EPAPER

Drishti 10 Starliner : నౌకా దళంలోకి మరో అస్త్రం.. అందుబాటులోకి దృష్టి 10 స్టార్ లైనర్..

Drishti 10 Starliner : నౌకా దళంలోకి మరో అస్త్రం.. అందుబాటులోకి దృష్టి 10 స్టార్ లైనర్..

Drishti 10 Starliner : భారత నేవీ(Indian Navy) దళంలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. 36 గంటల పాటు విరామం లేకుండా గగనతలం నుంచి పహారా కాయగల మానవ రహిత విమానాన్ని(Unmanned Aerial Vehicle).. హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో ప్రారంభించారు. తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, నేవీ అధికారి ఆర్‌ హరికుమార్‌ ఈ అధునాతన డ్రోన్‌ను ప్రారంభించారు. దృష్టి 10 స్టార్‌లైనర్‌(Drishti 10 Starliner)గా దీనికి నామకరణం చేశారు.


నౌకాదళ అవసరాలకు అనుగుణంగా దృష్టి డ్రోన్‌ను సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మానవరహిత విమానం 450 కిలోల పేలోడ్‌(Payload)ను మోసుకెళ్లగలదు. ఇందులో అధునాతన ఇంటెలిజెన్స్, నిఘా ప్లాట్‌ఫారమ్ ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ డ్రోన్‌ ఆకాశంలో పహారా కాయగలదు. ISR కార్యాకలాపాలలొ దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు ఈ దృష్టి స్టార్‌ లైనర్‌ ఆవిష్కరణ తోడ్పడనుందన్నారు హరికుమార్‌.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యూఏవీని ఆవిష్కరించడం గొప్ప విజయమని అన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. హైదరాబాద్ ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర సాంకేతికపరంగా ముందుందని ప్రశంసల జల్లు కురిపించిన ఆయన.. భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.


Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×