EPAPER
Kirrak Couples Episode 1

Bhogi Celebrations : స్వర్ణయుగం-సంక్రాంతి.. మందడంలో చంద్రబాబు, పవన్ భోగి వేడుకలు..

Bhogi Celebrations : స్వర్ణయుగం-సంక్రాంతి.. మందడంలో చంద్రబాబు, పవన్ భోగి వేడుకలు..

Bhogi Celebrations : అమరావతి గ్రామం మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ భోగి పండగలో పాల్గొన్నారు.అమరావతి ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరుతో భోగి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలంటూ.. ఆ ఉత్తర్వులను, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. తర్వాత రాజధాని గ్రామాల రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటించనున్నారు.


కాగా.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలనే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. సీట్ షేరింగ్, ఉమ్మడి మానిఫెస్టో, రెండు పార్టీలు కలిసి చేయాల్సిన ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న ఉండవల్లిలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల భేటీ అయ్యి.. ఈ అంశాలపై చర్చించారు. సుమారు మూడున్నర గంటలపాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ సూపర్‌ సిక్స్‌, జనసేన షణ్ముఖ వ్యూహం కలిపి మేనిఫెస్టోను రూపొందించానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నెలలోనే కామన్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని రెండు పార్టీ నేతల చెబుతున్నారు.

ఇక.. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై కూడా చర్చించారు. తెలుగుదేశం, జనసేనలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఈ చేరికల పర్వం ఇంకా కొనసాగుతుందని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. ఎవరెవరు చేరే అవకాశం ఉంది? వచ్చే వారికి కూడా సీట్ల సర్దుబాబు చేసేలా ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఏప్రాంతాల్లో చంద్రబాబు ఫోకస్ చేయాలి? ఏప్రాంతాల్లో పవన్ ప్రచారం చేయాలి? ఇక ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రచార కార్యక్రమాలపై కూడా మాట్లాడుకున్నారు.


.

.

Related News

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Big Stories

×