EPAPER
Kirrak Couples Episode 1

Vijayasai Reddy : ‘జనసేన గుర్తింపు లేని పార్టీ.. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోండి..’

Vijayasai Reddy : జనసేన అనేది గుర్తింపు లేని పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎక్కడా బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్టు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు అక్రమంగా ఓట్ల వివరాలు నమోదు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఓటరును ఓటు ఏ పార్టీకి వేశారని ఎలా అడుగుతారని టీడీపీ నేతలను విమర్శించారు.

Vijayasai Reddy : ‘జనసేన గుర్తింపు లేని పార్టీ.. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోండి..’

Vijayasai Reddy : జనసేన గుర్తింపు లేని పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం సీఈసీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎక్కడా బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్టు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు అక్రమంగా ఓట్ల వివరాలు నమోదు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఓటరును ఓటు ఏ పార్టీకి వేశారని ఎలా అడుగుతారని టీడీపీ నేతలను మీడియా ముఖంగా ప్రశ్నించారు.


టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ వెబ్‌సైట్ పెట్టి తప్పుడు హామీలతో ఓ బాండ్‌ను ఇస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా బహిరంగ సభలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని విమర్మించారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను, ముఖ్యమంత్రిని అసభ్యకర పదజాలంతో తిట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.

తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌కు ఒకేరోజు లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఈసీ అధికారులను కోరినట్లు తెలిపారు. చంద్రబాబు జీవితమే కుట్ర జీవితం అని ఆరోపణలు గుప్పించారు. లోకేశ్‌, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.


Related News

Mumbi Actress Case: నటి కాదంబరి కేసు, రేపో మాపో ఐపీఎస్‌ల అరెస్ట్! తెర వెనుక చుట్టూ

TDP vs YSRCP Cadre: నూజివీడులో వైసీపీ కార్య‌కర్త నోటి దురుసు.. కాళ్లు చేతులు కట్టేసి, ఆపై..

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Flood Victims: వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

TTD Assets : టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

honorarium: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

Tirumala Laddu Issue: ఏఆర్ డెయిరీ లారీ వివరాలు విడుదల.. ఎంతకి దిగజారావ్ జగన్ : టీడీపీ ఫైర్

Big Stories

×