EPAPER

Election Commissioner : ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు.. 22న తుది జాబితా విడుదల..

Election Commissioner : రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయనన్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయన్నారు.

పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించామన్నారు. మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు. వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభ పరిణామమని తెలిపారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందని ఈసీ తెలిపారు. తొలిసారిగా 7.88లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. వందేళ్లు దాటిన వృద్ధులు 1,174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న తుది జాబితా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×