EPAPER
Kirrak Couples Episode 1

AP Politics : వైసీపీలో నేతలు ఎవరికీ వారే యమునా తీరే..! ఆలూరులో ఏం జరుగుతోంది..?

AP Politics : వైసీపీలో నేతలు ఎవరికీ వారే యమునా తీరే..! ఆలూరులో ఏం జరుగుతోంది..?

AP Politics : ఏపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లు సస్పెన్స్ సినిమాకు ఏమాత్రం తీసిపోవట్లేదు. కర్నూల్ జిల్లాల్లో అయితే రాజకీయం రంజుగా సాగుతోంది. ఒక్క సీటు కోసం సొంత పార్టీలోనే నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ ఓ నియోజకవర్గంలో మంత్రి గారికి ఈసారి టికెట్ లేదని కన్ఫామ్ అయ్యింది. బీసీ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే, షాక్‌లో ఉన్న మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక.. ఖరారైన అభ్యర్థి కలుపుకుపోతాడో లేదో అర్థంకాక.. పార్టీ వర్గాలు కంగారు పడుతున్నాయి.


కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గుమ్మానురు జయరామ్ చుట్టూ వివాదాల ఉచ్చు బిగిసింది. భూ అక్రమ దందా, లిక్కర్ మాఫియా, పేకాట వంటి వాటితో నియోజకవర్గం ఎప్పుడూ ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారడంతో.. మంత్రి పని తీరు మార్చుకోవాలని అధిష్ఠానం సూచించిందట. అయినా, మంత్రి తగ్గేది లేదన్నట్లు ఆయన పంథా మార్చుకోలేదని సమాచారం. దీనితో, ఇప్పుడు సీటుకే ఎసరొచ్చింది. దీనితో పాటు, ఆలూరు నియోజకవర్గం అధికార పార్టీకి చెందిన నలుగురు ప్రధాన నేతలు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడంతో పార్టీ కేడర్‌లోనూ అయోమయం నెలకొంది. ఇక, ఈ వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇప్పుడు ఆ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చిప్పగిరీ జెడ్పీటీసీ విరూపాక్షి పేరు ఖరారు చేసింది అధిష్టానం. అలాగే, గుమ్మనూరుకు ఎంపీ టికెట్ ఖరారు చేసింది.

ఆలూరు నియోజక వర్గంలో వైసీపీ నుండి బలమైన నాయకుడిగా జెడ్పీటీసీ విరూపాక్ష తన పరపతిని మొదటి నుండి పెంచుకుంటూ వచ్చాడనే టాక్ ఉంది. దీనితో పాటు తమ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది. అయితే, ఇప్పుడున్న డౌటంతా.. ఇతర వైసీపీ క్యాడర్‌ ఆయనకు సపోర్ట్ చేస్తుందా..? ఆయనైనా పార్టీ నేతలతో సర్దుబాట్లు చేసుకొని, సమన్వయంతో ముందుకెళ్తారా..? లేదంటే వర్గ పోరునే కొనసాగిస్తారా..? ప్రస్తుతం ఇదే సందిగ్ధంలో నియోజకవర్గ పార్టీ కేడర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా సీటు తనకే కేటాయించాలని గతంలో పార్టీ అధిష్టానానికి విన్నవించినప్పటికీ… అధిష్టానం మంత్రి మాటను పట్టించుకోలేదని అంతా అనుకుంటున్నారు. పోనీ… తనకు సీటు లేని పక్షంలో తన కుమారుడైన ఈశ్వర్‌కు సీటు కేటాయించాలని మంత్రి అడిగినట్లు సమాచారం. లేకపోతే, ఇతర వర్గాలకు తన కేడర్ సపోర్ట్ చేయదని పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ పెద్దలు వినలేదని అనుకుంటున్నారు. అయితే, ఇక్కడ సీటు మార్చడానికి మరో అదృశ్య హస్తం కూడా పనిచేసిందనే టాక్ కూడా ఉంది. అక్కడ బీసీ సామాజిక వర్గంలో ఒకరైన వాల్మీకులకు కచ్ఛితంగా టికెట్ కేటాయించాలని బెంగళూరు నుండి పావులు కదలాయని టాక్.

