EPAPER

Extravagant KCR Govt : ప్రజల సొమ్ము భారీగా దుర్వినియోగం.. ఇదీ కేసీఆర్ సర్కార్ విధానం..

Extravagant KCR Govt : గత పదేళ్లలో ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చయింది. ధనిక రాష్ట్రమని బయటకు చెబుతూ.. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం దగ్గర్నుంచి చేసిన ఆర్భాటపు పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో చేసిన విచ్చలవిడి ఖర్చులను, దాంతో కలిగిన నష్టాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తవ్వి తీస్తోంది. అందులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ లెక్కలు చూస్తుంటే.. ఇంత వృధా అయిందా అని ఆఫీసర్లే ఆశ్చర్యపోయే పరిస్థితి.

ఇదీ కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన పనుల పరిస్థితి. ఏ పని చేసినా అంతా హడావుడి. రికార్డులు బ్రేక్ అవుతున్నాయని ఊదరగొట్టే డైలాగ్ లు తప్ప అన్నీ పైన పటారం.. లోన లొటారం అన్నట్లుగా పరిస్థితి మారింది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర్నుంచి మొదలు పెడితే.. కొత్త సచివాలయం దాకా ఇదే సీన్ రిపీట్. తక్కువ టైంలో ఎక్కువ పని చేశాం.. రికార్డు సమయంలో పనులు పూర్తి చేశాం అన్నట్లుగా ప్రచారాలు జరిగాయి. సీన్ కట్ చేస్తే ఒక్కో పనిలో తెరవెనుక ఏం జరిగింది.. నాణ్యతా లోపం సంగతేంటి అన్నది ఇప్పుడు రేవంత్ సర్కార్ తవ్వి తీస్తుంటే ఒక్కోటి సంచలనంగా మారుతున్నాయి.

కేసీఆర్ హయాంలో కీలక పనులకు సంబంధించి జరిగింది ఇదే అంటున్నారు ఆఫీసర్లు. గత ప్రభుత్వం ఏ పెద్ద నిర్మాణ పని చేసినా అందులో చాలా లాజిక్ లు మిస్ అయినట్లే కనిపిస్తున్నాయి. ప్రగతి భవన్ దగ్గర్నుంచి సెక్రటేరియట్ దాకా ఇదే సీన్ కనిపిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం. సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. గత పదేళ్లుగా ప్రగతి భవన్ నిర్వహణ, అందులోని నిర్మాణాల ఖర్చు వ్యవహారంపై హాట్ డిబేట్ నడుస్తోంది. కొన్నయితే ఎందుకు కట్టారో తెలియదు.. ఎందుకు మెయింటెనెన్స్ ఖర్చు చేశారో తెలియదు. అదీ సంగతి.

గత సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉన్న ప్రగతి భవన్ ఆవరణలో 2 కోట్ల ఖర్చుతో బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించారు. దాని నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. క్రీడాప్రాంగణాలను గాలికొదిలేసి ఇంత ఖర్చు చేయడం ఏంటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సీఎం ఉండే బిల్డింగ్ వరకు ఓకే గానీ.. ఇలాంటి అడిషనల్ ఖర్చులే రాష్ట్ర ఖజానాకు తలకు మించిన భారమయ్యాయంటున్నారు. ఈ బ్యాడ్మింటన్ కోర్టు ఎవరి కోసం కట్టారు.. మెయింటెనెన్స్ ఇంత ఖర్చా అని ఆఫీసర్లే అవాక్కవుతున్న పరిస్థితి ఉంది. ప్రగతి భవన్ ఎక్స్ టెన్షన్ బిల్డింగ్ భూమి పూజ చేసిన టైంలో 60 కోట్లు అనుకున్న నిర్మాణ అంచనా వ్యయం.. పూర్తయ్యే సరికి 200 కోట్లు దాటిందంటున్నారు. అంతే కాదు.. 25 కోట్లు ఖర్చుచేసి ఇటలీ నుంచి ఫర్నిచర్ కూడా తెప్పించారని టాక్. ఈ ఫర్నీచర్ ది అయితే తవ్వే కొద్దీ పెద్ద పెద్ద స్టోరీలే ఉన్నాయంటున్నారు.

