EPAPER

Tirumala : గురువారం నుంచి అందుబాటులో.. ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..

Tirumala

Tirumala : గురువారం నుంచి అందుబాటులో.. ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..

Tirumala : ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జనవరి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, అష్టదళపాద పద్మారాధన, తోమాల, అర్చన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి నమోదు చేసుకోవచ్చు. జనవరి 20 ఉదయం 10 గంటల వరకు ఈ అవకాశం కల్పించారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల్లోగా రుసుం చెల్లించాలి.


జనవరి 22న ఉదయం 10 గంటలకు.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లు రిలీజ్ చేస్తారు. జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్‌ 21 నుంచి 23 వరకు నిర్వహిస్తారు. ఈ సేవా టికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

జనవరి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌ బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు.


జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు.జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ మొదలవుతాయి. ఏప్రిల్‌ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

భక్తులు వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×