EPAPER
Kirrak Couples Episode 1

CAG on Kaleswaram: కాళేశ్వరం దొంగల్ని నిలదీసిన మంత్రులు.. త్వరలోనే జ్యుడిషియరీ ఎంక్వైరీ..

CAG on Kaleswaram: కాళేశ్వరం దొంగల్ని నిలదీసిన మంత్రులు.. త్వరలోనే జ్యుడిషియరీ ఎంక్వైరీ..

CAG on Kaleswaram: కాళేశ్వరం కథ ముగిసిపోయింది. ఇన్నాళ్లూ వివిధ పార్టీలు చెప్పింది.. ఇప్పుడు కాగ్ ఆన్ రికార్డుగా చెప్పేసింది. ప్రాజెక్టు వయబుల్ కాదని లెక్కలతో సహా తేల్చేసింది. ఇన్నాళ్లూ అదరహో అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండ అయింది. ఓవైపు కాగ్ రిపోర్టు, ఇంకోవైపు జ్యుడిషియరీ ఎంక్వీరీకి రంగం సిద్ధమవుతుండడంతో కాళేశ్వరం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్న వారిని కచ్చితంగా జనం ముందు నిలబెట్టబోతోంది కాంగ్రెస్ సర్కారు.


అసలే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఖజానాకు గుదిబండ అనుకుంటే.. ఇప్పుడు కుంగిపోవడం, రిపేర్లు చేసినా పనికిరాని పరిస్థితి వచ్చింది. కట్టిన మూడేళ్లకే చేతులెత్తేసింది. మేడిగడ్డ దగ్గర ఇటీవలే మంత్రుల బృందం కూడా వెళ్లి మ్యాటర్ తేల్చేసింది. ప్లానింగ్ సరిగా లేదు, డిజైన్ అసలే బాగోలేదు, నిర్మాణం అంతా ఫెయిల్యూర్.. బ్యారేజీకి, డ్యాంకు తేడా తెలియకుండా కట్టారంటూ గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన వారిపై ఫైర్ అయ్యారు మంత్రులు. ఈ ప్రాజెక్టుతో మొదటి నుంచి సంబంధం ఉన్న ఆఫీసర్లందరినీ మేడిగడ్డకు పిలిపించి వారికి ప్రశ్నలు సంధించి.. సమాధానాలు రాబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలనే డ్యాములుగా 16 టీఎంసీల దాకా నీటి నిల్వ చేయడం ఏంటని నిలదీశారు కూడా.

కాళేశ్వరంపై కాగ్ రిపోర్టు సహా జ్యుడిషియరీ ఎంక్వైరీ పూర్తయ్యాక తప్పు చేసిన వారికి శిక్ష తప్పేలా లేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఇష్యూపై సీరియస్ గా ఉన్నారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే మేలని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర కొంతముంపుతో ప్రాణహిత పూర్తి అయ్యేదని గుర్తు చేస్తూనే ఉన్నారు.


నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో చాలా ఆర్థిక భారం పడుతుందని అందరూ నెత్తీ నోరు బాదుకున్నారు. అయినా మాజీ సీఎం కేసీఆర్ వినలేదు. తాజాగా ఇందులో పని చేసిన ఇంజినీర్లను ప్రస్తుత ప్రభుత్వం డైరెక్ట్ గా కౌంటర్ వేస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు సాధ్యం కాదని ముందే ప్రభుత్వాలకు చెప్పాలని, అయినా మాట వినకపోతే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లి ఉంటే.. వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ఉండేదని ఇటీవలే మేడిగడ్డ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి హితవు పలికారు. ఇదొక తుగ్లక్ ప్రాజెక్టు అంటూ కౌంటర్ వేశారు. పైకి బాహుబలి మోటార్లు అని చెప్పినా.. ఊరు పేరు లేని కంపెనీల విడిభాగాలు తెచ్చి జాయింట్ చేసి మసిపూసి మారేడుకాయ చేశారన్నారు.

కాళేశ్వరానికి తెచ్చిన అప్పులకు మార్కెట్ రేటు కంటే 12శాతం ఎక్కువ వడ్డీ కట్టే పరిస్థితి తెచ్చారని మంత్రి పొంగులేటి కూడా ఇటీవలే ఫైర్ అయ్యారు. ప్రజలపై భారం ఎంతపడుతుందో ఆలోచించలేదని, కేవలం కేసీఆర్ మార్క్ కోసమే ప్రాజెక్ట్ కట్టారన్నారు. ఇప్పుడు కాగ్ రిపోర్టులోనూ జరిగిన దుబారా, అవినీతి వ్యవహారాలు తెరపైకి రావడం సంచలనంగా మారింది.

ఒక్కో సీజన్‌కు ఒక్కో ఎకరాకు సుమారు 50 వేల రూపాయల మేర కరెంట్ కోసమే ఖర్చు అవుతుందన్న లెక్కలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు ఏటా సుమారు 25 వేల కోట్ల ఖర్చు కానుందని కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు కూడా ఇరిగేషన్ ఆఫీసర్లు సరిగా ఇవ్వలేకపోయారు. తాజాగా కొన్ని కీలక ఫైల్స్ మాయమవుతుండడంతో విజిలెన్స్ రంగంలోకి దిగి ఫైల్స్ అన్నీ సీజ్ చేస్తోంది. ఇంకోవైపు జ్యుడిషియరీ విచారణ కోసం రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని.. కాంట్రాక్టు సంస్థలకు మేలు చేసేలా ఎవరు, ఎలా ప్రయత్నాలు చేశారన్న విషయాలన్నీ తెరపైకి రానున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసి వారికి చిక్కులు ఖాయమే అంటున్నారు.

