EPAPER
Kirrak Couples Episode 1

Kesineni Nani : నాన్నపై ప్రేమతో.. కార్పొరేటర్ పదవికి రాజీనామా.. టీడీపీకి శ్వేత ట్విస్ట్..

Kesineni Nani : బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గలేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. నాని మాత్రం అధినేత చంద్రబాబుకి తన అవసరం లేదని తేలిపోయిందంటూ రాజీనామా ఎపిసోడ్‌కు తెర లేపారు. బెజవాడ కేశినేని ట్రావెల్ స్పీడ్ పెంచింది.. ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్‌ని కలసి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి .. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని ట్వీట్ చేయడంతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ రసవత్తరంగా తయారయ్యాయి. ఆ క్రమంలో నాని తాజా పోస్టులో పేర్కొన్నట్లు ఆయన కుతూరు శ్వేత కార్పొరేటర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ట్టిస్ట్ ఇచ్చారు.

Kesineni Nani : నాన్నపై ప్రేమతో.. కార్పొరేటర్ పదవికి రాజీనామా..  టీడీపీకి శ్వేత ట్విస్ట్..

Kesineni Nani : బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గలేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. నాని మాత్రం అధినేత చంద్రబాబుకి తన అవసరం లేదని తేలిపోయిందంటూ రాజీనామా ఎపిసోడ్‌కు తెర లేపారు. బెజవాడ కేశినేని ట్రావెల్ స్పీడ్ పెంచింది.. ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్‌ని కలసి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి .. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని ట్వీట్ చేయడంతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ రసవత్తరంగా తయారయ్యాయి. ఆ క్రమంలో నాని తాజా పోస్టులో పేర్కొన్నట్లు ఆయన కుతూరు శ్వేత కార్పొరేటర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు.


త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్‌లో మరో పోస్ట్ పెట్టి ట్విస్ట్ ఇచ్చారు . తన కూతురు కేశినేని శ్వేత బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి.. తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పోస్టులో పేర్కొన్నారు. దానికి తగ్గట్టే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్వేత రిజైన్ చేయడంతో కేశినేని రాజీనామాల పర్వంలో మొదటి అడుగుపడినట్లైంది.

రాజీనామాకు ముందు శ్వేత.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ఇంటికెళ్లి రాజీనామా విషయాన్ని గద్దె దంపతులకు చెప్పి వచ్చారు. తనకు కార్పొరేటర్‌గా బీ ఫాం ఇచ్చింది గద్దె రామ్మెహన్ అని.. అందుకే మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి.. తన రాజీనామాకు గల కారణాలను వివరించి వచ్చానని శ్వేత మీడియాకు వెల్లడించారు.


అసలు శ్వేత ఇష్యూనే ప్రస్తుతం కేశినేని నాని ఎపిసోడ్‌కి బీజం వేసిందంటారు. అప్పట్లో శ్వేత కార్పొరేటర్‌గా టికెట్ ఇప్పించుకున్నప్పుడే ఆమెను మేయర్‌ని చేయాలని భావించారు కేశినేని నాని.. దాన్ని బుద్దా వెంకన్న తదితర సొంత పార్టీ నేతలు వ్యతిరేకించారు.. అప్పుడే బెజవాడ టీడీపీ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి.. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత గెలిచినా… టీడీపీ మాత్రం పరాజయం పాలైంది.. అయినా ఆ విబేధాలు కొనసాగుతూనే వస్తున్నాయి. నాని ట్వట్టర్ వార్ మొదలు పెడితే.. కార్పొరేటర్ శ్వేత కూడా పార్టీ కార్యక్రమాల్లో గెస్ట్ అపిరియన్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు రిజైన్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించి ఉన్నారు. ఆ ఎఫెక్ట్‌తో బెజవాడ టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తిరువూరు కేంద్రంగా మొదలైన టీడీపీలో అంతర్గత పోరు కేశినేని నాని రాజీనామా నిర్ణయానికి దారి తీసింది. తిరువూరులో జరిగిన.. రా కదిలి రా.. సభ ఏర్పాట్ల సందర్భంగా కేశినేని సోదరుల మధ్య ఉన్న ఆధిపత్యపోరు బయటపడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన నాటి నుంచి.. సోషల్ మీడియాలో పోస్టులు, చేతలతో వివాదాస్పదంగా తయారవుతూ వచ్చిన కేశినేని నానిని.. తిరువూరు ఏర్పాట్లకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. దాంతో కేశినేని నాని రాజీనామా ట్వీట్ చేయడంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

తిరువూరులో జరిగిన చంద్రబాబు సభలో ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది..
పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ప్రకటించినప్పటికీ.. నాని మాత్రం మా వాడేనని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే.. చంద్రబాబు సభలో కేశినేని కోసం ఓ కుర్చీ కూడా ఏర్పాటు చేశామంటున్నారు. సభకు ముందే ఎంపీ కనకమేడల స్వయంగా కేశినేని ఇంటికి వెళ్లి మాట్లాడారు. కుర్చీ వేయడం.. కనకమేడల రవీంద్రకుమార్‌ను రాయబారానికి పంపించడంతో.. పార్టీలో కేశినేని ప్రియారిటీ తగ్గలేదన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.

ఇప్పుడు కూతురుతో రాజీనామా చేయించిన కేశినేని నాని తాను కూడా రిజైన్ చేయడం ఖాయమంటున్నారు. నాని రిజైన్ చేస్తే.. పార్టీపరంగా తగిన ప్రాధాన్యత కల్పించినప్పటికీ పార్టీని వీడారని చెప్పుకునే అవకాశం టీడీపీకి ఉంటుంది. అప్పుడు తన రాజీనామా కారణాలు వివరించుకునే విషయంలో నాని డిఫెన్స్‌లో పడటం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నాని మాత్రం చంద్రబాబుపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే.. తన అవసరం లేనపుడు పార్టీలో ఉండటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. పార్టీపై, చంద్రబాబుపై కానీ ఎక్కడా నెగిటివ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం లేదు. పార్టీకి విధేయుడినే అన్న కలర్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేపు ఆయన అడుగులు ఎటు పడినా పార్టీ కేడర్ ఎంతో కొంత తన వెంట నడుస్తుందని ఆయన భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ లెక్కలతోనే కూతురు శ్వేతతో రాజీనామా చేయించిన కేశినేని నాని.. విజయవాడలోని కేశినేని భవన్ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాలను సైతం తొలగించినప్పటికీ .. తన రాజీనామాపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారంటున్నారు. మరి చూడాలి నాని రాజీనామ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో?

.

.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×