EPAPER
Kirrak Couples Episode 1

Maldives India | చైనా లేదా భారత్.. మాల్దీవ్స్‌ ఎవరిపై ఎంత ఆధారపడింది?

Maldives India | కేవలం 5 లక్షల జనాభా కలిగిన మాల్దీవ్స్ దేశం గత కొంతకాలంగా భారత్ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోంది. తాజాగా మాల్దీవ్స్ మంత్రులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హేళన చేస్తూ.. పెట్టిన ట్వీట్లు ఆ దేశానికే తీవ్ర నష్టం కలిగించాయి.

Maldives India | చైనా లేదా భారత్..  మాల్దీవ్స్‌ ఎవరిపై ఎంత ఆధారపడింది?

Maldives India | కేవలం 5 లక్షల జనాభా కలిగిన మాల్దీవ్స్ దేశం గత కొంతకాలంగా భారత్ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోంది. తాజాగా మాల్దీవ్స్ మంత్రులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హేళన చేస్తూ.. పెట్టిన ట్వీట్లు ఆ దేశానికే తీవ్ర నష్టం కలిగించాయి.


ఇండియాలో మాల్దీవ్స్‌కి వ్యతిరేకంగా #boycottmaldives, #ExploreIndianIslands అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో మాల్దీవ్స్‌కు హాలిడే ప్లాన్ చేసుకున్న భారతీయులంతా తమ యాత్రను రద్దు చేసుకుంటున్నారు. వేల సంఖ్యలో మాల్దీవ్స్‌ హోటల్ బుకింగ్స్, విమాన్ టికెట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి.

కానీ ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు. ఎందుకంటే అసలు మాల్దీవ్స్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ.. ముందునుంచి భారత వ్యతిరేక నినాదాలిస్తోంది. అధికారంలోకి రాకముందు కూడా #IndiaOut #Indianmilitaryout అంటూ ఆ పార్టీ ఉద్యమం నడిపించింది. ఆ పార్టీకి అంతర్గతంగా చైనా నుంచి నిధులు అందుతున్నాయని తెలుస్తోంది.


పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షడు, ప్రస్తుత మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమద్ మొయిజు చైనా అనుకూలంగా పనిచేస్తున్నారనడంలో ఏ సందేహం లేదు. ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మాల్దీవ్స్‌లో భారత వ్యతిరేకత పెరిగింది.అంతకుముందు ప్రెసిడెంట్ ఇబ్రహీం సొలెహ్ మాత్రం ఇండియా ఫస్ట్ అనే పాలసీతో పనిచేశారు.

మాల్దీవ్స్‌లో కేవలం 5 లక్షల 22 వేల జనాభా ఉంది. వీరిలో 98 శాతానికి పైగా ముస్లిం మతానికి చెందినవారు. మాల్దీవ్స్ నుంచి ఇండియా మధ్య 2000 కిలోమీటర్ల దూరం ఉంది. మాల్దీవ్స్ అత్యంత పొరుగుదేశం కూడా ఇండియానే.ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్న దీవుల కారణంగా మాల్దీవ్స్‌కు ఎక్కువగా భారతీయులే హాలిడేస్‌కు వెళతారు. పర్యాటక శాఖ నుంచే మాల్దీవ్స్ ముఖ్య ఆదాయం వస్తుంది.

1965లో మాల్దీవ్స్‌కు బ్రిటీషర్ల నుంచి స్వాతంత్ర్యం లభించింది.ఆ సమయంలో మాల్దీవ్స్ కొత్త ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది ప్రప్రథమంగా భారతదేశం ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు దేశాలు.. రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్య అంశాలపై కలిసి పనిచేస్తున్నాయి. మిలిటరీ పరంగా మాల్దీవ్స్‌కు ఏ అవసరం వచ్చినా భారత్ సహాయం చేస్తోంది.

