EPAPER

Tirupathi | తిరుపతిలో టీడీపీ కూటమికే ఛాన్స్.. బరిలోకి పవన్?.. బిగ్ టీవి సర్వే ఏం చెబుతోంది?

Tirupathi | తిరుపతి నుంచి ఎన్టీఆర్ గెలిచారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అదే స్థానం నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం.

Tirupathi | తిరుపతిలో టీడీపీ కూటమికే ఛాన్స్.. బరిలోకి పవన్?.. బిగ్ టీవి సర్వే ఏం చెబుతోంది?

Tirupathi | తిరుపతి నుంచి ఎన్టీఆర్ గెలిచారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అదే స్థానం నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఏడుకొండల వెంకన్న ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం. అరుదైన ఎర్ర చందనంతో మరింత పాపులర్ అయింది. ఆధ్యాత్మికంగానే కాదు రాజకీయంగానూ తిరుపతి ఎప్పుడూ హాట్ సీటే. 1955 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకసారి గెలిచిన పార్టీని తిరిగి రెండోసారి వరుసగా ఇక్కడి ప్రజలు గెలిపించలేదు.


ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే భూము కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి టిక్కెట్ కన్ఫామ్ చేసుకున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉండనుంది? బిగ్‌ టీవీ డీటెయిల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలిందో చూద్దాం..

ముందు 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం..


భూమన కరుణాకర్ రెడ్డి (వైసీపీ) VS సుగుణమ్మ (టీడీపీ)
YCP 46%
TDP 44%
JANASENA 7%
OTHERS 3%

2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి విపరీతంగా ఉండడంతో 46 శాతం ఓట్ షేర్ తో ఈజీ విక్టరీ కొట్టారు భూమన. దాంతో పాటే తిరుపతిలో వ్యక్తిగత ఇమేజ్ కూడా కరుణాకర్ రెడ్డికి ఉండడంతో గెలుపు సాధ్యమైంది. అటు టీడీపీ నుంచి సుగుణమ్మ పోటీ చేశారు. గెలవకపోయినా 44 శాతం ఓట్ షేర్ రాబట్టారు. కేవలం 702 అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు టీడీపీలో కీలకంగా ఉండే చదలవాడ కృష్ణమూర్తి 2018లో టీడీపీ నుంచి జనసేనలో చేరారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు. అయితే కేవలం 7 శాతం ఓట్ షేర్ మాత్రమే సాధించగలిగారు. అయితే ఇప్పుడు తిరుపతిలో పోటీ సీన్ మారిపోయింది. ఈసారి వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి రంగంలోకి దిగుతుండగా, అటు జనసేన నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగితే పొలిటికల్ ఫైట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రాష్ట్రమంతా పెరుగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం తిరుపతి సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పరిశీలిద్దాం..

భూమన అభినయ్ రెడ్డి ప్లస్ పాయింట్స్
తిరుపతి సెగ్మెంట్ పై పట్టు
తిరుపతి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు
20కి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లతో అభివృద్ధి
జగన్ సర్కారు పథకాలపైనే ఆశలు
భూమన కరుణాకర్ రెడ్డి వారసత్వం

భూమన అభినయ్ రెడ్డి మైనస్ పాయింట్స్
వివిధ సామాజికవర్గాల్లో అసంతృప్తి
రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం
అభివృద్ధి పనులను సన్నిహితులకే కట్టబెట్టడం
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తికాకపోవడం

పవన్ కల్యాణ్ ప్లస్ పాయింట్స్
జనసేన అధినేతగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు
గతంలో కంటే పుంజుకున్న పవన్ పార్టీ
టీడీపీతో పొత్తులో టిక్కెట్ తీసుకుంటే కలిసి రానున్న సమీకరణాలు
కాపు సామాజికవర్గం బలంగా ఉండడం

పవన్ కల్యాణ్ మైనస్ పాయింట్స్
2014లో టీడీపీతో పొత్తు, 2019లో విడివిడిగా పోటీ
2019లో జనసేనకు వచ్చింది కేవలం 7% ఓట్లు
నియోజకవర్గానికి పవన్ కొత్త నేత కావడం

