EPAPER

Simultaneous Polls : జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణ.. ప్రజల నుంచి ఐదు వేల సూచనలు..

Simultaneous Polls : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా సూచనలు అందాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది.

ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను కమిటీ ఆహ్వానించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచనలను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో తగిన మార్పులను సూచించాలని కోవింద్‌ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదా [email protected] ఐడీకి ఈ-మెయిల్‌ చేయాలని తెలియజేసింది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం 2023 సెప్టెంబర్ లో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలను నిర్వహించింది. ఇటీవల కమిటీ ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది.

Tags

Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×