EPAPER
Kirrak Couples Episode 1

Kesineni Nani : నానికి వైసీపీ షాక్.. కేశినేని డిమాండ్లకు నో చెప్పిన సీఎం..?

Kesineni Nani : నానికి వైసీపీ షాక్.. కేశినేని డిమాండ్లకు నో చెప్పిన సీఎం..?

Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ లేదని టీడీపీ ఇచ్చిన షాక్‌తో వైసీపీ బాటపట్టారు. తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ని కేశినేని నాని కలిశారు. వైసీపీలో చేరడానికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్‌తో పాటు పలు డిమాండ్‌లు వినిపించారంట. ఆ డిమాండ్లలో మేజర్ డిమాండ్లను ఒప్పుకునే అవకాశం లేదని తేల్చి చెప్పి కేశినేని నానికి వైసీపీ కూడా షాక్ ఇచ్చిందంట. అసలు బెజవాడ ఎంపీ చేసిన డిమాండ్లు ఏంటి? వాటిపై వైసిపి నానికి ఇచ్చిన షాక్ ఏంటి?


కేశినేని నాని రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీలలో మొదలైంది. 2008లో పీఆర్పీలో చేరిన నాని. తాను ఆశించింది దక్కక మూడు నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు.పార్టీ నుంచి బయటకు వచ్చే ముందు చిరంజీవి, పార్టీపై పెద్దఎత్తున శాపనార్ధాలు పెట్టి కలకలం రేపారు. తర్తాత టిడిపిలో జాయిన్ అయిన నాని 2014, 19 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. 2024 వచ్చేసరికి మార్పులు చేర్పుల్లో భాగంగా టిడిపి అక్కడ వేరే వారికి సీటు ఇవ్వడానికి నిర్ణయించుకుని నానికి మొండి చేయి చూపించడంతో తీవ్రంగా ఆవేదనకు అయ్యారు కేశినేని నాని. ఇక్కడ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేసి బయటపడ్డారు.

టిడిపి సీటు నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా తనకు గెలిచే సత్తా ఉందని మొదట్లో ప్రకటించిన కేశినేని నాని. వైసీపీలో చేరడానికి ఫిక్స్ అయి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసారు. జగన్ ముందు తన డిమాండ్ల చిట్టా విప్పారంట ఆయన తనకు విజయవాడ ఎంపీ టికెట్‌తో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరో 5 అసెంబ్లీ సీట్ల తాను చెప్పిన వారికి ఇవ్వాలని కోరారంట. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేశినేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారంట.


దాంతో నానికి వైసీపీ అధిష్టానం పెద్ద షాకే ఇచ్చిందంట. ఆయన అడిగిన ఐదు నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వలేమని చెప్పారట. ఒక అసెంబ్లీ సీటు అయితే పరిశీలిస్తామని స్పష్టం చేశారంట అది కూడా తిరువూరు టికెట్ మాత్రమే కేటాయిస్తామన్నారంట. తాను ఎంపీగా పోటీ చేసి. తన కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి. మిగిలిన నాలుగు అసెంబ్లీ టికెట్లతో తన వర్గాన్ని కాపాడుకుందామనుకున్న కేశినేని వైసీపీ నిర్ణయంతో బిత్తరపోయారంటా.

రెండు సార్లు ఎంపీగా గెలిచిన తన మాటకు డిమాండ్ ఉంటుందనుకున్న నాని. తన డిమాండ్లకు వైసీపీ నో అనడంతో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. చేసేదేమీ లేక వైసీపీలోనే సర్దుకుపోతారనే టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయన టిడిపి ఇచ్చిన షాక్ అంటే వైసీపీ ఇచ్చిన షాకే చాలా బాధగా ఉందని తన అనుచరులు వద్ద వాపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది అలా ఉంటే కేశినేని తన వర్గీయులుగా భావిస్తున్న వారిలో పలువురు తన కార్యాలయానికి రాకపోవడంతో తెగ ఆందోళన చెందుతున్నారంట. తీరా విషయంని ఆరా తీస్తే వారు నాని వెంట నడిచే ప్రసక్తే లేదంటూ టీడీపీలో కొనసాగడానికి ఫిక్స్ అయిపోయినట్లు తెలిసింది.

Related News

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవులు.. తొలి విడతలో

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Budameru vagu: బుడమేరు ఆపరేషన్.. 270 ఎకరాల్లో ఆక్రమణలు

CM Chandrababu: తిరుమల లడ్డూ.. సీఎం చంద్రబాబుతో డీజీపీ భేటీ, సిట్‌‌పై కాసేపట్లో ప్రకటన

Jagan Family: మాకు సంబంధం లేదు.. మమ్మల్ని వదిలేయండన్న జగన్ దంపతులు

Deputy CM Pawan Kalyan: సనాతన ధర్మం జోలికి వస్తే వదిలేది లేదు.. ప్రకాష్ రాజ్ జాగ్రత్త : పవన్ వార్నింగ్

Mumbi Actress Case: నటి కాదంబరి కేసు, రేపో మాపో ఐపీఎస్‌ల అరెస్ట్! తెర వెనుక చుట్టూ

Big Stories

×