సుగుణమ్మ ప్లస్ పాయింట్స్
తిరుపతిలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు
పదేళ్ల రాజకీయ అనుభవం
702 ఓట్లతో ఓడడంతో జనంలో పెరిగిన సానుభూతి

సుగుణమ్మ (TDP) మైనస్ పాయింట్స్
బలమైన ప్రత్యర్థి ఉండడం
పొలిటికల్ స్పీడ్ పెంచకపోవడం
పొత్తులతో టిక్కెట్ డైలమా

కులాల ఓట్ల లెక్కలు..
కాపు 26%
యాదవ్ 18%
ఎస్సీ 12%
రెడ్డి 12%
కమ్మ 8%

తిరుపతి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కూడా ఇక్కడి నుంచే అదృష్టం పరీక్షించుకున్నారు.గెలిచారు కూడా. ఆ తర్వాతి స్థానంలో 18 శాతం యాదవ సామాజికవర్గం జనాభా ఉంది. అభ్యర్థులు,పార్టీల వారీగా వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్‌ టీవీ సర్వేలో వాళ్లు చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. కాపుల్లో వైసీపీకి 35 శాతం మంది మద్దతు ఇస్తుండగా, టీడీపీ జనసేనకు కలిపి 65 శాతం మంది కాపులు సపోర్ట్ గా ఉన్నట్లు తేలింది. అటు యాదవ సామాజికవర్గంలో 40 శాతం మంది వైసీపీకి, టీడీపీకి 55 శాతం, జనసేనకు 5 శాతం మద్దతు ఉన్నట్లుగా సర్వేలో తేలింది. ఇక ఎస్సీల్లో వైసీపీకి 35 శాతం మంది, టీడీపీకి 60 శాతం మంది, జనసేనకు 5 శాతం మంది సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇక రెడ్డి సామాజికవర్గంలో 60 శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు మద్దతుగా ఉన్నట్లు తేలింది. చివరగా కమ్మ సామాజికవర్గం నుంచి 25 శాతం మంది వైసీపీకి, 70 శాతం తెలుగుదేశం పార్టీకి, 5 శాతం జనసేనకు సపోర్ట్ ఇస్తున్నట్లు బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ లో తేలింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

భూమన అభినయ్ రెడ్డి VS పవన్ కల్యాణ్
YCP 34%
JANASENA 57%
OTHERS 9%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తిరుపతి సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది.టీడీపీ – జనసేన పొత్తులో ఉమ్మడి అభ్యర్థిని దింపితే ఓట్ షేర్ మరింత పెరుగుతుందని సర్వేలో క్లారిటీ వచ్చింది. వైసీపీ నుంచి టిక్కెట్ కన్ఫామ్ చేసుకున్న భూమన అభినయ్ రెడ్డి పవన్ కల్యాణ్ తో పోటీ పడితే.. 34 శాతం ఓట్ షేర్ దక్కించుకోనున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కు ఏకంగా 57 శాతం ఓట్ల షేర్ తో తిరుపతిలో గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. మొత్తంగా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవడం ఖాయమని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు.

భూమన అభినయ్ రెడ్డి VS సుగుణ
YCP 39%
TDP 52%
OTHERS 9%

ఇక పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి సుగుణమ్మ బరిలో దిగితే 52 శాతం ఓట్లు దక్కించుకుంటారన్నది సర్వే రిపోర్ట్ లో స్పష్టత వచ్చింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి 39 శాతం ఓట్లు వస్తున్నాయి. ఓవరాల్ గా తిరుపతి సెగ్మెంట్ లో అధికార వైసీపీకి నెగెటివ్ కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సమీకరణాల ఆధారంగా టీడీపీ-జనసేనకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

https://www.youtube.com/live/FMjBsH57jTc?si=CqPJi5cLcYealZdd

ఇది కూడా చదవండి : బిగ్ టీవీ సర్వే.. ధర్మాన కృష్ణదాస్ మళ్లీ గెలుస్తారా? టీడీపీ పరిస్థితేంటి?

ఇది కూడా చదవండి : మామాఅల్లుళ్ల పోరు.. బిగ్ టీవీ సర్వేలో విజయం ఎవరిది?

ఇది కూడా చదవండి : బిగ్ టీవి సర్వే రిపోర్ట్.. విజయవాడ సెంట్రల్ లో గెలుపు టీడీపీదేనా?..

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×