EPAPER

Arvind Kejriwal : గోవాకు కేజ్రీవాల్..! నాల్గోసారి ఈడీ విచారణకు డుమ్మా..!

Arvind Kejriwal : డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరుకావడం లేదని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Arvind Kejriwal : గోవాకు కేజ్రీవాల్..!  నాల్గోసారి ఈడీ విచారణకు డుమ్మా..!

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam) విచారణకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్‌ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate)కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ఢిల్లీలో విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు వెల్లడించారు.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన‌ విచారణకు హాజరుకాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని.. రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈడీ జనవరి 18న విచారణకు హాజరు కావాలని కోరుతూ గత వారం నాలుగోసారి సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×