అలాగే 1978లో శ్రీలంక ఉగ్రవాదులు, మాల్దీవ్స్ విద్రోహ శక్తులు కలిసి విధ్వంసం సృష్టించినప్పుడు.. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కాక్టస్ జరిపి మాల్దీవ్స్‌ను కాపాడింది. 2014 మాల్దీవ్స్‌లో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తినప్పుడు ఇండియా యుద్ధ నౌకలలో తాగునీరు సరఫరా చేసింది. కరోనా సమయంలో మాల్దీవ్స్ ప్రజలకు వ్యాక్సిన్లు ఉచితంగా అందించింది.. భారత్. కానీ ఇవన్నీ మరిచిపోయి మాల్దీవ్స్ కొత్తగా చైనా భజన చేస్తోంది.

చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న మాల్దీవ్స్
మాల్దీవ్స్‌లో కొత్తగా భారత్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందరికంటే ముందుగా చైనా శుభాకాంక్షలు తెలిపింది. మాల్దీవ్స్ కొత్త ప్రెసిడెంట్ మొయిజు పదవి చేపట్టిన వెంటనే చైనాను ఆకాశానికి ఎత్తేశారు. మాల్దీవ్స్‌లో చైనా నిర్మించిన ప్రాజెక్ట్లతో మాల్దీవ్స్ రూపురేఖలే మారిపోయాయని పొగడ్తలతో ముంచెత్తారు. మెయిజు నిజానికి మాల్దీవ్స్ మాజీ ప్రెసిడెంట్, అవినీతి పరుడు అబ్దుల్లా యమీన్ అనుచరుడు. అబ్దుల్లా యమీన్ హయాంలోనే చైనా.. మాల్దీవ్స్ మధ్య స్నేహం చిగురించింది. ప్రస్తుతం అబ్దుల్లా యమీన్ అవినీతి నేరాలకు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన అనుచరుల సహాయంతోనే ప్రస్తుత ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజు ఎన్నికలలో గెలిచారు.

అబ్దుల్లా యమీన్ హయాంలో మాల్దీవ్స్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పైగా అబ్దుల్లా యమీన్ మాల్దీవ్స్‌లో సైనిక పాలన విధించి.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీంతో పశ్చిమ దేశాలు, ఇండియా.. అబ్దుల్లా యమీన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే మాల్దీవ్స్‌కు ఆ సమయంలో ఎక్కడా అప్పులు, ఆర్థిక సహాయం లభించలేదు. దీంతో అబ్దుల్లా యమీన్ చైనాకు వెళ్లి అప్పు కావాలని అడిగారు. ఇదే అదునుగా తీసుకొని చైనా.. మాల్దీవ్స్‌కు భారీగా అప్పులు ఇచ్చింది.

2018 చివరికల్లా మాల్దీవ్స్ అప్పుల్లో 70 శాతం చైనా నుంచి తీసుకున్నవే. ఆ సమయంలోనే చైనా నుంచి మాల్దీవ్స్ తీసుకున్న మొత్తం అప్పు 3 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇలాంటి చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఎంతటి దీనమైన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మాల్దీవ్స్ కూడా త్వరలోనే ఆ పరిస్థితికి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మాల్దీవ్స్ జీడీపీలో 10 శాతం చైనా అప్పులు తీర్చడానికే!
మాల్దీవ్స్ వార్షిక జీడిపీ 540.56 కోట్ల డాలర్లు. వీటిలో పది శాతం చైనా నుంచి తీసుకున్న అప్పులు చెల్లించడానికే సరిపోతోంది. మాల్దీవ్స్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. మాల్దీవ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్తు, వాణిజ్య రంగాలలో చైనా తన ప్రయోజనాల దృష్ట్యా భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో క్రమంగా మాల్దీవ్స్ చైనా పన్నిన అప్పుల వలో కూరుకుపోతోంది.

