, జగన్ ప్రభుత్వంలో కేబినెట్ 1.0లో డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. బగ్గు రమణమూర్తిది ఇదే కమ్యూనిటీ అయినా వారి ఓట్లను రాబట్టుకోవడంలో వెనుకబడుతున్నారు. ఇక కళింగ సామాజికవర్గానికి చెందిన వారిలో 50 శాతం మంది వైసీపీకి, 40 శాతం మంది టీడీపీకి, 10 శాతం జనసేనకు సపోర్ట్ గా ఉంటామన్నారు. అటు కాపుల్లో 40 శాతం మంది వైసీపీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు మద్దతుగా ఉంటామని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. ఎస్సీల్లో 55 శాతం మంది వైసీపీకి, 35 శాతం మంది టీడీపీకి, 10 శాతం వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. అటు ఎస్టీల్లో 60 శాతం జగన్ పార్టీకి, 35 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు అండగా ఉంటామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

ధర్మాన కృష్ణదాస్ VS బగ్గు రమణమూర్తి
YCP 49%
TDP+JANASENA 44%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ధర్మాన కృష్ణదాస్ కు 49 శాతం ఓట్ షేర్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి బరిలో ఉంటే 44 శాతం ఓట్లు సాధించే ఛాన్స్ ఉంది. నరసన్నపేట నియోజకవర్గంలో జనసేన ఎలాంటి ఇంఛార్జ్ ను నియమించలేదు. సో ఇక్కడ జనసేన సపోర్ట్ టీడీపీకే ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

.

.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×