EPAPER
Kirrak Couples Episode 1

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైంది.. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి.. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.. అదీకాక రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం.. విభజన హమీల అమలులో కేంద్రం అవలంభిస్తున్న వైఖరితో.. కాషాయపార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు.

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైంది.. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి.. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.. అదీకాక రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం.. విభజన హమీల అమలులో కేంద్రం అవలంభిస్తున్న వైఖరితో.. కాషాయపార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు.


పొత్తులో భాగంగా పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన తో సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది.. దానిపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన చేయడానికి కూడా రెండు పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని.. టీడీపీతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందంటూ.. కలిసి పోటీ చేసే విషయమై ఒకింత సానుకూలంగా మాట్లాడటం గమనార్హం. తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా దాదాపు పూర్తవుతున్న టైంలో పురందేశ్వరి చేసిన ప్రకటనను తెలుగుదేశం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. అదీ కాక ఒక వైపు పురందేశ్వరి పొత్తుపై ఒకింత సానుకూలంగా మాట్లాడుతుంటే.. కొందరు నేతలు మాత్రం పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుంచే రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండటం టీడీపీని చికాకు పరుస్తోందంట.. అంతే కాకుండా బీజేపీ నాయకులు కొందరు పొత్తులో భాగంగా అత్యధిక స్థానాలను డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తుండటంతో బీజేపీ విషయాన్ని టీడీపీ లైట్ తీసుకుంటోందంటున్నారు.

ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఎంతో.. ఓటు స్టేక్ ఎంతో 2019 ఎన్నికల్లోనే తేలిపోయింది.. ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది.. ఆ ఎన్నికల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ ఓట్ల షేరింగ్ కేవలం 0.96 శాతం మాత్రమే .. కాంగ్రెస్ 1.29 శాతం ఓట్లతో కాస్త ఫర్వాలేదనిపించింది.
అది బీజేపీ నేతలకు తెలియని విషయమేమీ కాదు.. ఒంటరిగా పోటీ చేస్తే కాషాయపార్టీకి డిపాజిట్లు గల్లంతవ్వడం మినహా ఒరిగేదేమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని కలుపుకుంటే మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తోంది.. కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది.. మరో సారి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయన్న ఏకైక కారణంతో.. ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం రాష్ట్రంలో తెలుగుదేశంకు కానీ, జనసేనకు కానీ ఏమీ మేలు చేయదని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఓపెన్‌గానే అంటున్నారు.


అదీకాక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ని కోలుకోలేని దెబ్బ కొట్టారు ఏపీ ఓటర్లు.. అప్పుడు కాంగ్రెస్‌పై ఆగ్రహమే ఇప్పుడు బీజేపీపై కూడా రాష్ట్ర ప్రజల్లో ఉందంటున్నారు.. ప్రత్యేక హోదా అటకెక్కించేయడం.. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయకపోవడం.. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుని పక్కన పెట్టేయడం.. ఇలా విభజన హామీల అమలులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో.. రాష్ట్ర వాసుల్లో ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.. అమరావతి రాజధాని శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ.. ఇప్పుడు రాష్ట్ర రాజధానిపై అంత గందరగోళం నెలకొన్నా.. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంపై కూడా ఏపీ జనం అసహనంతో ఉన్నారంటున్నారు.. ఆ క్రమంలో ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో కలిసి నడిస్తే నష్టమే తప్ప.. ఇసుమంత లాభం కూడా ఉండదని టీడీపీ శ్రేణులు, జనసైనికులు అంటున్నారు.. అన్నిటికీ మించి మోడీ సర్కారు, జగన్ ప్రభుత్వం పరోక్ష మిత్రుల్ల వ్యవహరిస్తూ వచ్చాయన్న భావన చాలా మందిలో ఉందని.. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటే సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా పాడు చేసుకోవడమే అవుతుందంన్నారు.

ఇంతకు ముందు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు.. బీజేపీతో తమకు విభేదాలు లేవనీ… విభజన తర్వాత ఏపీలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి.. విభజన చట్టంలోని హామీల అమలులో జరిగిన తీవ్ర జాప్యమే కారణమని వెల్లడించారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు.. ప్రస్తుతం టీడీపీ, జనసేన కూటమి సమన్వయంతో ఇరు పార్టీల ఓట్ల బదలాయింపు జరిగేలా చూసుకోవడంపైనే దృష్టి పెట్టాయి.. మరో వైపు జనసేనాని బీజేపీతో బంధాన్ని తెగతెంపులు చేసుకోకుండా.. పొత్తుపై ఆ పార్టీ నిర్ణయం వచ్చే వరకూ వెయిట్ చేయకుండా.. టీడీపీతో కలిసి నడవడానికి సిద్దమైపోయారు.. ఇదంతా చూస్తూ బీజేపీ అవసరం లేకుండానే ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం, జనసేన దాదాపుగా నిర్ణయానికి వచ్చేశాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అదలా ఉంటే ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే జరిగేదేమిటో బీజేపీ నేతలకు తెలియని విషయం కాదు.. అలాగని ఆ హిందుత్వ పార్టీ క్రిస్టియన్ మార్క్ ఉన్న వైసీపీతో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు.. దాంతో ఏపీలో కనీసం ఉనికి చాటుకోవాలంటే కమలనాథులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం టీడీపీ, జనసేనల కూటమిలో చేరడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నే ఇటీవల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది … ఈ భేటీలో ఇరువురి మధ్యా పొత్తు విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

పైకి బీజేపీ ఇన్ని స్థానాలు, అన్ని స్థానాలు కావాలంటూ ప్రకటనలు చేస్తున్నా.. లోపాయికారిగా మాత్రం గతంలో అంటే 2014 ఎన్నికలలో పొత్తులో భాగంగా తెలుగుదేశం బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలు ఇస్తే చాలని చెబుతున్నట్లు సమాచారం.. అయితే లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం ఒకింత గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.. అయితే ఈ సారి జనసేన కూడా పోటీలో ఉండటంతో.. ఒకవేళ బీజేపీ కలిసివచ్చినా.. గతంలో ఇచ్చినన్ని సీట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు.. అందుకే బీజేపీతో సీట్ల విషయంలో బేరసారాలు ఆడటం కంటే … ఆ పార్టీని పొత్తుకు దూరంగా ఉంచడమే మేలని టీడీపీ అధిష్టానం భావిస్తుందంటున్నారు.

బీజేపీని దూరం పెట్టాలని టీడీపీ పెద్దలు భావిస్తుండటం వెనుక ఇంకో పొలిటికల్ ఈక్వేషన్ కూడా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు .. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనున్నారు… షర్మిల ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో గెలిపించే పరిస్థితి అయితే లేదు కాని… పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను చీలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అది తమకు మరింత ప్లస్ అవుతుందని టీడీపీతో పాటు జనసేన శ్రేణులు కూడా భావిస్తున్నాయి .. అందుకే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం పెద్దగా లేదని పార్టీ అధినేతలకు సూచిస్తున్నాయంట… మరి చూడాలి ఈ పొత్తుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో.

Related News

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Big Stories

×