EPAPER

India vs Afghanistan : ఆఫ్గనిస్థాన్‌తో టీ20 మ్యాచ్..! ఆ.. 11 మంది ఎవరు?

India vs Afghanistan : ఆఫ్గనిస్థాన్‌తో టీ20 మ్యాచ్..!  ఆ.. 11 మంది ఎవరు?

India vs Afghanistan : ఆఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ కి రంగం సిద్ధం అవుతోంది. జనవరి 11న తొలి టీ 20 మొహలీలో జరగనుంది. ఈ సిరీస్ కి 16మందితో కూడిన జట్టుని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఇదే జట్టు వచ్చే టీ 20 ప్రపంచకప్ వరకు ఉంటుందా? అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇంకా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ వీరు గాయాల బారిన పడ్డారు.


మరి వీరు కోలుకుంటే తప్పనిసరిగా టీ 20లో చోటు ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో ఇప్పుడున్న 16 మందిలో ఉండేవారు ఎవరు? పక్కకు తప్పుకునేవారెవరు? అనేది చూడాలి. అయితే టీమ్ ఇండియాకి ప్రస్తుతం ప్రతిభావంతులు అధికంగా ఉన్నారు. ఎవరికి వారు అద్భుతంగా ఆడుతున్నారు. చక్కగా రాణిస్తున్నారు. కాకపోతే వీరికి అంతర్జాతీయ వేదికలపై అనుభవం తక్కువగా ఉంది. అందుకు విరివిగా అవకాశాలు ఇవ్వాలి. అలా చేయకపోతే అందరూ ఇండియా పిచ్‌ల మీద, ఐపీఎల్, రంజీ ట్రోఫీలు, మన ఇండియన్స్ మీద ఇండియన్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ కి ప్రతిభావంతులతో పెద్ద సమస్యగా మారింది. ఎవరిని ఉంచాలి? ఎవరిని ఆడించాలనేది ప్రశ్నగా ఉంది. రాబోయే టీ 20 ప్రపంచకప్ పక్కన పెట్టినా, ఇప్పుడు ఎంపిక చేసిన 16మందిలో 11 మందిని ఎంపిక చేయడం టీమ్ మేనేజ్మెంట్ కి సవాల్ గా మారింది.


ఓపెనర్ గా కెప్టెన్ రోహిత్ శర్మ ఉంటాడు. అతనికి జోడిగా శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని ఆడించాలనేది పెద్ద తలపోటుగా ఉంది. గిల్ కి పలు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. యశస్వి కూడా రేపు రోహిత్ శర్మ రిటైర్ అయితే, తనకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.

ఫస్ట్ డౌన్ విరాట్ కొహ్లీ వస్తాడు. సెకండ్ డౌన్ సంజూ శాంసన్ వస్తాడు. మూడో డౌన్ శివమ్ దూబే , తర్వాత రింకూ సింగ్, తర్వాత అక్షర్ పటేల్ ఇలా సీరియల్ ఉంది. ఈ ఆర్డర్ లో చూసుకుంటే హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మకి స్థానం కష్టంలాగే ఉంది. జితేశ్ పరిస్థితి అంతే. సంజూశాంసన్ ఆడేలా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ స్థానాన్ని శివమ్ దూబే కవర్ చేయవచ్చునని అంటున్నారు.

అర్షదీప్ సింగ్ మెయిన్ బౌలర్ గా అవకాశం ఎత్తనున్నాడు. ఎందుకంటే బుమ్రా, సిరాజ్ ఇద్దరూ లేరు. అలాగే మహ్మద్ షమీ కూడా లేడు. ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ పేసర్లుగా రానున్నారు. స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ ని కాదని అక్షర్ పటేల్ వచ్చే అవకాశాలున్నాయి. మరో స్పిన్నర్ కోసం కులదీప్, రవి బిష్ణోయ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

టీ 20 జట్టు సభ్యలు వీరే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.

India vs Afghanistan, India Playing 11, BCCI, Indian Cricket Team, India vs Afghanistan First T20,

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×