EPAPER
Kirrak Couples Episode 1

Emoji : ఎమోజీ.. వెయ్యి భావాల పెట్టు!

Emoji : ఎమోజీ.. వెయ్యి భావాల పెట్టు!
emoji

Emoji : పది పదాల్లో చెప్పే భావాన్ని ఒక్క ఎమోజీతో సరిపెట్టేయవచ్చు. వాట్సాప్ లాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వీటి ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది. భావోద్వేగం ఏదైనా చక్కటి ఎమోజీలతో వ్యక్తపరిచే వీలుంది. బాధ, సంతోషం, కోపం ఒకటేమిటి అన్నింటినీ బొమ్మల రూపంలో వ్యక్తీకరించొచ్చు.


ఆన్‌లైన్ సంభాషణలో అత్యంత కీలకమైనది ఎమోజీయే. మెసేజింగ్ యాప్ అయినా..సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయినా సందేశాలన్నీ ఎమోజీలుగా మారుతున్నాయి. టెక్ట్సింగ్ కంటే వీటి వినియోగమే ఎక్కువ కావడానికి కారణమిదే. టెక్ట్స్ బేస్డ్ కమ్యూనికేషన్లలో ఇప్పుడు వీటి పాత్రను తక్కువ చేయలేం. ‘ఫేస్ ఆఫ్ టియర్స్ ఆఫ్ జాయ్’ ఎమోజీ ఎనలేని ఆదరణ పొందింది. ఏడాది ఏటి మేటి పదంగా ఈ ఎమోజీని 2015లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఎంపిక చేసింది.

టీనేజర్లు, మిలీనియల్సే కాదు..దిగ్గజ కార్పొరేట్ సంస్థలు కూడా తమ కమ్యూనికేషన్లలో ఎమోజీలను వినియోగిస్తుండటం విశేషం. వైట్‌హౌస్ అయితే ఏకంగా తమ ఎకనమిక్ సర్వేలో ఎమోజీని వినియోగించింది. వ్యక్తీకరించాల్సిన భావాన్ని సూటిగా, సుత్తి లేకుండా సులువైన రీతిలో చెప్పేయడమన్నది ఎమోజీల ద్వారా సాధ్యమవుతోంది. నిరక్షరాస్యులు సైతం వీటిని వినియోగించేలా చక్కటి బొమ్మలతో వీటిని రూపొందిస్తుండటం విశేషం.


1862లో అమెరికా 16వ అధ‍్యక్షుడు అబ్రహాం లింకన్‌ ప్రసంగిస్తూ చూపిన హావభావాలే.. ఎమోజీ పుట్టుకకు నాందిగా చెబుతుంటారు. ప్రసంగంలో ఆయన కన్నుగీటడం అప్పట్లో పాపులర్‌ అయింది. దీంతో మరుసటి రోజు పలు వార్తాపత్రికలు ఆయన ప్రసంగం వార్తతో పాటే పక్కనే కన్ను గీటే ఎమోజీలనూ ముద్రించాయి. ఇలా ఎమోజీలు పుట్టుకొచ్చాయనే వాదన ఒకటి ఉంది.

ఆ తర్వాత యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లలో వినియోగదారుల సౌకర్యం కోసం యాహూ సంస్థ ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. చాటింగ్‌లో ఎదుటి వ్యక్తి కనిపించరు కాబట్టి హావభావాల వ్యక్తీకరణకు యాహూ వీటిని నెటిజన్లకు పరిచయం చేసింది. సాంకేతిక రంగంలో అలా ఆరంభమైన ఎమోజీల ప్రస్థానం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది.

2010 తర్వాత ఇవి మొబైల్‌ మెసేజింగ్ ఆప్షన్‌లోకి ప్రవేశించాయి. అయితే మెుబైల్ రంగంలోకి ఎమోజీలను తీసుకొచ్చిన ఘనత మాత్రం జపాన్‌‌ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’ ఇంజినీర్‌ షిగెటకా కురిటాకు దక్కుతుంది. తొలిసారి ఆయన 1999లో ఎమోజీల కోసం 12 బై 12 పిక్సెల్ డ్రాయింగ్స్‌ సెట్‌ను సిద్ధం చేశారు. తొలి ఎమోజీ సెట్‌లో 176 భిన్నమైన చిత్రాలున్నాయి. న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ఇప్పటికీ ఈ సెట్‌ను చూడొచ్చు.

ఎమోజీల కన్నా ముందు ఎమోటికాన్స్ అనే గ్రాఫిక్ లాంగ్వేజిని ఉపయోగించేవారు. కీ బోర్డుపై అందుబాటులో ఉన్న పంక్చుయేషన్ మార్క్స్ సాయంతో ఎమోటీకాన్స్‌ను రూపొందించేవారు. వీటిని తొలిసారి తయారు చేసింది కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కంప్యూటర్ సైంటిస్ట్ స్కాట్ ఫహిమాన్. 19 సెప్టెంబర్ 1982న ఎమోటీకాన్స్ ఆలోచనను కార్నెగీ మెలన్ మెసేజ్ బోర్డు ముందుంచారు. మెసేజ్ బోర్డు అంటే ఓ రకంగా ఆన్‌లైన్ చాట్‌రూమ్స్ అన్నమాట. 1990 నుంచీ మెసేజ్ బోర్డు, డిజిటల్ ఫోరమ్స్ ఎమోటీకాన్స్‌ను విపరీతంగా వాడటం ఆరంభించాయి.

ఎమోజీలు యూనికోడ్ కన్సార్షియం అనే సంస్థ నియంత్రణలో ఉంటాయి. అందుకే వేటిని పడితే వాటిని వినియోగంలోకి తీసుకురారు. యూనికోడ్ ఆమోదం తర్వాతే వినియోగంలోకి తీసుకొస్తారు. అనంతరం మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అందుబాటులోకి వస్తాయి. యూనికోడ్ కన్సార్షియంలో పలు దిగ్గజ టెక్నాలజీ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం చాటింగ్, గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్‌లలో కూడా ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొత్తంగా 3,663 ఎమోజీల వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో వంద ఎమోజీలను మాత్రమే విరివిగా ఉపయోగిస్తున్నారు.

Related News

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Chinese Rocket: ల్యాండింగ్ సమయం.. ఒక్కసారిగా పేలిన చైనా రాకెట్

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Sri Lanka: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

Man Wins Energy Drink Lottery: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

Pakistan Diplomat Convoy: పాకిస్తా‌న్ లో రష్యా, ఇరాన్ సహా 12 మంది డిప్లమాట్స్ పై బాంబు దాడి.. పోలీస్ ఆఫీసర్ మృతి

PM Narendra Modi: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

Big Stories

×