EPAPER

ATVM: సంక్రాంతికి టిక్కెట్ బుక్ అవ్వలేదా ? ATVM ద్వారా సాధారణ రైలు టిక్కెట్ పొందండిలా..

ATVM: సంక్రాంతికి టిక్కెట్ బుక్ అవ్వలేదా ? ATVM ద్వారా సాధారణ రైలు టిక్కెట్ పొందండిలా..

ATVM: సొంతూరికి దూరంగా ఉన్నవారు, అత్తారింట్లో ఉన్న ఆడపిల్లలు, కొత్త అల్లుళ్లు, హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులు, ఇతర ఊళ్లలో కోర్సులకోసం వెళ్లినవారు.. ఇలా ఒక్కరేంటి.. పట్టణాల్లో ఉన్నవారంతా.. సంక్రాంతికి పల్లె బాటపట్టారు. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, స్పెషల్ బస్సులు, ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లు అన్నీ ఫుల్ అయ్యాయి. టిక్కెట్ బుక్ అయినవాళ్లు హ్యాపీ. మరి టిక్కెట్ దొరకని వారి పరిస్థితి ఏంటి ? ఒక్కటే దారి. జనరల్ ట్రైన్ టిక్కెట్ కొనుక్కుని వెళ్లడం. మామూలుగానే రైళ్లలో రద్దీ ఎక్కువ. మరి సంక్రాంతికి జనరల్ బోగీల్లో ఇంకెంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. ఊరెళ్లాలంటే ఇదొక్కటే దారి.


కౌంటర్లో టికెట్ కోసం గంటల తరబడి వేచి చూసేకంటే.. ATVM (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్), యూటీఎస్ (మొబైల్ టికెటింగ్ యాప్)ను రైల్వేశాఖ అందుబాటిలోకి తెచ్చింది. ప్రయాణికులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవడం ద్వారా.. జనరల్ టికెట్లు, ప్లాట్ ఫామ్ టికెట్లు, సీజనల్ టిక్కెట్లు ఎవరికి వారే సులభంగా పొందవచ్చు.

బుకింగ్ కౌంటర్ల వద్ద ఉన్న ATVM ద్వారా రైల్వే స్మార్ట్ కార్డుద్వారా.. లేదా క్యూఆర్ కోడ్ ద్వారా సాధారణ టిక్కెట్లను పొందవచ్చు. సీజనల్ టికెట్లను కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ముందుగా స్క్రీన్ పై ఈ రెండింటిలో మీకు కావలసిన ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత గమ్యస్థానంలో రైల్వేస్టేషన్ ను ఎంపిక చేసుకుని, ఎక్కాల్సిన రైలు, తరగతి, ఎన్నిటికెట్లు కావాలో వివరాలు నమోదు చేయాలి. టికెట్లకు రైల్వే స్మార్ట్ కార్డు లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయాలి. యూపీఐ ద్వారా చేస్తే 110 సెకండ్ల సమయంలోగా చేయాలి. డిజిటల్ చెల్లింపులు పూర్తయ్యాక ATVM నుంచి మీ టిక్కెట్ వస్తుంది.


సాధారణ ప్రయాణ టికెట్లు, సీజన్ టికెట్లు, ప్లాట్ ఫామ్ టికెట్ల కొనుగోలుకు యూటీఎస్ యాప్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి యాప్ ను వాడేవారు సైన్ అప్ చేయాలి. ఇప్పటికే వాడుతున్నట్లతే పాస్ వర్డ్ తో నేరుగా లాగిన్ అవ్వాలి. డ్రాప్ డౌన్ మెనూ నుంచి వెళ్లాల్సిన స్టేషన్ ను ఎంపిక చేసుకుని.. ఏదైనా ఆన్లైన్ పేమెంట్ యాప్ నుంచి పేమెంట్ చెల్లించి టికెట్ పొంవచ్చు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×