EPAPER

China Population : ‘చేవ’ తగ్గిన జనచైనా..!

China Population : ‘చేవ’ తగ్గిన జనచైనా..!
todays international news

China Population(Today’s international news):

చైనా జనాభా(China Population) నిరుడు 20 లక్షలు తగ్గింది. వరుసగా రెండో ఏడాదీ జననాల రేటు(Birth Rate) పడిపోవడమే దీనికి కారణం. అదే సమయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన దరిమిలా మరణాలు మరణాలు దాదాపు రెట్టింపయ్యాయి. ఆంక్షల ఎత్తివేత అనంతరం మరణాల సంఖ్య(Death Rate) 6.9 లక్షలకు చేరింది. దీంతో చైనా జనాభా మరింత తగ్గినట్లయింది. ప్రస్తుతం డ్రాగన్ దేశ జనాభా 1.4 బిలియన్లు.


ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా రికార్డులకెక్కిన చైనా 2023లో రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానాన్ని మనం ఆక్రమించేశాం. ఏడేళ్లుగా చైనాలో జననాలు తగ్గుతూ వస్తున్నాయి. మరోవైపు వృద్ధుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కాలక్రమంలో శ్రమించే యువత సంఖ్య తగ్గిపోతే పెను దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. దీని వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడుతుంది.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. చైనాలో నిరుటి జననాలు 5.4 లక్షల మేర తగ్గాయి. 2023లో 90 లక్షల మంది జన్మించారు. 2016 నాటి జననాలతో పోలిస్తే ఇది సగమే. ఈ లెక్కల్లోకి హాంకాంగ్, మకావ్ ప్రాంతాలను చేర్చలేదు. చైనాలో ప్రతి పదేళ్లకు జనగణన జరుగుతుంటుంది.


గతంలో అనుసరించిన సింగిల్ చైల్డ్ పాలసీ(Single Child Policy) వల్లే చైనాకు ఇప్పుడీ తిప్పలు. జనాభా విపరీతంగా పెరిగినా, తగ్గినా ముప్పే. పకడ్బందీ విధానాలతో జనాభాను కట్టడి చేసిన చైనాకు.. ఇప్పుడు అదే రివర్స్ గేర్ అయింది. ముప్పును పసిగట్టిన చైనా తన విధానాలను సడలించుకుంది. 2015-16లో ద్వితీయ సంతానాన్ని అనుమతించిన డ్రాగన్ దేశం.. 2021లో మూడో సంతానికి కూడా పచ్చజెండా ఊపింది. కానీ దాని వల్ల ఫలితం పెద్దగా కనిపించలేదు.

ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, వీలైతే సంతానం లేకుండా జీవించడానికి చైనీయులు అలవాటు పడిపోయారు. పోటీతత్వం పెరగడంతో పాటు సిటీల్లో చదువులకు బోలెడు ఖర్చు చేయాల్సి రావడంతో.. సింగిల్ చైల్డ్‌ పెంపకాన్ని కూడా చైనీయులు భారంగా మారింది. దీంతో అసలు పిల్లలే వద్దనుకునే స్థితికి చేరుకున్నారు. 16-59 ఏళ్ల వయసును వర్కింగ్ ఏజ్‌గా పరిగణిస్తారు. ఆ వయస్కుల జనాభా ప్రస్తుతం 61 శాతానికి పడిపోయింది. 60 ఏళ్లు పైబడిన వారు 21 శాతానికి పెరిగారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×