EPAPER

Purandeswari | ఏపీ బిజేపీలో పురంధేశ్వరి దూకుడు.. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు!

Purandeswari | ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో కలిసి నడుస్తుందన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. బీజేపీతో పనిలేకుండానే జనసేన అధినేత టీడీపీతో పొత్తు ఖాయం చేసుకుంది. ఒకప్పపుడు కమలంతో పొత్తు కోసం ఎదురు చూసిన ఆ రెండు పార్టీలు.. ఇప్పుడసలు అటువైపే చూడకుండా సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి.

Purandeswari | ఏపీ బిజేపీలో పురంధేశ్వరి దూకుడు.. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు!

Purandeswari | ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో కలిసి నడుస్తుందన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. బీజేపీతో పనిలేకుండానే జనసేన అధినేత టీడీపీతో పొత్తు ఖాయం చేసుకుంది. ఒకప్పపుడు కమలంతో పొత్తు కోసం ఎదురు చూసిన ఆ రెండు పార్టీలు.. ఇప్పుడసలు అటువైపే చూడకుండా సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్టాండ్ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది?. కమలనాథులు టీడీపీ, జనసేనల కూటమిలో కలవకపోతే చంద్రబాబుకు మరదలైన పురంధేశ్వరి ఆయన్ని పొలిటికల్‌గా ఎలా ఢీ కొంటారనేది చర్చనీయాంశంగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ కొత్త చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. అధ్యక్షురాలిగా తన తొలి ప్రసంగంలోనే జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటి వరకు టీడీపీపై మాత్రం ఆ స్థాయిలో విమర్శలు చేయడం లేదు.

దగ్గుబాటి పురంధేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తెగానే ఆమె పేరు పరిచయం అయినా.. ఆమె రాజకీయానుభవం, పనితీరు కారణంగానే తనదైన ముద్ర వేసుకోగలిగారామె. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి మారిపోయినా కూడా.. అక్కడా తన స్థానాన్ని గౌరవప్రదంగానే కొనసాగిస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాజకీయాలపరంగా చంద్రబాబుకు ఆమె కరుడుగట్టిన వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నారు. అమె భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం చంద్రబాబుపై వ్యతిరేకతతోనే వైసీపీ బాట పట్టారు. ఇప్పుడాయన ఆ పార్టీలో కూడా సైలెంట్ అయిపోయారు.


అలాంటిది ఇటీవల కాలంలో పురంధేశ్వరి టీడీపీ పట్ల ఒకింత సానుకూలతతోనే మాట్లాడుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారుల వ్యవహారం అనుమానాలకు తావిస్తోందని ఆమె గతంలోనే అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఆమె.. నైపుణ్యాభవృద్ధి శిక్షణకు అవసరమైన సౌకర్యాలు స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లుగా తమ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.కేసు విచారణలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారైనా స్పందించారా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అందువల్లనే చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై తాము ప్రశ్నిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

తర్వాత చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని ఆమె స్వాగతించారు. విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుపట్టిన ఆమె.. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్‌ కాదని వ్యాఖ్యానించారు. ఇక పొత్తుల ప్రసక్తి వచ్చినప్పుడు జనసేన తమ మిత్రపక్షమే అంటున్న పురంధేశ్వరి.. టీడీపీతో పొత్తు విషయమై ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్తున్నారు. అంతేగాని గతంలో సోమువీర్రాజు వంటి నేతలు టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని ప్రకటించినట్లుగా ఆమె మాట్లాడటం లేదు.

ఒక మరదలిగా తన బావ చంద్రబాబుకు అనుకూలంగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు.. అమె వ్యక్తిగతమో?… లేకపోతే పొత్తులను దృష్టిలో పెట్టుకుని చేశారో కాని .. ఒక వేళ బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగితే ఆమె స్టాండ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో ఆమె వైఖరి ఎలా ఉండబోతుంది?.. టీడీపీని ఆమె ఎలా డీల్‌ చేస్తారనేది చర్చల్లో నలుగుతోంది.

మరోవైపు ఒకప్పపుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించిన చంద్రబాబు అటువైపు చూడడం లేదు. జనసేనతో పొత్తు కుదుర్చుకుని సీట్ల పంపకాలు కూడా మొదలుపెట్టేశారు. కమలం పెద్దల ఆపాయింట్‌మెంట్‌ కోసం కూడా పెద్దగా ప్రయత్నించడం లేదు. దాంతో బీజేపీ ఒంటరి పోరు చేయాల్సిందేనా? అన్న డిస్కషన్ మొదలైంది. కర్నాటక ఎన్నికలకు ముందు బీజేపీ ఒకేమాట.. ఒకే పొత్తు అన్న తరహాలో ఏపీలో రాజకీయం నడిపించింది. జనసేనతో తప్ప టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఆపార్టీ రాష్ట్ర నేతలు పదే పదే బల్లగుద్ది మరీ చెప్పారు. మరోవైపు బీజేపీకి దగ్గరకు కావాలని టీడీపీ తనవంతు ప్రయత్నాలు సాగించింది.. కానీ అప్పట్లో టీడీపీ స్నేహహస్తాన్ని కమలం తిరస్కరించింది. 2014 ఎన్నికల పొత్తులప్పుడు జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ.. టీడీపీది అవకాశవాద రాజకీయమని విమర్శలు కూడా చేశారు కొందరు నేతలు.

గత ఏపీ ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది బీజేపీ. దాంతో ఒంటరి పోరుతో ఒరిగేదేంటో ఆ పార్టీ నేతలకు బాగా అర్థమైనట్లు ఉంది. అందుకే జనసేన తమ మిత్రపక్షమని పదేపదే ప్రకటనలు చేస్తోంది. ఇటు పవన్ కల్యాణ్ సైతం ప్రభుత్వ ఓటు చీలకూడదంటే టీడీపీని కలుపుకుని పోవడమే మంచిందన్న అభిప్రాయం బీజేపీ ఢిల్లీ పెద్దల ముందు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినా కమలనాథులు క్లారిటీ ఇవ్వలేదు. దాంతో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ విషయంలో డెసిషన్ తీసేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాట్ల పనిలో పడ్డాయి.

ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకోవడంతో ఏపీలో బీజేపీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది. ప్రతి లోక్ సభ సెగ్మెంటుకు ముగ్గురేసి సభ్యుల కమిటీని నియమించింది అధిష్టానం. ప్రతి నియోజకవర్గంలో ఆసక్తికలిగిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలా పొత్తలతో సంబంధం లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిలో పడింది.

ఇలాంటి తరుణంలో ఆ పార్టీ పరంగా పురంధేశ్వరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఒంటరి పోరుతో ఏపీలో బీజేపీ సాధించేదేమీ లేకపోయినా .. ఎన్నికల్లో పోటీ అంటే ప్రత్యర్ధులను విమర్శించడం తప్పనిసరి. ఆ క్రమంలో టీడీపీ అధినేతను కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది.. చంద్రబాబు అరెస్ట్‌పై ఆయనకు సానుకూలంగా మాట్లాడిన ఆమె.. రేపు ఎన్నికల ప్రచారంలో ఏమని విమర్శలు గుప్పిస్తారు?.. ఎలాంటి ఆరోపణలు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. మొత్తమ్మీద బావా మరదల్ల పొలిటికల్ రగడ ఎలా ఉండబోతుందనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×