2023–24 నుంచి 2034–35 మధ్యకాలంలో ఏటా 13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉంది. ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039–40 వరకు కొనసాగనున్నాయి. ఏటికేడు కట్టే వడ్డీలు, అసలు కట్టకుండా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. దీంతో అసలు రీపేమెంట్ సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాళేశ్వరం కోసం అప్పులు తీసుకునే క్రమంలో రాష్ట్ర సర్కార్ ఆయా సంస్థలకు చాలా విషయాలు చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంతో వివిధ రూపాల్లో ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని, ఆదాయం సమకూరడం లేదని కాగ్‌ నిర్ధారణకు వచ్చింది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో 63 వేల 352 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చడం ద్వారా 1,02,268 కోట్లకు చేర్చారని, అది లక్షన్నర కోట్లకు చేరుతుందని కాగ్ గుర్తించింది.

రాష్ట్ర సర్కారుకు రకరకాల మార్గాల ద్వారా నెలకు సగటున 10 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో ఐదో వంతు కాళేశ్వరం కోసమే ఖర్చు చేస్తే ప్రభుత్వ నిర్వహణ, జీతభత్యాలు, సంక్షేమ పథకాలకు డబ్బులు ఇలాంటి వ్యవహారాలను ఎలా చక్కబెడుతారు? ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారన్నది గత ప్రభుత్వాన్ని కాగ్ అడిగిన ప్రధాన ప్రశ్న. కాళేశ్వరం నిర్వహణకు నెలకు 2100 కోట్ల డబ్బులు అవసరం అవుతున్నాయి. వీటికి జవాబు ఇవ్వలేకపోయారు. పైగా రైతులు పండించిన పంటతో అప్పులు ఎప్పుడో తీరిపోయాయని చెప్పుకున్నారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 17 బాహుబలి మోటార్ల సాయంతో రోజుకు 3 టీఎంసీల చొప్పున ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేసి సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా మారిందంటే.. వానలు ఆలస్యమైతే ఇవ్వడానికి నీళ్లుండని పరిస్థితి.

ఇంకోవైపు వర్షాలు ఫుల్లుగా పడితే.. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు దిగువకు వస్తుంటాయి. దీంతో మోటార్లతో పైకి ఎత్తిపోసిన నీళ్లను వచ్చినవి వచ్చినట్లు దిగువకు వదలడం గత నాలుగేళ్ల నుంచి కనిపిస్తున్నదే. కరువు వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు సత్తా తెలుస్తుందని గతంలో కేసీఆర్ సహా మాజీ మంత్రులు కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు బ్యారేజీలు కుంగిపోయి ఉన్న నీళ్లన్నీ దిగువకు వదిలేశారు. ఉపయోగం గుండు సున్నా. 2019‒20లో మాత్రమే అత్యధికంగా 60 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేశారు. 2020–21లో 36 టీఎంసీలు, 2021‒22 లో 34 టీఎంసీలు ఎత్తిపోశారు. గోదావరి వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్‌‌‌‌హౌజ్‌‌ లు నీట మునిగాయి. మోటార్లను రిపేర్‌‌‌‌ చేసి 25 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేసినట్లు అధికారులు చెప్పారు. మోటార్ల రిపేర్ కు ఎంత ఖర్చయింది.. ఆ ఖర్చును నిర్మాణ సంస్థ భరించిందా.. రాష్ట్ర సర్కార్ భరించిందా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. 2021–22 వానాకాలం సీజన్‌‌లో తొలిసారి 57 వేల ఎకరాలకు, 2022–23 రబీ సీజన్​లో 74,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చినట్లు ఇరిగేషన్​ అధికారులు ప్రకటించారు. కాగ్ అయితే 40 వేల ఎకరాలకు మించి ఇవ్వలేదని రిపోర్ట్ ఇచ్చింది. ఇదీ గత కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ స్టోరీ.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా పొలాలకు నీళ్లిచ్చే కెనాల్స్ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. మొత్తం 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టగా.. కేవలం సీఎం సొంత జిల్లా సిద్దిపేటకు నీళ్లిచ్చే లింక్- 4, 5, 6 పనులు మాత్రం ఫాస్ట్ గా పూర్తి చేశారు. 10 నుంచి 19 ప్యాకేజీల కింద మెయిన్​ కెనాల్స్​ నిర్మించి కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్​కు నీళ్లు తీసుకుపోతున్నారు. కానీ, కాళేశ్వరం పక్కనే ఉన్న పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని లింక్- 1 పనులు నేటికీ ప్రారంభించలేదు. అదీ సంగతి. ఇప్పుడు కాగ్ రిపోర్టు, అటు జ్యుడిషియరీ ఎంక్వైరీతో కాళేశ్వరం కథలన్నీ తేలిపోనున్నాయి.

.

.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×