EPAPER
Kirrak Couples Episode 1

Sankranti Return Journey : పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు, బస్సులు రద్దీ..

SANKRANTI RETURN JOURNEY : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.

Sankranti Return Journey :  పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు,  బస్సులు రద్దీ..

Sankranti Return Journey : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.


పండుగ ముగియడంతోపాటు రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో సొంతూరును విడిచి మళ్లీ నగరం బాట పట్టాల్సిన పరిస్థితితో అంతా సిటీకి రావడానికి సిద్ధమయ్యారు. కొందరైతే ఈ తెల్లవారుజాము నుంచే ప్రయాణం కాగా… రేపు మరింత మంది తరలివచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే,.. దాదాపు బస్సులు, రైళ్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో తిరుగు ప్రయాణంలోనూ జనానికి అవస్థలు తప్పడం లేదు. ఇక రిటర్న్‌ జర్నీ సందర్భంగా ఏపీలో ఇప్పటికే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులతో కోలాహాలం నెలకొంది. సంక్రాంతి తిరుగు ప్రయాణంతో మళ్లీ రోడ్లన్నీ కిక్కిరిపోనున్నాయి. దీంతో హైవేలపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొననుంది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలకు సిద్ధమయ్యారు.

సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11, 12వ తేదీల్లో ఏపీ సహా తెలంగాణ జిల్లాల వాసులు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లు తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గల పలు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే, మూడు రోజులుపాటు సాగిన పండుగ సంబురాలు ముగియడంతో తిరిగి జనం పల్లె నుంచి నగరం బాట పట్టడంతో సూర్యాపేట జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజాతోపాటు మరిన్ని టోల్‌ల వద్ద వాహనాల రద్దీ నెలకొనున్న నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలపై ఫోకస్‌ పెట్టారు. ఇక పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెలకు వెళ్తున్న సమయంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విషాదాన్ని నింపాయి. వరుస ప్రమాదాలు అందరినీ కలిచివేశాయి. ఈ తరుణంలో రవాణా అధికారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ తగదని హెచ్చరిస్తున్నారు. వెళ్లేటప్పుడు ఎంత సేఫ్‌గా వెళ్లారో తిరిగి వచ్చేటప్పుడు అంతే జాగ్రత్తగా రావాలని సూచిస్తున్నారు. గమ్యం చేరే సమయంలో ఓవర్‌ స్పీడ్‌ పనికిరాదని.. నిర్లక్ష్య ధోరణి వీడి డ్రైవింగ్‌ చేయాలని చెబుతున్నారు.


Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×