EPAPER

Trump vs Vivek : అవినీతిపరుడు, ఆర్థిక నేరగాడు.. వివేక్‌పై ట్రంప్‌ విమర్శలు..

Trump vs Vivek : భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి.. అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్ రామస్వామిపై డొనాల్డ్‌ ట్రంప్ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తన మద్దతుదారులు ఆయనకు ఓటు వేయొద్దని కోరారు. వివేక్‌ అవినీతి పరుడని, ఆర్థిక నేరగాడని ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని ఆయన విమర్శించారు.

మీరు అయోవాలో రిపబ్లికన్‌ పార్టీ అనుచరులైతే.. డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు తెలిపాలని ట్రంప్ ప్రచార సలహాదారుడు క్రిస్ లాసివిటా ఓటర్లకు విజ్జప్తి చేశారు. వివేక్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయనో మోసగాడన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వివేక్ దూకుడుగా ఉన్నారు. మొదటి నుంచి ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నారు. కొలరాడో కోర్టు తీర్పు తర్వాత ట్రంప్‌ పోటీచేయకుంటే.. తాను ఎన్నికల బరి నుంచి వైదొలుగుతానని వివేక్ ప్రకటించారు. మిగిలిన రిపబ్లికన్ అభ్యర్థులు సైతం పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. ఆ సమయంలో వివేక్‌ నిర్ణయాన్ని ట్రంప్‌ మెచ్చుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌ విమర్శలపై వివేక్‌ రామస్వామి ట్వీట్టర్ లో స్పందించారు. నన్ను విమర్శిస్తూ ట్రంప్‌ చేసిన పోస్టు చూశానన్నారు. ఆయన ప్రచార సలహాదారుల సూచనతో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. ఇకపై స్నేహపూర్వకమైన ఆరోపణలు ఏ మాత్రం పనిచేయవని భావిస్తున్నట్లు వివేక్ తెలిపారు. ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలనుకోవడం లేదన్నారు.

ట్రంప్ 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడని వివేక్ అన్నారు. అయోవా ప్రచారంలో ట్రంప్‌ మద్దతుదారులను కలిశానన్నారు. వారంతా ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళనగా ఉన్నారన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారంలో ట్రంప్‌ అయోవాలో ముందంజలో ఉన్నారు. ఆయనకు 53.6 శాతం మంది మద్దతు తెలుపుతున్నారు. వివేక్‌కు 7.6 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. సోమవారం పలు మీడియా సంస్థలు అయోవా పోల్‌ సర్వేలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రంప్‌ విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×