EPAPER
Kirrak Couples Episode 1

PVP : “బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..” కేశినేని నానిపై పీవీపీ సెటైర్లు..

PVP : “బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..” కేశినేని నానిపై పీవీపీ సెటైర్లు..
Andhra politics news

PVP Latest comments(Andhra politics news):

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ మరోసారి విమర్శలు గుప్పించారు. కేశినేని వైసీపీలో చేరుతున్న వేళ ఆయనను ఉద్దేశించి ఘాటుగా సైటర్లు వేశారు. “బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వాడి బుద్ది గురించి అందరికీ తెలిసిందే కదా” అని పీవీపీ ట్వీట్‌ చేయడం బెజవాడలో పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది.


వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కేశినేని నాని కలిసిన తర్వాత రోజే పీవీపీ ఇలాంటి ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండనున్నారు. 2019 ఎన్నికల్లో పీవీపీ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా విజయవాడ నుంచి పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో నాని టీడీపీని వీడారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

అసలు కేశినేని నాని, పీవీపీ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 2014లో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని పీవీపీ భావించారు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ద్వారా ఎంపీ టిక్కెట్ కోసం రాయబారాలు నడిపారు. నాటి పరిస్థితుల్లో కేశినేని నానికే టీడీపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో మరోసారి ఆయనే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పీవీపీ పైనే నాని గెలిచారు. ఇప్పుడు వైసీపీలోకి కేశినేని నాని చేరేందుకు సిద్ధమవడంతో పీవీపీ ఇలా ట్వీట్ల ద్వారా ఎటాక్ చేస్తున్నారు. 5 రోజుల క్రితం కూడా కేశినేనిపై ఘాటు విమర్శలు చేస్తూ పీవీపీ ట్వీట్ చేశారు.


.

.

Related News

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Big Stories

×