EPAPER
Kirrak Couples Episode 1

CAG Report on Kaleshwaram : కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..

CAG Report on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు అంతా మేడిపండు చందమే అన్నది ఇటీవలి ఘటనలు రుజువు చేశాయి. అంటే మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్లకు బుంగలు పడ్డాయి. అసలు ప్రాజెక్ట్ వయబులిటీ కాదన్నది ఇటీవలి మంత్రుల పర్యటనలో తేలిపోయింది. ఒక ప్రాజెక్ట్ ఎలా కట్టకూడదో ప్రపంచం మొత్తానికి చెప్పాలంటే ఇదో కేస్ స్టడీ అని నిపుణులు అంటున్నారు. ఎడా పెడా అప్పులు, వాటికి అడ్డగోలుగా వడ్డీలు అసలంతా కాళేశ్వరం ఓ ప్లేగ్రౌండ్ మాదిరిగా మారిపోయింది.

CAG Report on Kaleshwaram :  కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..

CAG Report on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు అంతా మేడిపండు చందమే అన్నది ఇటీవలి ఘటనలు రుజువు చేశాయి. అంటే మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్లకు బుంగలు పడ్డాయి. అసలు ప్రాజెక్ట్ వయబులిటీ కాదన్నది ఇటీవలి మంత్రుల పర్యటనలో తేలిపోయింది. ఒక ప్రాజెక్ట్ ఎలా కట్టకూడదో ప్రపంచం మొత్తానికి చెప్పాలంటే ఇదో కేస్ స్టడీ అని నిపుణులు అంటున్నారు. ఎడా పెడా అప్పులు, వాటికి అడ్డగోలుగా వడ్డీలు అసలంతా కాళేశ్వరం ఓ ప్లేగ్రౌండ్ మాదిరిగా మారిపోయింది.


కాళేశ్వరం గురించి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ను మన మాటల్లో సాఫ్ సీదా చెప్పాలంటే.. ఆర్థికంగా వర్కవుట్ కాదు. ఇది సుస్థిర ప్రాజెక్ట్ కానే కాదు. అంటే చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లు తయారైంది పరిస్థితి. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎవరైనా లక్ష కోట్ల రూపాయలు ఎవరైనా పెడుతారా? కానీ గత కేసీఆర్ సర్కార్ పెట్టింది. హడావుడిగా పనులు ముగించింది. తీరా ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు మూలన పడిపోయింది. ఏకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కార్పొరేషన్ ను క్రియేట్ చేశారు. 87,449 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. వడ్డీలు 7.8 నుంచి 10.9 శాతం చెల్లించేలా ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తవ్వాలంటే 1,49,317 కోట్లు అవుతుందని కాగ్ లెక్కేసింది. మొత్తం పూర్తవడం దేవుడెరుగు… అసలు ఇప్పుడు కుంగిన మేడిగడ్డ పరిస్థితి, అన్నారం, సుందిళ్ల లోపాలు సరిచేయడం ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో మునిగిన మోటార్లలో ఎన్ని వర్కవుట్ అవుతున్నాయో లెక్కలేదు.

నీటిని ఎత్తిపోసేందుకు కరెంట్ ఖర్చులు 14,687 కోట్లుగా లెక్కతేల్చింది కాగ్. మొదటి నుంచి ఈ ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తం చేస్తూనే వస్తోంది. అసలు వర్కవుట్ కాదని, ఆర్థికంగా భారమని, వచ్చే ఉపయోగం కూడా పెద్దగా ఉండబోదన్నారు. అయితే కేసీఆర్ రైతుల కోసం ఎంత వరకైనా రెడీ అన్నారు. రైతులు పండించిన పంటతో కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని కూడా జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు మాజీ సీఎం. ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో నీళ్లు లేవు. వచ్చే పరిస్థితి లేదు. పైగా బ్యాక్ వాటర్ తో మంచిర్యాల జిల్లాలో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఇలా ఏ యాంగిల్ లో చూసినా కాళేశ్వరం అందరికీ విఫల ప్రాజెక్టుగానే కనిపిస్తోంది.


కాళేశ్వరం కోసం తీసుకున్న లోన్ల రీ పేమెంట్ షెడ్యూల్స్ పైనా గత సర్కార్ చేతులెత్తేసింది. 15 అగ్రిమెంట్లలో పదింటికి 2020-21 నుంచి లోన్ పేమెంట్ షెడ్యూల్ మొదలైంది. అయితే రీపేమెంట్ లేట్ అవడంతో అదనపు వడ్డీ భారం 8182 కోట్ల రూపాయలు పడిందని కాగ్ లెక్కేసింది. కాళేశ్వరం డీపీఆర్ ను 2018 జూన్ లో సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది. 81,911 కోట్ల ఖర్చుతో జూన్ 2022 వరకు పూర్తవుతుందని అందులో చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతుండడంతో 2024 జూన్ వరకు 1,49,317 కోట్లకు అంచనా వ్యయం పెరుగుతుందని కాగ్ అంచనా కట్టింది.

18 లక్షల ఎకరాలకు నీరు కాకుండా కేవలం 40,288 ఎకరాలకే నీరు అందించేలా ప్రాజెక్టు పరిస్థితి మారిందని కాగ్ చెబుతోంది. ప్రాజెక్టుకు అవసరమైన పంపులు, మోటార్లు, ఇతర ఎక్విప్ మెంట్ కొనుగోళ్లు, ఎస్టిమేషన్లలో పారదర్శకత అసలే లేదని కాగ్ అక్షింతలు వేసింది. BHEL సప్లై చేసిన పైపుల విలువ 1686 కోట్ల రూపాయలు ఉంటే.. కాంట్రాక్ట్ సంస్థలు ప్రభుత్వం దగ్గర్నుంచి 7212 కోట్లు వసూల్ చేసిన విషయాన్ని కాగ్ గుర్తించింది. మోటార్ల సప్లైలో 5188 కోట్లు అదనంగా వసూలయ్యాయని, ప్రైస్ అడ్జెస్ట్ మెంట్ లోనూ 1343 కోట్ల లబ్ది చూసుకున్నారని కాగ్ అంటోంది. ప్యాకేజ్ 18లో సొరంగం పొడవు తగ్గినా.. ఆ ప్రకారం నిర్మాణ వ్యయాన్ని కాంట్రాక్టర్ తగ్గించలేదు.

అన్ని ప్యాకేజీల్లోనూ నిర్మాణ సంస్థలకు అదనపు చెల్లింపులు చేశారని కాగ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. పైగా గత బీఆర్ఎస్ సర్కార్ 13 ప్యాకేజీలకు సంబంధించిన ఇన్ వాయిస్ లను ఆడిటింగ్ ఏజెన్సీ కాగ్ కు అందించలేకపోయింది. చేసిన పనుల్లో అంచనాలకు తగ్గట్లు లేవని కాగ్ స్వతంత్ర దర్యాప్తులో గుర్తించింది ఈ విషయాన్ని రిపోర్టులో ప్రస్తావించింది. సో కాళేశ్వరం తవ్వే కొద్దీ కాళేశ్వరం అవినీతి మరింతగా బయటికొస్తోంది.

Related News

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

Big Stories

×