బెంగళూరు కేంద్రంగా ఆలూరు రాజకీయాలని మార్చడానికి అక్కడ రాజకీయాలు చేస్తున్న శ్రీరాములు తీవ్రంగా ప్రత్నించినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ అధిష్టానానికి తమ సామాజిక వర్గమైన నేతల పేర్లను సూచించారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుమ్మనూరు జయరాంకు టికెట్ రానీయకుండా.. మధుసూదన్‌కు ఇవ్వాలని బెంగళూరు కేంద్రంగా శ్రీరాములు పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపారట. అయితే, పార్టీ అధిష్టానం కూడా శ్రీరాములు చెప్పిన అభ్యర్థికే మొగ్గు చూపారని వార్తలు వచ్చాయి. కానీ, హఠాత్తుగా అధిష్టానం శ్రీరాములు చెప్పిన పేరు కాకుండా విరూపాక్షి పేరును ప్రకటించటంతో గుమ్మనూరు బాధితులంతా ఆలూరు నియోజకవర్గంలో సంతోషంగా ఉన్నారని శ్రీరాములు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఆలూరు నియోజకవర్గం లో తనకంటూ సొంత వర్గాన్ని పెంచుకొని, స్థానికంగా ఉంటున్న గుమ్మనూరుకు పార్టీ అధిష్టానం ఎంపీ సీటును కేటాయించింది. అయితే, కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గుమ్మనూరుకు సహకరిస్తారా లేక ఉన్న గ్రూపు తగాదాల వల్ల రాజకీయ పరిణామాలు మారతాయా అనే సందేహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే, కర్నూలు పార్లమెంటులో పార్టీ పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నారని టాక్.

మరోవైపు, కర్నూల్ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు, త్వరలోనే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధిష్టానం తమను పట్టించుకోలేదని, తాను తమ సామాజిక వర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమం అందించాలనుకున్నప్పటికీ పార్టీ అధిష్టానం సహకరించలేదనీ.. తనను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని.. అందుకే ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడలేని స్థితిలో ఉన్నానని ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక, ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే, తెరమీదకు గుమ్మనూరు జయరాం పేరు కూడా వచ్చింది. దీనితో గుమ్మనూరు అయోమయంలో పడినట్లు తెలుస్తుంది. గుమ్మనూరు జయరాం పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే పదవి కావాలని తెగేసి చెప్పినా, పార్టీ అధిష్టానం ఎంపీ సీటు ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నట్లు టాక్.

జిల్లాలో ఉండే కొందరు నాయకుల వల్లే తనుకు ఎంపీ సీటు పోయిందని పార్టీలో ఉండే నేతలపై సంజీవ్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారట. ఈసారి మరో పార్టీలో చేరి తమ సొంత సామాజిక వర్గమైన చేనేతల సపోర్ట్‌తో ఎలాగైనా వైసీపీ పార్టీకి బుద్ది చెప్పాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు, నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించిన గుమ్మనూరు జయరాం కూడా ఆశించిన ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు కాబట్టి… అభ్యర్థిగా సీటు దక్కించుకున్న విరుపాక్షి‌కి గుమ్మనూరు వర్గం సహకరిస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంది. ఇక, ఆలూరు నియోజకవర్గంలో వర్గపోరుతో ఉన్న పార్టీ కేడర్‌ను ఎవరికి వారు పంచేసుకున్నారు. ఇప్పుడు, పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేస్తుందా లేదా తాము నమ్ముకున్న నేతల వెనుకే ఉంటుందా అనే సందేహం కూడా ఉంది.

.

.

Related News

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Big Stories

×