EPAPER

Gudivada : ఎన్టీఆర్ వర్థంతి.. టీడీపీ-వైసీపీ పోటాపోటి కార్యక్రమాలు..

NTR టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన స్వస్థలమైన గుడివాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది టీడీపీ. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. మధ్యాహ్నం 3 గంటలకు నిమ్మకూరులో ఎన్టీఆర్‌, సబవతారకం విగ్రహాలకు నివాళులర్పించనున్నారు చంద్రబాబు దంపలు. అనంతరం గుడివాడ ముదినేపల్లి రోడ్డులో రా..కదలిరా.. కార్యక్రమం పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Gudivada : ఎన్టీఆర్ వర్థంతి.. టీడీపీ-వైసీపీ పోటాపోటి కార్యక్రమాలు..
AP Political news

Gudivada politics(AP political news):

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన స్వస్థలమైన గుడివాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది టీడీపీ. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. మధ్యాహ్నం 3 గంటలకు నిమ్మకూరులో ఎన్టీఆర్‌, సబవతారకం విగ్రహాలకు నివాళులర్పించనున్నారు చంద్రబాబు దంపలు. అనంతరం గుడివాడ ముదినేపల్లి రోడ్డులో రా..కదలిరా.. కార్యక్రమం పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.


దీంతో సభను విజయవంతం చేసేందుకు చుట్టుపక్కల నియోజకవర్గాలనుంచి పార్టీ శ్రేణులను సమీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. గుడివాడలో నిర్వహించే సభ ద్వారా దారిత్ర్య నిర్మూలనపై రూపొందించిన ఓ పత్రాన్ని విడుదల చేయనున్నారు చంద్రబాబు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలను ఆర్థికంగా పైకి తేవడమే లక్ష్యంగా ఈ పత్రాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు.

ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా.. గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. పోటాపోటి కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి వైసీపీ, టీడీపీ. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఎన్టీఆర్‌ టు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పేరుతో 300 బైక్‌లతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుడివాడ టౌన్‌లోని ప్రతి సెంటర్‌లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల కార్యక్రమాలతో గుడివాడలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో చంద్రబాబు బహిరంగ సభ ఉంది. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓ వైపు చంద్రబాబు టూర్‌.. మరోవైపు కొడాలి నాని కార్యక్రమాలతో గుడివాడలో టెన్సన్‌ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×