ఇటలీ నుంచి తెప్పించిన ఫర్నిచర్ టెండర్ లేకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారి తీసినట్టు చెబుతున్నారు. ఫర్నీచర్ కొనే అంశాన్ని అంచనాలో చెప్పలేదని, అందుకే ఆ ఖర్చును తాము భరించలేమని ఆర్ అండ్ బీ శాఖ అప్పట్లో స్పష్టం చేసింది. అయితే ఆ ఖర్చును ఏదో ఖాతా నుంచి వేయించే విషయంపై వివాదాలు వచ్చాయి. కాదన్న వారి ట్రాన్స్ ఫర్లు కూడా అయ్యాయంటున్నారు. చివరికి ఆ ఫర్నీచర్ ఖర్చును ఎలాగొలా సమకూర్చి కొన్నట్లు ఫైల్ రెడీ చేసి ఇష్యూ ముగించారు. ఆ కథలన్నీ ఇప్పుడు బయటికొస్తున్నాయి. ప్రగతి భవన్ నిర్మాణం విషయంలో ఫైల్ ఉదయం వస్తే, సాయంత్రం‌లోగా దాన్ని క్లియర్ చేయాలని ఒత్తిడి పెట్టేవారని ఆఫీసర్లలో టాక్ ఉంది. ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రతిపాదనలు సరిగా ఉన్నాయా? లేవా? అని క్రాస్ చెక్ చేసే టైమ్ కూడా ఇచ్చేవారు కాదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి, ఆ తర్వాత పరిపాలన అనుమతులు తీసుకున్నారంటున్నారు. అదీ మ్యాటర్.

గతేడాది డిసెంబర్ 5 వరకు ప్రగతిభవన్ చుట్టూ రాత్రింబవళ్లు పోలీసు పహారా ఉండేది. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపేవారు కాదు. కానీ నాటి సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు మాత్రం నాలుగు కుక్కలను పెంచుకున్నారు. వాటి రక్షణ కోసం ప్రగతిభవన్‌ ఆవరణలో 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించినట్టు లెక్కల్లో చూపినట్లు తెలిసింది. అంత ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా? లేక లెక్కల్లో తోసేశారా అన్న టాక్ నడుస్తోంది.

ఇక కొత్తగా కట్టిన సెక్రటేరియట్ పరిస్థితి కూడా అలాంటిదే. అంచనాలు మూరెడు ఖర్చు బారెడు అన్నట్లుగా కథలు నడిచాయంటున్నారు. అమెరికా వైట్‌ హౌస్‌ను తలదన్నేలా ఉందన్నారు. మేధావులు, ఇంజినీర్లు అబ్బురపడ్డారన్నారు. కేవలం 20 నెలల్లోనే సచివాలయం పూర్తి చేశారని ఘనంగా చెప్పుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అన్నారు, వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు. అద్భుతసౌధమన్నారు. దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా నిలిచిందన్నారు. ఎంతో అన్నారు. కానీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం డిఫరెంట్ గా ఉందని ఆ బిల్డింగ్ ను దగ్గరి నుంచి చూసిన వారు చెబుతున్న మాట. గత వేసవిలో కురిసిన వర్షాలకు బిల్డింగు లోపల అనేక చోట్ల వర్షపు నీరు లీకైందన్నారు. ఇప్పుడు ఏ పిల్లర్ కు ఎన్ని పగుళ్లు ఉన్నాయోనన్న ఆందోళన కనిపిస్తోంది.

ఇప్పటికి జరిగిన వ్యయం ఒక ఎత్తైతే.. ఇప్పటికీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. పెండింగ్ బిల్లుల విలువ 400 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండానే సచివాలయంలో.. ఇంటర్నెట్ ఏర్పాటులోనూ అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. సచివాలయ నిర్మాణం నాసిరకంగా ఉందంటున్నారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు. గట్టిగా రెండు రోజులు కుండపోత వర్షాలు కురిస్తే.. నిర్మాణంలోని లోపాలు బయట పడతాయని భవన నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సచివాలయం నిర్మాణ ఖర్చును సమీక్షించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తవ్వుతూ వెళ్తే ఇలాంటివెన్నో వెలుగు చూస్తున్నాయి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×