EPAPER
Kirrak Couples Episode 1

Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తుల నిర్లక్ష్యం.. అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు..

Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తుల నిర్లక్ష్యం.. అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు..

Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారని హయత్‌నగర్ సర్కిల్ వాల్యుయేషన్ అధికారిపై వేటు వేసింది. సోమవారం బాలానగర్‌లో రోడ్డుపై ప్రజపాలన దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. డేటా ఎంట్రీ కేంద్రానికి తరలిస్తుండగా ఈ పత్రాలు రోడ్డుపై పడ్డాయని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులుగా హయత్‌నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కొత్త ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురైయ్యారు. ఈ ఘటన బాలానగర్​లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్న సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ పై పడ్డాయి. ఆ వాహనదారుడు కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా.. స్థానికులు దరఖాస్తులను గమనించి వాహనదారుడుని నిలదీశారు. హయత్ నగర్ సర్కిల్​కు చెందిన దరఖాస్తులు.. బాలానగర్​లో ఎందుకు ఉన్నాయని స్థానికులు ప్రశ్నించారు.

దీంతో అతను ర్యాపిడో బుక్ చేయగా తాను కేవలం వాటిని ఓ చోటు నుంచి మరో చోటుకు తరలిస్తునన్నానని తెలిపాడు. అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉన్నాయి. వాటిపై హయత్ నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేసింది. అనంతరం ఆ పత్రాలు బయటకి వచ్చిన కారణాలు తెలుసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు హయత్‌నగర్ సర్కిల్-3 సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.


Related News

BRS: తెలంగాణలో వైసీపీ మాదిరిగా.. బీఆర్ఎస్ రాజకీయాలు, ఎందుకిలా..?

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Digital Card: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ కార్డు.. ఇకనుంచి అన్ని పథకాలు ఈ కార్డు ద్వారానే…!

Farmers: మొన్న రుణమాఫీ.. ఇప్పుడు దసరా వేళ రైతులకు మరో భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Rain Alert: ఇవాళ, రేపు తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

Big Stories

×