EPAPER

Marathon Punching : పంచ్‌లతో రికార్డులన్నీ పచ్చడి..! గిన్నిస్‌లోకి ఇండియన్!

Marathon Punching : పంచ్‌లతో రికార్డులన్నీ పచ్చడి..! గిన్నిస్‌లోకి ఇండియన్!

Marathon Punching : పంచ్‌బాగ్‌ పంచ్‌లు విసరాలంటే ఎంత శక్తి కావాలి? అందునా ఏకబిగిన 55 గంటల 15 నిమిషాల పాటు మారథాన్ పంచింగ్ చేయడమంటే మాటలా? మార్షల్ ఆర్టిస్ట్ సిద్దూ క్షేత్రి(Sidhu Kshetri, 42) పంచింగ్‌లో సత్తా చూపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. దేశంలో లెక్కలేనన్ని టేక్వెండో పోటీల్లో పాల్గొన్న సిద్ధూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.


సిద్దూ 5 నిమిషాలు అధికంగా పంచ్‌లు విసిరి గత రికార్డును తిరగరాశాడు. ఈ రికార్డు సాధన సమయంలో అతను ప్రతి రెండు సెకన్లకు ఒక పంచ్ చేయగలిగాడు. ఈ లాంగెస్ట్ మారథాన్‌లో ప్రతి గంటకు 5 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఉంటుంది. తిండి, నిద్ర, వాష్‌రూం వినియోగం.. ఏదైనా ఆ స్వల్ప వ్యవధిలోనే! నిద్ర కూడా లేకుండా రెండు రోజులకుపైనే నిర్విరామంగా పంచ్‌బాగ్‌పై పిడిగుద్దులు వేస్తూనే ఉన్నాడు సిద్ధూ. అతని శారీరక దారుఢ్యం ఏ పాటిదో ఈ మారథాన్‌ పంచింగ్‌తో తెలిసివచ్చింది.

20 గంటలు గడిచిన తర్వాత నొప్పి మొదలైందని సిద్ధూ చెప్పాడు. మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నందునే.. ఆ నొప్పిని భరించగలిగానని, రికార్డు సాధించగలిగానని వివరించాడు. ఇక అత్యంత కఠినమైన సమయం ఏదంటే రెండో రోజు రాత్రి అని చెప్పాడు. అప్పటికే 30 గంటలుగా ముష్టిఘాతాలు విసురుతున్నాడు. పైగా నిద్ర కూడా పెద్దగా లేదు. అయితే ఇంకో గంటే కదా? అని తనకు తాను సర్దిచెప్పుకుంటూ ఆ కఠిన పరిస్థితులను అధిగమించానని తెలిపాడు.


స్నేహితులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో పంచింగ్ ను కొనసాగించాలనే పట్టుదల పెరిగిందని.. ప్రపంచ రికార్డు కూడా సాధించగలిగానని సిద్ధూ వివరించాడు. ఈ రికార్డు కోసం అతను ఆరు నెలలు శ్రమించాడు. ప్రతి రోజూ 8 గంటల పాటు శిక్షణ తీసుకున్నాడు. 2013లో సిద్ధూ పేరిటమరో రికార్డు కూడా నమోదైంది. ఒక కాలును ఉపయోగించి 3 నిమిషాల్లో అత్యధికంగా 620 మార్షల్ ఆర్ట్ కిక్స్ ఇవ్వగలిగాడు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×