EPAPER
Kirrak Couples Episode 1

Amir Hussain Lone : శభాష్ అమీర్..రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడగలడు..

Amir Hussain Lone : శభాష్ అమీర్..రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడగలడు..
Amir Hussain Lone

Amir Hussain Lone : ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ క్రమంలో తమకి ఎదురయ్యే కష్టాలను చూసి తట్టుకోలేక, మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో తనొక్కడికే ఇన్ని కష్టాలు వచ్చాయని ఫీల్ అవుతూ ఉంటాడు. నిరాశ నిస్పృహల మధ్య జీవించలేక కొందరు తమ జీవితాలను అర్థాంతరంగా చాలిస్తుంటారు.


కానీ ఇలాంటి వారందరూ కూడా ఒక వ్యక్తిని చూడాలి. అతనెంత ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడో చూడాలి. ఏ మనిషికీ రాని కష్టం వచ్చినా సరే, దానిని అధిగమించి, తన కలను ఎలా సాకారం చేసుకున్నాడో చూడాలి. అతన్ని చూసి ప్రతి మనిషి నేర్చుకోవాలి. మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన ఆ యువకుడి పేరు… అమీర్ హుస్సేన్

అది జమ్ము కశ్మీర్‌లో బిజ్‌బెహరాలోని వాఘామా అనే చిన్న గ్రామం…కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారి ఈ ఊరిపేరు మార్మోగిపోయింది. ఏమిటి విషయం అంటే… ఆ ఊరిలో 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ కథ విని అందరూ చలించిపోతున్నారు. ఇంతకీ ఆ కథేమిటి?


ఎనిమిదేళ్ల వయసులో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో తండ్రితో పాటు..తన రెండు చేతులను అమీర్ కోల్పోయాడు. కానీ తనకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే తన తోటి స్నేహితులు కళ్ల ముందే క్రికెట్ ఆడుకుంటూ ఉంటే.. తనెందుకు ఇలా ఆడలేకపోతున్నానా అని రోజూ బాధపడుతుండే వాడు.

రోజూ స్కూల్ కి వెళ్లడం, రావడం ఇలా చదువుకునే రోజుల్లోనే అమీర్ కి క్రికెట్‌పై ఆసక్తి  ఎక్కువగా ఉండేది. కానీ ఆడే అవకాశం లేక తనలో తనే మదనపడేవాడు. కానీ ఒకరోజు మనసులో గట్టిగా అనుకున్నాడు. ముందు తనలోని మనోవైకల్యాన్ని అధిగమించాడు. నేనెందుకు ఆడలేనని పాజిటివ్ దృక్పథాన్ని ఎంచుకున్నాడు.

ఇంకెప్పుడూ తన మనసులోకి… నేను ఆడలేను, నేను పరుగెత్త లేను, క్యాచ్ లు పట్టలేను, నేను రాయలేను, నేను చదవలేను ఇలాంటి నెగిటివ్ థాట్స్ రానివ్వలేదు. అంతా పాజిటివ్ దృక్పథం.. నేను ఆడగలను, నేను రన్స్ తీయగలను, నేను బౌలింగ్ చేయగలను, నేను వికెట్లు తీయగలను, ఇలాగే నమ్మి ప్రాక్టీస్ చేశాడు.

అలా పగలు, రాత్రి కష్టపడ్డాడు. ఎన్నో దెబ్బలు తగిలించుకున్నాడు. పడితే చేతుల సాయం లేకుండా లేవడం కూడా కష్టమే. ఇవన్నీ అధిగమించాడు. తనకి తను ఒక సానుకూల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.

అలా కొన్నేళ్లకి తన చిరకాల కల నెరవేర్చుకున్నాడు. రెండు చేతులు లేకపోయినా సరే, మెడ దగ్గర బ్యాట్ పట్టుకుని, క్రీజులో నిలబడి బంతులను ఫోర్లు, సిక్సర్లు కొట్టగలడు. చాలామంది ముఖానికి దగ్గరగా ఉంటే బాల్ వస్తే ప్రమాదమని అనుకుంటారు. కానీ తను మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని బ్యాటింగ్ చేయడం విశేషం.

అంతేకాదండోయ్. తను బౌలింగ్ కూడా చేస్తాడు. రెండు చేతుల్లేకుండా బౌలింగ్ ఎలా చేస్తాడని అనుకుంటున్నారా? అదేనండి రెండు కాళ్లు ఉన్నాయి కదా. ఒక కాలి వేళ్లతో బాల్ పట్టుకుని అటూ ఇటు తిరిగి ఛక్ మని వికెట్ల మీదకు వేస్తాడు. అదండీ ఆత్మ విశ్వాసమంటే.. ఆడండీ మనిషంటే.. అని నెట్టింట అందరూ కొనియాడుతున్నారు.

నిజానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే తన సంకల్ప బలం ముందు అతని వైకల్యం చిన్నబోయింది.

మనిషి అనుకుంటే ఈ భూమ్మీద సాధించలేనిదంటూ ఏదీ లేదని అమీర్ హుస్సేన్ మరోసారి నిరూపించాడు. శభాష్ అమీర్ అని నెటిజన్లు తనని ఆకాశానికెత్తేస్తున్నారు. అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×