మాల్దీవ్స్‌కు చెందిన చాలా దీవుల్లో చైనా భాగస్వామ్యంతో మాల్దీవ్స్ ప్రభుత్వం పెద్ద పెద్ద హోటళ్లు నిర్మిస్తోంది. కానీ మాల్దీవ్స్ ప్రభుతవ్ం చైనా నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేని స్థితిలో కొంతకాలం తరువాత ఈ దీవులు, హోటళ్లు చైనా ఆక్రమించుకుంటుంది. ఉదాహరణకు శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టు చైనా కంపెనీలు నిర్మించాయి. ఆ నిర్మాణానికి అయిన ఖర్చుని శ్రీలంక ప్రభుత్వం చెల్లించలేక ఆ పోర్టుని చైనా సొంతం చేసుకుంది.

పశ్చిమాసియా జలసంధులైన ఈడెన్, హోర్ముజ్.. అలాగే దక్షిణ తూర్పు దిశలో ఉన్న మలక్కా జలసంధి నుంచి నడిచే అంతర్జాతీయ కార్గో షిప్పింగ్ బిజినెస్ పరంగా మాల్దీవ్స్ భౌగోళిక రూపం చాలా కీలకమైనది. మాల్దీవ్స్ చిన్న చిన్న దీవులో ఈ జలసంధుల నుంచి రాకపోకలు జరిగే మార్గంలో ఉన్నాయి. ఈ మార్గంలోనే ఇండియా, చైనా, జపాన్ దేశాలకు విద్యుత్తు సరఫరా కూడా జరుగుతుంది.

భారత్ అంతర్జాతీయ వ్యాపారంలో దాదాపు 50 శాతం, విద్యుత్తు దిగుమతుల్లో 80 శాతం అరేబియా సముద్రం వైపు నుంచి మాల్దీవ్స్ మీదుగా జరుగుతుంది. పైగా SAARC, SASIC లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇండియా, మాల్దీవ్స్ సభ్యులుగా ఉన్నారు. వాణిజ్య పరంగా చూస్తే భారత్, మాల్దీవ్స్ మధ్య వ్యాపారం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.

2022లో భారత్ – మాల్దీవ్స్ మధ్య 4000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.ఇందులో ఎక్కువగా భారత్ నుంచి మాల్దీవ్స్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో Refined Petroleum, గోధుమ పిండి, పప్పు, కూరగాయలు, బియ్యం, గుడ్లు, మెడిసిన్ వంటివి భారత్ నుంచి మాల్దీవ్స్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం సరుకుల విలువ 3680 కోట్లు.. అంటే మొత్తం వ్యాపారంలో భారత్ నుంచి మాల్దీవ్స్ చేసుకున్న దిగుమతులే ఎక్కువ.

మాల్దీవ్స్ చరిత్ర చూస్తే.. ఇండియా ఒక మిత్రదేశంగానే ఉంది. కానీ చైనా అప్పుల మాయలో పడి మాల్దీవ్స్ ఒక మంచి మిత్రుడిని దూరం చేసుకుంటోంది. మరోవైపు భారత్ చుట్టూ ఇప్పటికే చైనా దిగ్భంధనం సృష్టిచింది. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక దేశాలు చైనా కంట్రోల్‌లోకి వెళ్లిపోయాయి. బంగ్లాదేశ్ కూడా చైనా నుంచి అప్పులు తీసుకుంటూనే ఉంది. ఇలా భారత్ పొరుగుదేశాలన్నీ చైనా చెప్పుచేతల్లోకి వెళ్లిపోతున్న తరుణంలో మాల్దీవ్స్‌తో స్నేహసంబంధాలు తెంచుకోవడం భారత్ కూడా భవిష్యత్తు దృష్ట్యా అంతమంచిది కాదు.శ్రీలంకలా మాల్దీవ్స్ తన నాశనాన్ని తనే కోరితెచ్చుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు.. కానీ ఈ విషయంలో భారత్ జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది.

Tags

Related News

Tirupati Laddu Sanctity Restored: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..

Balineni Vs Damacharla: బాలినేని చిచ్చు.. జనసేన, టీడీపీ మధ్య విభేదాలు?

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Big Stories

×