EPAPER
Kirrak Couples Episode 1

PM Modi : లేపాక్షి వీరభద్రస్వామికి మోదీ ప్రత్యేక పూజలు.. పాలసముద్రంలో నాసిన్ ప్రారంభోత్సవం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. డిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధాని మోదీకి వివరించారు.

PM Modi : లేపాక్షి  వీరభద్రస్వామికి మోదీ ప్రత్యేక పూజలు.. పాలసముద్రంలో నాసిన్ ప్రారంభోత్సవం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. డిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధాని మోదీకి వివరించారు.


శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌) ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద 44వ జాతీయ రహదారికి సమీపంలో 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇక్కడి నుంచి గంటలో చేరుకునే సౌలభ్యం ఉంది. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.


ఈ ఆవరణలోనే సోలార్‌ సిస్టం ఏర్పాటు చేశారు. శిక్షణకు అవసరమైన విమానాన్ని అందుబాటులో ఉంచారు. నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాసిన్‌.. ప్రముఖ శిక్షణా సంస్థగా మారుతుందని మోదీ అన్నారు. సుపరిపాలనకు సరికొత్త కేంద్రం అవుతుందన్నారు. వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. సత్య సాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. గాంధీజీ అనేకసార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారని మోదీ అన్నారు. రామరాజ్యంలోలాగా ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీజీ చెప్పారని తెలిపారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండటమేనని మోదీ స్పష్టంచేశారు.

నాసిన్‌.. దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచ కస్టమ్స్‌ సంస్థ కూడా నాసిన్‌కు గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. నాసిన్‌ ఏర్పాటు చేసిన కేంద్రానికి సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. నాసిన్‌లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయన్నారు.

Tags

Related News

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Big Stories

×