EPAPER
Kirrak Couples Episode 1

Surrogacy : సరోగసి అంటే ఏమిటి..? మహిళలు అద్దె తల్లులుగా ఎందుకు మారుతున్నారు..?

Surrogacy : సరోగసి అంటే ఏమిటి..? మహిళలు అద్దె తల్లులుగా ఎందుకు మారుతున్నారు..?

Surrogacy : మాతృత్వ మధురిమలు.. తొమ్మది నెలలు బిడ్డను మోసి కంటేనే తెలుస్తుంది. ఆ భార్యభర్తలకు ఎక్కడలేని ఆనందం ఉంటుంది. డెలివరీ వరకూ కంటికి రెప్పల కపాడుకుంటారు. ఆ తరువాత కూడా ఆ బేబీని చూసుకోవడంలోనే రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. అందంతా వేరే ప్రపంచం. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సినీతారలు.. ఉద్యోగస్తులు సరోగసి పద్థతిని ఎంచుకుంటున్నారు. మొదటి ఇలాంటి పద్థతి కూడా ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒకరితో మొదలైన ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అసలు ఈ పద్థతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సరోగసి అంటే..?

అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం సరోగసి అంటారు. పిల్లలను కావాలనుకునే జంట.. మహిళ, పురుషుడు వీర్యాన్ని మరొక మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. ఆ జంటకోసం బిడ్డను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళను సర్రోగేట్ మదర్ అంటారు. వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు. ముందుగానే ఒప్పదం కుదుర్చుకుంటారు.


సరోగసి ఉంచుకోవడానికి ప్రధాన కారణం.. ఆ స్త్రీకి సరైన ఆరోగ్య పరిస్థితులు లేకపోవడం, వ్యక్తిగత సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు లేదా స్త్రీకి గర్భస్రావం, గర్భం ప్రమాదకరంగా మారినప్పుడు, గర్భం దాల్చలేని సమయంలో ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. ప్రపంచ వ్యప్తంగా సరోగసి వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో సరోగసి ప్రాచుర్చం పొందింది.

సరోగసి నిబంధనలు

  • సర్రోగేట్‌గా మారే మహిళకు వివాహం అయి ఉండాలి
  • ఆమె సొంతంగా ఒక బిడ్డకు జన్మినచ్చి ఉండాలి
  • సర్రోగేట్‌ మదర్ వయసు 25 నుంచి 35 మధ్యలో ఉండాలి
  • సరోగసి ఎంచుకున్న జంటకు బంధువులై ఉండాలి.
  • ఒక సర్రోగేట్‌ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగసి చేయించుకోవాలి.
  • సర్రోగేట్‌, బిడ్డ మొత్తం ఖర్చులు సరోగసి పొందుతున్న తల్లిదండ్రులు చెల్లించాలి.

సరోగసిపై వివాదాలు
సంతానం కోసం కొన్ని జంటలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలతో కొందరు మహిళలు సంతానాన్ని పొందలేక దుఃఖిస్తుంటే.. డబ్బున్న కొందరు సెలెబ్రిటీలు అద్దె గర్భం ద్వారా సంతానాన్ని కలగడంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్థిక సమస్యలు కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారు. మన దేశంలో మాత్రం సరోగసి వ్యాపారంగా అవతరించిందని అంటున్నారు. సర్రోగేట్‌గా అద్దెకు గర్భాన్ని ఇచ్చేదాన్ని బట్టి రూ.15 నుంచి 30 లక్షల వరకు డబ్బులు వసూల్ చేస్తున్నారు. ప్రభుత్వాల నియంత్రణ లోపంతో దేశంలో సరోగసి దుర్వినియోగం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Big Stories

×